For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

స్పందన కరువు: గోల్డ్ డిపాజిట్ స్కీమ్ ఫ్లాప్

By Nageswara Rao
|

ప్రధాని నరేంద్రమోడీ ఎంతో ప్రతిష్టాత్మకంగా రెండు వారాల క్రితం ప్రారంభించిన గోల్డ్ డిపాజిట్ స్కీమ్‌కు ప్రజల నుంచి పెద్దగా స్పందన కనిపించలేదు. దేశంలో సుమారు 20,000 టన్నుల బంగారం ఉందని ప్రభుత్వం అంచనా వేసి, దాని నుంచి 30 శాతంగా 6 వేల టన్నుల బంగారాన్ని పెట్టుబడుల రూపంలో ఆకర్షించాలని కేంద్రం భావించగా, ఇప్పటి వరకూ కేవలం 400 గ్రాముల బంగారమే డిపాజిట్ అయింది.

ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన గోల్డ్ డిపాజిట్ స్కీమ్‌ కింద ఇప్పటివరకు 400 గ్రాముల బంగారం డిపాజిట్‌ అయిందని ఆభరణాలు, వజ్రాల ఎగుమతుల ప్రోత్సాహక మండలి (జెజెఇపిసి) ఒక ప్రకటనలో పేర్కొంది. పరిశ్రమ ప్రతినిధులు గురువారం ఆర్థిక వ్యవహారాల శాఖ కార్యదర్శి శక్తికాంత దాస్‌ను కలిసి బంగారం పరీక్షలకు మరిన్ని కేంద్రాలు ఏర్పాటు చేసే విషయం చర్చించారు.

గోల్డ్ డిపాజిట్ స్కీమ్ ఫ్లాప్: పెట్టుబడిగా వచ్చింది 400 గ్రాములే

గోల్డ్ డిపాజిట్ స్కీమ్ ఫ్లాప్: పెట్టుబడిగా వచ్చింది 400 గ్రాములే

సమావేశంలో జెజెఇపిసి ప్రతినిధులతో పాటు ఆర్‌బిఐ, భారత ప్రమాణాల సంస్థ, ఎంఎంటిసి, ప్రైవేటు బ్యాంకుల ప్రతినిధులు కూడా పాల్గొన్నారు. ఆర్థిక శాఖ అధికారులతో సమావేశానంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, 'ఇంతవరకూ 400 గ్రాముల బంగారమే డిపాజిట్ అయింది. మోడీ ప్రభుత్వం ఈ పథకాన్ని పునస్సమీక్షించాలని నిర్ణయించింది. బంగారాన్ని పరీక్షించేందుకు, దానిని బ్యాంకుల్లో డిపాజిట్ చేసేందుకు మరిన్ని కేంద్రాలు తెరిచేందుకు నిర్ణయించింది' అని వివరించారు.

గోల్డ్ డిపాజిట్ స్కీమ్ ఫ్లాప్: పెట్టుబడిగా వచ్చింది 400 గ్రాములే

గోల్డ్ డిపాజిట్ స్కీమ్ ఫ్లాప్: పెట్టుబడిగా వచ్చింది 400 గ్రాములే

దేశంలోని మొత్తం 13 వేల బిఐఎస్‌ సర్టిఫైడ్‌ వర్తకులు కలెక్షన్‌ ఏజెంట్లుగా వ్యవహరించేందుకు అనుమతించినట్టయితే ఈ స్కీమ్‌ మరింతగా ప్రజల్లోకి చేరుతుందని తాను భావిస్తున్నట్టు అనిల్‌ చెప్పారు. బిఐఎస్‌ సర్టిఫికేషన్‌ గల వర్తకులందరినీ ఏజెంట్లుగా పని చేసేందుకు అనుమతించాలని తాము ఆర్థిక శాఖను కోరామని, ఇందుకు సూత్రప్రాయంగా ఆమోదించారని, వారందరినీ ఏజెంట్లుగా నియమించే ప్రక్రియ సత్వరం చేపట్టాలని బిఐఎస్‌ను దాస్‌ ఆదేశించారని ఎగుమతి ఆధారిత జోన్లు, సెజ్‌ల ఎగుమతి ప్రోత్సాహక మండలి వైస్‌ చైర్మన్‌ రాహుల్‌ గుప్తా తెలిపారు.

గోల్డ్ డిపాజిట్ స్కీమ్ ఫ్లాప్: పెట్టుబడిగా వచ్చింది 400 గ్రాములే

గోల్డ్ డిపాజిట్ స్కీమ్ ఫ్లాప్: పెట్టుబడిగా వచ్చింది 400 గ్రాములే

ప్రస్తుతం దేశవ్యాప్తంగా మూడున్నర లక్షల మంది ఆభరణాల వర్తకులుండగా వారిలో 13 వేల మంది బిఐఎస్‌ సర్టిఫికేషన్‌ పొందిన వారని ఆయన చెప్పారు. ప్రస్తుతం దేశంలో 29 పసిడి పరీక్ష కేంద్రాలున్నాయి. వాటి సంఖ్య డిసెంబర్‌ నాటికి 55కి చేరుతుందని ప్రభుత్వం ప్రకటించింది. అలాగే బంగారం రిఫైనరీల సంఖ్య నాలుగు నుంచి 20కి చేరుతుందని చెబుతున్నారు.

 గోల్డ్ డిపాజిట్ స్కీమ్ ఫ్లాప్: పెట్టుబడిగా వచ్చింది 400 గ్రాములే

గోల్డ్ డిపాజిట్ స్కీమ్ ఫ్లాప్: పెట్టుబడిగా వచ్చింది 400 గ్రాములే

ఈ స్కీమ్‌ కింద బంగారాన్ని బ్యాంకుల్లో డిపాజిట్‌ చేసిన వారికి రెండున్నర శాతం వడ్డీ చెల్లిస్తారు. ఆ వడ్డీ రాబడికి కాపిటల్‌ గెయిన్స్‌ టాక్స్‌, సంపద పన్ను, ఆదాయపు పన్ను మినహాయింపులు ఇచ్చారు. డిపాజిట్‌ చేసిన బంగారం విలువ పెరిగి వడ్డీ ఆదాయం పెరిగినా కాపిటల్‌ గెయిన్స్‌ టాక్స్‌ చెల్లించాల్సిన అవసరం ఉండదు. ఈ స్కీమ్‌ కింద అనుమతి పొందిన బ్యాంకులు 1 నుంచి 3 సంవత్సరాల స్వల్పకాల పరిమితి నుంచి 12 నుంచి 15 సంవత్సరాల దీర్ఘకాల పరిమితికి బంగారాన్ని డిపాజిట్‌గా తీసుకోవచ్చు.

గోల్డ్ డిపాజిట్ స్కీమ్ ఫ్లాప్: పెట్టుబడిగా వచ్చింది 400 గ్రాములే

గోల్డ్ డిపాజిట్ స్కీమ్ ఫ్లాప్: పెట్టుబడిగా వచ్చింది 400 గ్రాములే

అలా సేకరించిన బంగారాన్ని బ్యాంకులు మార్కెట్‌లో విక్రయించవచ్చు లేదా ఆభరణాల వర్తకులకు, ఎంఎంటిసికి అందించవచ్చు. ప్రజలు వద్ద, ఆలయాల్లో పేరుకుపోయిన బంగారాన్ని బ్యాంకుల్లో డిపాజిట్ చేసి దానిపై ఇంతకు ముందు లేని విధంగా ఆకర్షణీయమైన వడ్డీని పొందవచ్చని ఆ స్కీమ్ ప్రారంభం సందర్భంగా మోడీ తెలిపారు. అంతేకాదు ప్రభుత్వం బంగారం ఆధారిత బాండ్ల రూపంలో పేపర్ గోల్డ్ పథకాన్ని సైతం ప్రారంభించింది.

English summary

స్పందన కరువు: గోల్డ్ డిపాజిట్ స్కీమ్ ఫ్లాప్ | PM Modi's Gold Deposit Scheme Attracts Only 400 Grams So Far

A gold deposit scheme launched amid fanfare by Prime Minister Narendra Modi two weeks ago has so far attracted only 400 grams, out of a national hoard estimated at 20,000 tonnes, an industry official said on Thursday.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X