For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బంగారం కొనుగోలుకు సరైన సమయం ఇదేనా?

By Nageswara Rao
|

గత కొన్ని నెలలుగా స్తబ్దుగా ఉన్న బంగారం ధరలు ఒక్కసారిగా అనూహ్యంగా పెరగడం ప్రారంభించాయి. దేశీయ మార్కెట్లో 10 గ్రాముల బంగారం ధర 30వేలకు సమీపించింది. అంతక ముందు 10 గ్రాముల బంగారం ధర 25వేల దిగువకు పడిపోయినప్పుడు చోద్యం చూస్తు కూర్చున్నవారు ఇప్పుడు లబోదిబో మంటున్నారు.

అందివచ్చిన అవకాశాన్ని ఒడిపట్టుకోలేకపోయామని ఆందోళన చెందుతున్నారు. హఠాత్తుగా బంగారం ధర ఇలా ఒక్కసారిగా పెరగడానికి కారణం ఏంటీ? ఇంకా పెరుగుతుందా? బంగారంలో పెట్టుబడులు పెట్టాలనుకునేవారు ఏం చేయాలో తెలుసుకుందాం. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్‌ (31.1 గ్రాములు) బంగారం ధర 1,246 డాలర్ల స్థాయికి చేరుకుంది.

సాధారణంగా అంతర్జాతీయ ట్రెండ్‌కు అనుగుణంగా దేశీయ మార్కెట్లలోనూ బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు నమోదవుతుంటాయి. దేశీయంగా ఇన్వెస్టర్లు, వినియోగదారుల నుంచి గిరాకీ పెరిగిన సందర్భంలో ధరలు పెరగడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా బంగారంలో పెట్టుబడి అనేది ధరలను అధికంగా ప్రభావితం చేస్తోంది.

మనలో కొందరు అటు స్టాక్‌మార్కెట్లతో పాటు బంగారంలోనూ పెట్టుబడులు పెడుతుంటారు. అంతర్జాతీయం నెలకొన్న పరిస్థితులు, టెర్రరిజం, ప్రకృతి విపరిణామాలు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వృద్ధిపై అనుమానాలు కలిగినా స్టాక్‌ మార్కెట్లు కుప్పకూలుతుంటాయి. ఇలాంటి సమయంలో పెట్టుబడిదారులు బంగారాన్ని కొనుగోలు చేస్తుంటారు.

దీంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న బ్యాంకులు బంగారం నిల్వలను పెంచుకునేందుకు పెద్ద ఎత్తున కొనుగోళ్లను జరుపుతుంటుంది. ఇది కూడా అంతర్జాతీయంగా బంగారం ధరలను ప్రభావితం చేస్తుంది.

 బంగారం కొనుగోలుకు సరైన సమయం ఇదేనా?

బంగారం కొనుగోలుకు సరైన సమయం ఇదేనా?

అంతర్జాతీయంగా బంగారానికి డిమాండ్‌ 2014 సంవత్సరంలో (4,212 టన్నులు) ఉన్న మాదిరిగానే 2015 సంవత్సరంలోనూ ఉంది. గత ఏడాది తొలినాళ్లలో పసిడికి డిమాండ్‌ చాలా తక్కువగా ఉంది. ద్వితీయార్థంలో మాత్రం పుంజుకుంది. పలు దేశాల కేంద్ర బ్యాంకులు బంగారం నిల్వలను పెంచుకోవడంపై ఆసక్తి చూపాయి. భారత నుంచి గత ఏడాది ద్వితీయార్ధంలో బంగారానికి గిరాకీ పెరిగింది. ధరలు తక్కువ స్థాయిలో ఉండటమే ఇందుకు ప్రధాన కారణం.

 బంగారం కొనుగోలుకు సరైన సమయం ఇదేనా?

బంగారం కొనుగోలుకు సరైన సమయం ఇదేనా?

అంతర్జాతీయంగా 2014 సంవత్సరంలో బంగారంలో పెట్టుబడుల డిమాండ్‌ 815 టన్నులుంది. 2015 సంవత్సరంలో ఇది 8 శాతం పెరిగి 878 టన్నులకు చేరుకుంది. బంగారం కడ్డీలు, నాణేలకు డిమాండ్‌ నిలకడగా కొనసాగింది. 2014 సంవత్సరంలో బంగారం ఎక్స్ఛేంజ్‌ ట్రేడెడ్‌ ఫండ్స్‌‌లో 185 టన్నుల అమ్మకాలు జరిగాయి. 2015 సంవత్సరంలో ఇది 133 టన్నులకు తగ్గిపోయింది. గత ఏడాది నాలుగో త్రైమాసికంలోనూ ఇదే ట్రెండ్‌ కొనసాగింది.

 బంగారం కొనుగోలుకు సరైన సమయం ఇదేనా?

బంగారం కొనుగోలుకు సరైన సమయం ఇదేనా?

2015లో అంతర్జాతీయంగా బంగారు ఆభరణాలకు డిమాండ్‌ 3 శాతం తగ్గి 2,481 టన్నుల నుంచి 2,415 టన్నులకు చేరుకుంది. గత ఏడాది ప్రథమార్ధంలో డిమాండ్‌ తక్కువగానే ఉంది. కానీ ద్వితీయార్ధంలో బాగా బలపడింది. 2015 నాలుగో త్రైమాసికం నుంచి బంగారంపై ఇన్వెస్టర్లకు, కొనుగోలుదారులకు ఆసక్తి బాగా పెరిగింది. ఇది క్రమంగా ధరల పెరుగుదలకు దారితీసింది.

 బంగారం కొనుగోలుకు సరైన సమయం ఇదేనా?

బంగారం కొనుగోలుకు సరైన సమయం ఇదేనా?

చైనా ఆర్ధిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని కొందరు పెట్టుబడిదారులు తమ ఇన్వెస్ట్ మెంట్‌ను బంగారంలోకి మళ్లించారు. చైనా గత అక్టోబర్‌ నెలలో 14 మెట్రిక్‌ టన్నులు, నవంబర్‌లో 20.8 మెట్రిక్‌ టన్నులు, డిసెంబర్‌లో 19 మెట్రిక్‌ టన్నుల బంగారాన్ని కొనుగోలు చేసింది. భారతలో బంగారం కొనుగోళ్లు తగ్గేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంటే.. చైనా మాత్రం తమ పౌరులు బంగారం కొనుగోలు చేసే విధంగా ప్రోత్సహింది. దీంతో బంగారానికి డిమాండ్ పెరిగింది.

 బంగారం కొనుగోలుకు సరైన సమయం ఇదేనా?

బంగారం కొనుగోలుకు సరైన సమయం ఇదేనా?

అంతర్జాతీయా మార్కెట్లో బంగారం ధరలు తక్కువగా ఉండటంతో పలు బ్యాంకులు నిల్వలను పెంచుకోవాలని చూశాయి. 2015 సంవత్సరం నాలుగో త్రైమాసికంలో కేంద్ర బ్యాంకుల నుంచి బంగారానికి డిమాండ్‌ 25 శాతం పెరిగి 167 మెట్రిక్‌ టన్నులకు చేరుకుంది. అంతకు ముందు ఏడాది ఇదే కాలంలో డిమాండ్‌ 134 టన్నులుగా ఉంది. గత ఏడాదిలో కేంద్ర బ్యాంకుల నుంచి 588 మెట్రిక్‌ టన్నుల బంగారానికి డిమాండ్‌ ఏర్పడింది.

English summary

బంగారం కొనుగోలుకు సరైన సమయం ఇదేనా? | Should you buy gold now? Here`s what the experts are saying

Should you buy gold now? Here`s what the experts are saying
Story first published: Wednesday, February 17, 2016, 15:23 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X