For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రిలయన్స్ 4 నెలల లాభం ఆ దేశాల జీడీపీకి సమానం: 140 దేశాల కంటే ఈ కంపెనీల లాభాలు ఎక్కువ!

|

కరోనా మహమ్మారి కారణంగా మార్చి నుండి ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలాయి. మన దేశంలోను మార్కెట్లు ఊహించని పతనం చూశాయి. దాదాపు రెండు నెలల పాటు భారీ నష్టాలు చూసిన మార్కెట్లు, జూన్ నుండి కోలుకోవడం ప్రారంభించాయి. మార్చి 23వ తేదీన మార్కెట్లు క్రాష్ అయ్యాయి. ఉదాహరణకు మార్చిలో రూ.900కు దిగువకు పడిపోయిన రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ ధర ఇప్పుడు రూ.2,000 కంటే పైకి చేరుకుంది. ఇలా ఈ 4 నెలల కాలంలో అంటే మార్చి నుండి 10 ఇండియన్ స్టాక్స్ దాదాపు 140 దేశాల జీడీపీతో (వేర్వేరుగా) సమానమైన అంతకంటే ఎక్కువ మార్కెట్ క్యాపిటలైజేషన్ పెంచుకున్నాయి.

కుప్పకులిన అమెరికా ఆర్థికవ్యవస్థ, 70% వాటా ఉన్న ఆ ఖర్చులు క్లోజ్!కుప్పకులిన అమెరికా ఆర్థికవ్యవస్థ, 70% వాటా ఉన్న ఆ ఖర్చులు క్లోజ్!

 140 దేశాల జీడీపీ కంటే...

140 దేశాల జీడీపీ కంటే...

బీఎస్ఈ బెంచ్ మార్క్ సెన్సెక్స్ ఈ నాలుగు నెలల కాలంలో యాభై శాతం లాభపడింది. 10 ఇండెక్స్ స్టాక్స్ సంయుక్తంగా ఈ కాలంలో రూ.17.76 లక్షల కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్‌ను (రూ.74.8 వద్ద) కూడగట్టుకున్నాయి. అంటే 237 బిలియన్ డాలర్లు. ఐఎంఎఫ్ అంచనా ప్రకారం పోర్చుగల్ జీడీపీ 236 బిలియన్ డాలర్లు, పెరు 228 బిలియన్ డాలర్లు, ఇరాక్ 224 బిలియన్ డాలర్లు, గ్రీస్ 214 బిలియన్ డాలర్లు, న్యూజిలాండ్ 204 బిలియన్ డాలర్ల జీడీపీతో ఉన్నాయి. ఇలా మొత్తం 140 దేశాల జీడీపీ కంటే ఇండియా 10 స్టాక్స్ ఎక్కువగా లాభాలు రుచిచూడటం గమనార్హం.

రిలయన్స్ లాభమే ఆ దేశాల జీడీపీకి సమానం

రిలయన్స్ లాభమే ఆ దేశాల జీడీపీకి సమానం

మార్చి 23న రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ భారీగా పడిపోయింది. ఆ తర్వాత దూసుకెళ్తోంది. ఈ కాలంలో రిలయన్స్ ఇన్వెస్టర్లు 109 బిలియన్ డాలర్ల (8.2 లక్షల కోట్లు) లాభాలు చూశారు. ఇది ఇక్విడార్, స్లొవేకియా దేశాల (ఇండివిడ్యువల్) జీడీపీకి సమానం. మార్చి 24న రూ.934గా ఉన్న రిలయన్స్ షేర్ 130 శాతం వరకు ఎగిసి ఇప్పుడు రూ.2,000 పైన ఉంది.

ఈ లాభం వెనిజులా జీడీపీకి సమానం

ఈ లాభం వెనిజులా జీడీపీకి సమానం

TCS(28 బిలియన్), HDFC బ్యాంకు(22 బిలియన్), ఇన్ఫోసిస్(20 బిలియన్) వంటి షేర్లు కూడా భారీగా లాభపడ్డాయి. ఈ 4 నెలల కాలంలో ఈ 3 కంపెనీల లాభం దాదాపు వెనిజులా జీడీపీకి సమానం.

టాప్ 10 మార్కెట్ గెయినర్స్ సంయుక్త మార్కెట్ క్యాపిటలైజేషన్ 669 బిలియన్ డాలర్లు. దీనిని ఒక దేశంగా భావించి, ఈ లాభం దేశ జీడీపీగా లెక్కిస్తే టాప్ 20లో కొద్దిలో మిస్ అవుతుంది.

ప్రపంచంలో 715 బిలియన్ డాలర్ల జీడీపీతో స్విట్జర్లాండ్ 20వ స్థానంలో ఉంది. పోలాండ్ 656 బిలియన్ డాలర్లతో 21వ స్థానంలో ఉంది. కానీ ఈ కంపెనీల లాభం 669 బిలియన్ డాలర్లు. అంటే స్విట్జర్లాండ్ తర్వాత ఉంది.

ఎంత లాభపడ్డాయంటే

ఎంత లాభపడ్డాయంటే

ఇటీవల టీసీఎస్, ఇన్ఫోసిస్ క్వార్టర్ ఫలితాలు ఆశాజనకంగానే ఉన్నాయి. ప్రయివేటు బ్యాంకింగ్ రంగంలో హెచ్‌డీఎఫ్‌సీ ముందుంది.

భారతీ ఎయిర్‌టెల్, హిందూస్తాన్ యూనీలీవర్ ఈ నాలుగు నెలల కాలంలో 11 బిలియన్ డాలర్ల చొప్పున మార్కెట్ వ్యాల్యూను పెంచుకున్నాయి.

అయితే కరోనా కారణంగా గత క్వార్టర్‌లో భారతీ ఎయిర్టెల్ సహా వివిధ కంపెనీలు తక్కువ లాభాలను లేదా నష్టాలను నమోదు చేశాయి.

హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, హెచ్‌డీఎఫ్‌సీ, ఐటీసీ, విప్రో కంపెనీలు 7 బిలియన్ల డాలర్ల నుండి 9 బిలియన్ డాలర్ల మేర చొప్పున ఎగిశాయి.

English summary

రిలయన్స్ 4 నెలల లాభం ఆ దేశాల జీడీపీకి సమానం: 140 దేశాల కంటే ఈ కంపెనీల లాభాలు ఎక్కువ! | 10 Indian stocks created more wealth than GDP of 140 nations

In less than four months since March, just 10 Indian stocks have created wealth that exceeds the individual GDP (gross domestic product) of 140 nations around the world!
Story first published: Monday, August 3, 2020, 16:01 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X