For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Zomato IPO News: అలాట్‌మెంట్, లిస్టింగ్ తేదీ, మరిన్ని వివరాలు

|

జొమాటో పబ్లిక్ ఇష్యూకు మంచి స్పందన లభించింది. శుక్రవారం ఇష్యూ గడువు ముగిసే సమయానికి 38.25 రెట్లు ఓవర్ సబ్‌స్క్రైబ్ అయింది. 71.92 కోట్ల షేర్లకు, 2,752 కోట్ల బిడ్స్ వచ్చాయి. సంస్థాగత ఇన్వెస్టర్ల నుండి 52 రెట్లు బిడ్స్ వచ్చాయి. రిటైల్ ఇన్వెస్టర్ల విభాగం 7.45 రెట్లు ఓవర్ సబ్‌స్క్రైబ్ అయింది. అయితే ఉద్యోగులకు 65 లక్షల షేర్లు కేటాయిస్తే 62 లక్షల షేర్లకే దరఖాస్తులు వచ్చాయి. రూ.72-రూ.76 ధరల శ్రేణిలో ఈ ఐపీవో ఈ నెల 16వ తేదీన ప్రారంభమైంది.

జూలై 14వ తేదీ నుండి జూలై 16వ తేదీ మధ్య జొమాటో ఐపీవో ఆఫర్ వచ్చింది. దాదాపు నలభై రెట్లు సబ్‌స్క్రైబ్ అయింది. క్వాలిఫైడ్ ఇనిస్టిట్యూషనల్ బయ్యర్(QIB) కేటగిరీ 55 రెట్లు సబ్‌స్క్రైబ్ అయింది. రిటైల్ కేటగిరీ 8 రెట్లుగా నమోదయింది. నాన్-ఇనిస్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ 34.80 రెట్లు, అలాగే ఉద్యోగులు 62 రెట్లు సబ్‌స్క్రైబ్ అయింది. జొమాటో రూ.9375 కోట్లను సమీకరించేందుకు ఐపీవోను తెచ్చింది.

Zomato IPO News: Allotment and listing date and details

ఇప్పటికే జొమాటో పలు ప్రామినెంట్ ఇనిస్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల నుండి రూ.4196 కోట్లను సమీకరించింది. యాంకర్ ఇన్వెస్టర్లకు 552.17 మిలియన్ల ఈక్విటీ షేర్లను కేటాయించింది. రూ.76 వద్ద వీటిని కేటాయించింది. యాంకర్ ఇన్వెస్టర్లలో గవర్నమెంట్ ఆఫ్ సింగపూర్, బ్లాక్ రాక్, గోల్డ్‌మన్ శాక్స్, అబు దాబి ఇన్వెస్ట్‌మెంట్ అథారిటీ ఉన్నాయి. జొమాటో ఐపీవో అలాట్‌మెంట్ తేదీ జూలై22, 2021.

English summary

Zomato IPO News: అలాట్‌మెంట్, లిస్టింగ్ తేదీ, మరిన్ని వివరాలు | Zomato IPO News: Allotment and listing date and details

Zomato's initial public offering (IPO) which was opened from July 14 to July 16 was subscribed over 40 times on the last day of subscription, led by strong response from QIBs and retail category. On the third and final day of bidding, the Zomato IPO received bids for 29.04 billion equity shares against an IPO size of 719.23 million.
Story first published: Monday, July 19, 2021, 11:24 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X