For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఈ రెండు స్టాక్స్ కొంటే 23 శాతం వరకు లాభాలు వస్తాయి

|

ప్రముఖ బ్రోకరేజీ కంపెనీ షేర్‌ఖాన్ రెండు స్టాక్స్‌ను కొనుగోలు చేయవచ్చునని సజెస్ట్ చేస్తోంది. IPCA లేబరేటరీస్, పెట్రోనెట్ ఎల్ఎన్‌జీ స్టాక్స్ సమీప భవిష్యత్తులో కొనుగోలు చేయవచ్చునని చెబుతోంది. పెట్రోనెట్ ఎల్ఎన్‌జీ పైన 23 శాతం రిటర్న్స్, IPCA లేబరేటరీస్ పైన 11 శాతం వరకు రిటర్న్స్ ఉంటాయని అంచనా వేస్తోంది.

షేర్ ఖాన్ సూచిస్తోన్న స్టాక్స్

Petronet LNG - ప్రస్తుత ధర రూ.231 - టార్గెట్ ధర రూ. 285 - పెరుగుదల 23.39%

IPCA Labs - ప్రస్తుత ధర రూ.2,556 - టార్గెట్ ధర రూ.2,850 - పెరుగుదల 11.00%

షేర్ ఖాన్ నివేదిక ప్రకారం పెట్రోనెట్ ఎల్ఎన్‌జీ యొక్క దహేజ్ టర్మినల్ వినియోగం Q2FY22లో పూర్తిగా కోలుకునే అవకాశం ఉందని తెలిపింది. ఎందుకంటే కాంట్రాక్టెడ్ ఎల్ఎన్‌జీ (స్పాట్ ఎల్ఎన్‌జీ ధరలో సగానికి లభిస్తుంది) డిమాండ్ పుంజుకుంటుందని చెబుతున్నారు. మార్చి 31, 2021 నాటికి పెట్రోనెట్ ఎల్‌ఎన్‌జీ బలమైన బ్యాలెన్స్ షీట్‌ను కలిగి ఉందని, నెట్ క్యాష్ పొజిషన్ రూ.5,705 కోట్లుగా ఉందని(లేదా కరెంట్ మార్కెట్ క్యాపిటలైజేషన్‌లో 16 శాతం) షేర్ ఖాన్ పేర్కొంది.

ఏడాదికి రూ.3,000 కోట్ల క్యాష్ ప్లో కూడా ఉండవచ్చునని తెలిపింది. పెట్రోనెట్ ఎల్‌ఎన్‌జీ తన షేర్ హోల్డర్లకు అత్యధిక డివిడెండ్ ఇవ్వవచ్చునని పేర్కొంది. FY21లో ప్రతి షేర్ పైన ఇచ్చిన డివిడెండ్ రూ.11.5. ఈ నేపథ్యంలో పెట్రోనెట్ ఎల్‌ఎన్‌జీ స్టాక్‌ను రూ.285 టార్గెట్ ధరతో కొనుగోలు చేయవచ్చునని సూచిస్తోంది. కాగా, నేడు పెట్రోనెట్ ఎల్‌ఎన్‌జీ స్టాక్ 0.73 శాతం క్షీణించింది. సోమవారం (సెప్టెంబర్ 13) మధ్యాహ్నం గం.12.30 సమయానికి ఈ షేర్ ధర రూ.229.85 వద్ద ఉంది. ఈ స్టాక్ 52 వారాల కనిష్టం రూ.207.4, 52 వారాల గరిష్టం రూ.275.25. నేడు మధ్యాహ్నం సమయానికి 26,331 షేర్లు చేతులు మారాయి.

2 Stocks From Sharekhan That Can Give Gains Of Up To 23 percent

షేర్ ఖాన్ ప్రకారం బలమైన మార్కెట్ కలిగిన డొమెస్టిక్ ఫార్ములేషన్ బిజినెస్ IPCA ల్యాబ్స్ సొంతం. FY22లో ఈ స్టాక్ డబుల్ డిజిట్ వృద్ధి రేటును నమోదు చేయవచ్చునని అంచనా వేస్తున్నారు. దీర్ఘకాలంలో IPCA ఏపీఐ రంగం వృద్ధిపై ధీమా వ్యక్తం చేస్తోంది. దేవాస్ గ్రీన్ ఫీల్డ్‌ను ప్రారంభించడం వల్ల సామర్థ్య పరిమితిలను సడలించడం, దీని వల్ల అదనంగా 25 శాతం సామర్థ్యం పెరుగుతుందని చెబుతున్నారు. రత్లాం ఎక్స్‌పాన్షన్ కూడా 2HFY22లో సిద్ధంగా ఉంది.

రాబోయే మూడు నాలుగు సంవత్సరాల్లో IPCA ల్యాబ్స్ కాపెక్స్ రూ.400 కోట్లకు చేరుకుంటుందని, ఇది భవిష్యత్తు వృద్ధి అవకాశాలకు నిదర్శనంగా ఉంటుందని పేర్కొంది. ఈ స్టాక్‌ను రూ.2850 టార్గెట్ ధరతో కొనుగోలు చేయవచ్చునని సూచిస్తున్నారు. IPCA ల్యాబ్స్ షేర్ ధర నేడు మధ్యాహ్నం గం.12.30 సమయానికి 1.88 శాతం లేదా రూ.46.45 ఎగిసి రూ.2,574.50 వద్ద ట్రేడ్ అయింది.

స్టాక్స్, ఫండ్స్‌లో పెట్టుబడి చాలా రిస్క్‌తో కూడిన అంశం. కేవలం కథనం ఆధారంగా పెట్టుబడి నిర్ణయం తీసుకోవడం సరికాదు. మార్కెట్ నిపుణుల సూచనలు, స్టాక్స్ పైన పూర్తిగా అవగాహన ఉండటం అవసరం. స్టాక్ మార్కెట్లు వివిధ అంశాలపై ఆధారపడి ఉంటాయి. జాతీయ, అంతర్జాతీయ రాజకీయాలు, ప్రజల ఆరోగ్యం.. ఇలా ఎన్నో అంశాలతో ముడివడి ఉంటుంది.

English summary

ఈ రెండు స్టాక్స్ కొంటే 23 శాతం వరకు లాభాలు వస్తాయి | 2 Stocks From Sharekhan That Can Give Gains Of Up To 23 percent

Brokerage firm Sharekhan has a buy call on the stocks of IPCA Laboratories and Petronet LNG. The brokerage sees gains of nearly 23% on the stock of Petronet LNG and around 11% Gains on the stock of IPCA Laboratories.
Story first published: Monday, September 13, 2021, 12:37 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X