పీఎఫ్ క్లెయింలకు సంబంధించి పింఛను నియంత్రణ సంస్థ విధానాలను సులభతరం చేసేందుకు ప్రయత్నం చేస్తోంది. ఆన్‌లైన్ క్లెయింలు లేదా ఆన్‌లైన్ ట్రాన్స్‌ఫర్ వంటి వాటితో పాటు తీసుకున్న కొత్త నిర్ణయాలు 4 క
పీఎఫ్ క్లెయింలకు సంబంధించి పింఛను నియంత్రణ సంస్థ విధానాలను సులభతరం చేసేందుకు ప్రయత్నం చేస్తోంది. ఆన్‌లైన్ క్లెయింలు లేదా ఆన్‌లైన్ ట్రాన్స్‌ఫర్ వంటి వాటితో పాటు తీసుకున్న కొత్త నిర్ణయాలు 4 కోట్ల మందిపై ప్రభావం చూపనున్నాయి. సాధారణంగా మన బేసిక్ వేతనంలో 12% డబ్బును పీఎఫ్ ఖాతాలో జమ చేస్తారు. దీంతో పాటు యాజమాన్యం సైతం సమానమైన డబ్బును మన పీఎఫ్ ఖాతాకు కేటాయిస్తుంది. అయితే యాజమాన్యం 3.67% డబ్బును పెన్షన్ ఖాతాకు మళ్లిస్తారు. వీటి గురించి ఈపీఎఫ్‌వో చేసిన కొన్ని మార్పుల వల్ల పీఎఫ్ చందాదారులకు ప్రయోజనం కలుగుతుంది. అవేంటో తెలుసుకుందాం.

1) ఆధార్ అనుసంధానం
మీరు ప్రయివేటు రంగంలో ఎక్కడ పనిచేస్తున్నా ఖాతాకు బ్యాంకు ఖాతా, ఆధార్ అనుసంధానాన్ని పూర్తిచేయండి. ఇప్పుడంతా పీఎఫ్ డబ్బు ఆన్‌లైన్ ట్రాన్స్‌ఫర్ ద్వారానే బదిలీ అవుతోంది. పీఎఫ్ సొమ్మును ఆన్‌లైన్‌లో చందాదారుకు బదలాయించడం వల్ల సమయం ఆదా అవడంతో సులభంగా ట్రాక్ చేయడానికి వీలవుతుంది. దీని వల్ల 4.5 కోట్ల పీఎఫ్ చందాదారులు, 54 లక్షల పెన్షనర్లు లబ్ది పొందుతారు.

2) ఈటీఎఫ్‌ల్లో పెట్టుబడులు
పీఎఫ్ చందాదారుల సొమ్ములో మొత్తం 5% సొమ్మును ఈక్విటీ లేదా ఈక్విటీ సంబంధిత పథకాల్లో పెట్టుబడులు పెడుతున్నారు. ప్రస్తుతం 5శాతంగా ఉన్నదాన్ని 15శాతం వరకూ అనుమతించేందుకు ఆర్థిక శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆగస్టు, 2015లో ఈపీఎఫ్ఓ 5% సొమ్మును ఇన్వెస్ట్ చేయడం మొదలుపెట్టింది. 2015-16 సంవత్సరంలో రూ.6577 కోట్లను, 2016-17లో రూ.14,982 కోట్లను పెట్టుబడులుగా పెట్టారు. ఈటీఎఫ్ పెట్టుబడుల ద్వారా రూ.234 కోట్ల డివిడెండ్ ఆదాయం వచ్చిందని, అంటే ఇది 13.72% మేర రాబడి(వడ్డీ తరహా ఆదాయం) అని కార్మిక శాఖా మంత్రి తెలిపారు.

3) యూఏఎన్
యూఏఎన్ నంబరును యాక్టివేట్ చేసుకుని, ఆధార్ ఈ-కేవైసీ పూర్తయిన చందాదారులు పీఎఫ్ ఫైనల్ సెటిల్‌మెంట్‌ను మొత్తం ఆన్‌లైన్ ప్రక్రియలోనే పూర్తిచేయవచ్చు. పీఎఫ్ పాక్షిక విత్‌డ్రాయల్, పెన్షన్ విత్‌డ్రాయల్ వంటి వాటిని యూఏఎన్ సాయంతో తొందరగా చేసుకోవచ్చు.

4) నేరుగా బ్యాంకు ఖాతాలోకే
ఆన్‌లైన్ క్లెయిం విధానంలో ఉన్న సౌలభ్యం ఏంటంటే మీరు ఉద్యోగం చేసిన సంస్థ లేదా పీఎఫ్ నియంత్రణ సంస్థ ఫీల్డ్ ఆఫీసర్లను సంప్రదించకుండానే ఫారంను ఆన్‌లైన్‌లో సబ్‌మిట్ చేయవచ్చు. మీరు సమర్పించిన ఫారం ఈపీఎఫ్‌వో డేటాబేస్‌లో ఆన్‌లైన్‌లోనే కేంద్ర కార్యాలయానికి చేరుతుంది. అక్కడ ప్రక్రియ పూర్తయిన తర్వాత నేరుగా మీ బ్యాంకు ఖాతాకు డబ్బు వస్తుంది.

5) పాక్షిక విత్‌డ్రాయల్స్
ఇంతకు ముందు పాక్షిక విత్‌డ్రాయల్స్ విషయంలో కొన్ని నిబంధనలు కఠినంగా ఉండేవి. వాటిని ఈ మధ్య కాస్త సులభతరం చేశారు. పీఎఫ్ కార్యాలయానికి వెళ్లడం లేదా యాజమాన్యాల ద్వారా పేపర్ల ద్వారా మాత్రమే పాక్షిక విత్‌డ్రాయల్స్‌కు తావుండేది. ఆన్‌లైన్ అయిన తర్వాత కొన్ని సులువు అయ్యాయి. ప్రస్తుతం యూఏఎన్ ఖాతా కలిగిన వారు ఆధార్ లింక్ చేసి ఉంటే పాక్షిక విత్‌డ్రాయల్స్‌కు అదనంగా ఎటువంటి ఆధారాలు సమర్పించాల్సిన పనిలేదు.
More From GoodReturns

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?



Click it and Unblock the Notifications