For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Zomato Share: జాక్ పాట్ కొట్టిన జొమాటో.. పెరిగిన కంపెనీ స్టాక్.. పూర్తి వివరాలు

|

Zomato Share: ఫుడ్ డెలివరీ అగ్రిగేటర్ జొమాటో పేరు మార్కెట్లో మరోసారి చర్చల్లోకి వచ్చింది. చైనాకు చెందిన ఈ-కామర్స్ దిగ్గజం అలీబాబా గ్రూప్ తన జొమాటో పెట్టుబడుల్లో 3.5 శాతాన్ని విక్రయిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ఈ బ్లాక్ డీల్ నేపథ్యంలో స్టాక్ దాదాపుగా 5 శాతం పెరిగింది. ఓపెన్ మార్కెట్ పద్ధతిలో చైనా కంపెనీ ఆలీబాబా రూ.1,631 కోట్ల విలువైన షేర్లను విక్రయించింది.

కొత్త పెట్టుబడులు..

కొత్త పెట్టుబడులు..

షేర్ల విక్రయం వల్ల ఒత్తిడి పెరుగుతుందని అందరూ భావించినప్పటికీ.. సింగపూర్ ప్రభుత్వం జొమాటోలో వాటాలు కొనుగోలు చేయటం ఇన్వెస్టర్లలో భారీ ఊరటను తెచ్చింది. నవంబర్ 30న సింగపూర్ ప్రభుత్వ ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీకి చెందిన సంస్థ దేశీయ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ జోమాటో 9.80 కోట్ల షేర్లను కొనుగోలు చేసింది. ప్రస్తుతం ఇది అతిపెద్ద పెట్టుబడిగా చెప్పుకోవచ్చు. ఈ క్రమంలో కంపెనీ షేర్లు ఎన్ఎస్ఈలో ఈరోజు ఉదయం 10.58 గంటల సమయంలో రూ.65.55 వద్ద ట్రేడ్ అవుతోంది.

సింగపూర్ డీల్ వివరాలు..

సింగపూర్ డీల్ వివరాలు..

కామాస్ ఇన్వెస్ట్‌మెంట్స్ బుధవారం జొమాటోకు చెందిన 9.80 కోట్ల షేర్లను కొనుగోలు చేసింది. దీంతో జొమాటోలో 1.14 శాతం వాటను సొంతం చేసుకుంది. ఈ డీల్ తర్వాత కామాస్ మెుత్తం పెట్టుబడులు 4 శాతానికి చేరుకుంటుంది. ఒక్కో షేరును రూ.62 చొప్పున రూ.607 కోట్లను వెచ్చించి కొనుగోలు చేసింది. ఇదే క్రమంలో అలిపే సింగపూర్ 26,28,73,507 జొమాటో షేర్లను రూ.62.06 వద్ద విక్రయించింది.

గతంలో షేర్ల విక్రయాలు..

గతంలో షేర్ల విక్రయాలు..

మూడు నెలల కిందట ఉబెర్ టెక్నాలజీస్ సైతం బ్లాక్ డీల్ రూపంలో తన 7.8 శాతం వాటాలను విక్రయించింది. ఆర్థిక స్థితిని గమనిస్తే కంపెనీ గత సంవత్సరం రెండవ త్రైమాసికంలో రూ.434 కోట్ల నికర నష్టాన్ని నమోదు చేయగా ప్రస్తుతం సెప్టెంబరుతో ముగిసిన రెండవ త్రైమాసికంలో నష్టం రూ.250.80 కోట్లకు తగ్గింది. దీనికి తోడు కంపెనీ ఇటీవల బ్లింకిట్‌ని సైతం సొంతం చేసుకుంది.

బ్రోకరేజ్ సంస్థల మాటేంటి..

బ్రోకరేజ్ సంస్థల మాటేంటి..

చాలా బ్రోకరేజ్ సంస్థలు కంపెనీ షేర్ల విషయంలో పాజిటివ్ టార్గెట్స్ అందిస్తున్నాయి. మోర్గన్ స్టాన్లీ రూ.92 టార్గెట్ ఇవ్వగా, కోటక్ ఇన్టిట్యూషనల్ ఈక్విటీస్ షేర్ టార్గెట్ ధర రూ.100 గా నిర్ణయించింది. ఇదే సమయంలో ట్రెండ్ లైన్ ప్రకారం స్టాక్ గరిష్ఠ టార్గెట్ ధర రూ.130గా ఉంది. మార్కెట్లో దాదాపు 23 మంది అనలిస్టుల్లో 17 మంది కంపెనీ షేర్లను కొనుగోలు చేయవచ్చని BUY రేటింగ్ అందిస్తున్నారు. ఇద్దరు షేర్లను విక్రయించమని సూచిస్తుండగా.. నలుగురు మాత్రం హోల్డ్ రేటింగ్ అందించారు.

English summary

Zomato Share: జాక్ పాట్ కొట్టిన జొమాటో.. పెరిగిన కంపెనీ స్టాక్.. పూర్తి వివరాలు | Zomato stock rising high after singapore government investment firms share purchase

Zomato stock rising high after singapore government investment firms share purchase
Story first published: Thursday, December 1, 2022, 11:39 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X