For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఈఎల్ఎస్ఎస్‌ల్లో పెట్టుబ‌డి పెట్టాల‌నుకుంటున్నారా? అయితే వీటిని ప్ర‌య‌త్నించండి

ప‌న్ను ప్ర‌యోజ‌నాల‌తో పాటు మంచి రాబ‌డి ఇవ్వ‌గ‌ల వాటిలో ఈఎల్ఎస్ఎస్ ప‌థ‌కాల‌ను ఉత్త‌మ‌మైన‌విగా చెప్పుకోవ‌చ్చు. మ‌న ద‌గ్గ‌ర నుంచి సేక‌రించిన డ‌బ్బుల‌ను ఈ ప‌థ‌కాలు ఈక్విటీ ఆధారిత మ్యూచువ‌ల్ ఫండ్ల‌లో

|

ప‌న్ను ప్ర‌యోజ‌నాల‌తో పాటు మంచి రాబ‌డి ఇవ్వ‌గ‌ల వాటిలో ఈఎల్ఎస్ఎస్ ప‌థ‌కాల‌ను ఉత్త‌మ‌మైన‌విగా చెప్పుకోవ‌చ్చు. మ‌న ద‌గ్గ‌ర నుంచి సేక‌రించిన డ‌బ్బుల‌ను ఈ ప‌థ‌కాలు ఈక్విటీ ఆధారిత మ్యూచువ‌ల్ ఫండ్ల‌లో పెట్టుబ‌డులు పెడ‌తాయి. మ్యూచువ‌ల్ ఫండ్ల‌లో పెట్టుబ‌డులు పెట్టాల‌నుకునే ఆలోచ‌న ఉన్న‌వారు సైతం ఈ ఆప్ష‌న్ ఎంచుకోవ‌చ్చు. క‌నీసం రూ. 500 నుంచి పెట్టుబ‌డి పెట్టేందుకు అవ‌కాశం ఉంటుంది. ఈఎల్ఎస్ఎస్ ప‌థకాల్లో పెట్టే పెట్టుబ‌డుల‌కు ఆదాయ‌పు ప‌న్ను చ‌ట్టం సెక్ష‌న్ 80సీ కింద ప‌న్ను మిన‌హాయింపు ప్ర‌యోజ‌నాలు ద‌క్కుతాయి. ఈఎల్ఎస్ఎస్‌ ప‌థ‌కాల్లో లాక్ఇన్ పీరియ‌డ్ మూడేళ్లు ఉంటుంద‌ని గుర్తుంచుకోవాలి. ట్యాక్స్ సేవింగ్ ప‌థ‌కాల్లో దీనికే అతి త‌క్కువ లాక్ ఇన్ పీరియ‌డ్‌ అని చెప్పాలి. ఆరు ఉత్త‌మ ఈఎల్ఎస్ఎస్ ప‌థ‌కాలివే...

డీఎస్‌పీ బ్లాక్‌రాక్ ట్యాక్స్ సేవ‌ర్ ఫండ్

డీఎస్‌పీ బ్లాక్‌రాక్ ట్యాక్స్ సేవ‌ర్ ఫండ్

ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్‌లో దీనికి క్రిసిల్ ఒక‌టో ర్యాంకునిచ్చింది. వాల్యూ రీసెర్చ్ 5 స్టార్ రేటింగ్ ఇచ్చింది. దీని పోర్ట్‌ఫోలియోలో ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, ఇన్ఫోసిస్ ఉన్నాయి. వ్య‌క్తులు ఎవ‌రైనా నెల‌వారీ క‌నీసం రూ. 500 నుంచి మొద‌లుకొని మొత్తం ఫండ్ క‌నీస పెట్టుబ‌డి రూ. 5000గా పెట్ట‌వ‌చ్చు.

ఈ ప‌థ‌కం ఆరంభం నుంచి 14.56 శాతం రాబ‌డినిచ్చింది. గ‌త మూడేళ్ల‌లో ఈ ఫండ్ రాబ‌డి 25.14%గా ఉంది. గ‌త ఐదేళ్ల‌లో 20% వార్షిక రాబ‌డి వ‌చ్చింది.

ఒక‌వేళ ఎవ‌రైనా సిప్ ద్వారా రూ.1000తో మొద‌లుపెట్టి ఐదేళ్ల పాటు క్ర‌మంగా పెట్టుబ‌డులు పెట్టి ఉంటే అది రూ. 60 వేల‌కు చేరుతుంది. మొత్తం రాబ‌డి రూ. 1,07,000 అయి ఉంటుంది.

టాటా ఇండియా ట్యాక్స్ సేవింగ్ ఫండ్

టాటా ఇండియా ట్యాక్స్ సేవింగ్ ఫండ్

ఈ ఫండ్ ఓపెన్ ఎండెడ్ ఈక్విటీ లింక్డ్ ట్యాక్స్ సేవింగ్ స్కీమ్‌. క్రిసిల్ దీనికి ఒక‌టో ర్యాంకునివ్వ‌గా వాల్యూ రీసెర్చ్ ఆన్‌లైన్ ఫైవ్ స్టార్ రేటింగ్ ఇచ్చింది.

గ‌త మూడేళ్ల‌లో ఫండ్ వార్షిక స‌గ‌టు రాబ‌డులు 24.40%గాను, ఏడాది రాబ‌డి 15.55%గా ఉంది. ఫండ్ ప్రారంభం నుంచి ఈ పథ‌కంలో వ‌చ్చిన రాబ‌డి చూస్తే దాదాపు 20%గా ఉన్నాయి.

ఈ ఫండ్ పోర్ట్‌ఫోలియోలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, యెస్ బ్యాంకు, కొట‌క్ మ‌హీంద్రా బ్యాంకు ఉన్నాయి.

బిర్లా స‌న్ లైఫ్ ట్యాక్స్ ప్లాన్

బిర్లా స‌న్ లైఫ్ ట్యాక్స్ ప్లాన్

బిర్లా స‌న్‌లైఫ్ ట్యాక్స్ ప్లాన్‌కు క్రిసిల్ 2 ర్యాంకును ఇచ్చింది. వాల్యూ రీసెర్చి ఆన్‌లైన్ 4 స్టార్ రేటింగ్‌నిచ్చింది. గ‌త మూడేళ్ల‌లో ఫండ్ రాబ‌డులు 24.20% రాబ‌డులు వ‌చ్చాయి. ఫండ్ ప్రారంభం నుంచి 20% రాబ‌డుల‌ను పెట్టుబ‌డిదార్లు రాబ‌ట్టుకోగ‌లిగారు.

ఈ ఫండ్ పోర్ట్‌ఫోలియోలో సుందరం క్లేటాన్‌, హ‌నీవెల్ ఆటోమేష‌న్, కొట‌క్ మ‌హీంద్రా బ్యాంకు ఉన్నాయి.

బిర్లా స‌న్‌లైఫ్ ట్యాక్స్ రిలీఫ్ 96

బిర్లా స‌న్‌లైఫ్ ట్యాక్స్ రిలీఫ్ 96

బిర్లా స‌న్‌లైఫ్ ట్యాక్స్ రిలీఫ్ 96 ప‌థ‌కానికి క్రిసిల్ 2 ర్యాంకు ఇచ్చింది. వాల్యూ రీసెర్చి ఆన్‌లైన్ 4 స్టార్ రేటింగ్ ఇచ్చింది.

ఈ ఫండ్ గ‌త మూడేళ్ల‌లో స‌గ‌టున ఏడాదికి 25% రాబ‌డుల‌ను ఇచ్చింది. క‌నీస సిప్ పెట్టుబ‌డి రూ. 500గా ఉంది. ఆశ్చ‌ర్య‌క‌రంగా ఇందులో ఈ ఫండ్‌లో ఎగ్జిట్ లోడ్ లేదు.

ఫండ్ పోర్ట్‌ఫోలియోలో ఐసీఐసీఐ బ్యాంకు, హ‌నీవెల్ ఆటోమేష‌న్ ఉన్నాయి.

ఐడీబీఐ ఈక్విటీ అడ్వాంటేజ్ ఫండ్

ఐడీబీఐ ఈక్విటీ అడ్వాంటేజ్ ఫండ్

ఈ ఫండ్‌కు క్రిసిల్ రెండో ర్యాంకు ఇవ్వగా, వాల్యూ రీసెర్చి ఆన్‌లైన్ 5 స్టార్ రేటింగ్‌నిచ్చింది. ఈ ఫండ్‌ను 2013లో ప్రారంభించ‌గా అప్ప‌టి నుంచి స‌గ‌టున 27.99% రాబ‌డుల‌నిస్తోంది.

ఈ ఫండ్ పోర్ట్‌ఫోలియో చాలా బ‌లంగా ఉంది. కాబ‌ట్టి దీర్గ‌కాలిక పెట్టుబ‌డుల కోసం చూసేవారు దీన్ని ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోవ‌చ్చు.

గ‌త మూడేళ్ల‌లో ఫండ్ రాబ‌డి 27.22%. ఎస్ &పీ బీఎస్ఈ 200లో ఇది బెంచ్‌మార్క్ అయి ఉంది. ఫండ్ పోర్ట్‌ఫోలియోలో చోల‌మండ‌ల‌మ్ ఇన్వెస్ట్‌. &ఫిన్‌, ఐష‌ర్ మోటార్స్‌, టీవీఎస్ మోటార్‌, ఎమ్ఆర్‌ఎఫ్ ఉన్నాయి.

ఇన్వెస్కో ఇండియా ట్యాక్స్ ప్లాన్‌

ఇన్వెస్కో ఇండియా ట్యాక్స్ ప్లాన్‌

క్రిసిల్ ఈ ఫండ్‌కు 2 ర్యాంకునిచ్చింది. వాల్యూ రీసెర్చి ఆన్‌లైన్ 4 స్టార్ రేటింగ్ ఇచ్చింది. క‌నీస సిప్ పెట్టుబ‌డి రూ. 500 నుంచి ప్రారంభ‌మ‌వుతుంది.

మూడేళ్ల రాబ‌డుల‌ను చూస్తే సగ‌టు ఏడాదికి 23%గా ఉంది. ఈ ఫండ్‌ను 2006లో ప్రారంభించారు. అప్ప‌టి నుంచి స‌గ‌టున 14.59% రాబ‌డుల‌ను ఇవ్వ‌గ‌లిగింది.

ఫండ్ పోర్ట్‌ఫోలియోలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, హీరో మోటో కార్ప్‌, ఇన్ఫోసిస్ ఉన్నాయి.

English summary

ఈఎల్ఎస్ఎస్‌ల్లో పెట్టుబ‌డి పెట్టాల‌నుకుంటున్నారా? అయితే వీటిని ప్ర‌య‌త్నించండి | Best Tax Saving ELSS To Invest in 2017 in India

Equity linked Savings Scheme (ELSS) are one of the best financial instruments providing capital appreciation along with tax benefits. ELSS invests in equity linked mutual funds making it an attractive instrument.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X