For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

దుమ్ములేపిన జొమాటో, సేవలు మరింత విస్తృతపరిచేందుకే...

|

ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్ జొమాటో పబ్లిక్ ఇష్యూ నేడు (జూలై 14 బుధవారం) ప్రారంభమైంది. గ్రే మార్కెట్ నుండి భారీ అంచనాలు రావడంతో ఇన్వెస్టర్లు నేడు మొదటి గంటలోనే రిటైల్ విభాగానికి కేటాయించిన షేర్లను అన్నింటిన సబ్‌స్క్రైబ్ చేసుకున్నారు. మధ్యాహ్నం గం.1 సమయానికే 36 శాతం అధికంగా సబ్‌స్క్రైబ్ అయింది. అలాగే, మధ్యాహ్నం గం.3 వరకు 2.34 శాతం అధికంగా సబ్‌స్క్రైబ్ అయింది. ఐపీవో 16వ తేదీ వరకు ఉంది.

ప్రతిపాదిత ఇష్యూలో భాగంగా షేర్ల ధరల శ్రేణిని రూ.72 నుండి రూ.76గా నిర్ణయించారు. ఈ ఇష్యూ ద్వారా రూ.9,375 కోట్లు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఐపీవోలో భాగంగా రూ.9000కోట్ల విలువైన కొత్త షేర్లను విక్రయానికి ఉంచింది. ఐపీవోకు ముందు రూ.4,196 కోట్లు యాంకర్ ఇన్వెస్టర్ల నుండి సమీకరించింది.

ఐపీవో వివరాలు

ఐపీవో వివరాలు

ఐపీవో సబ్‌స్క్రిప్షన్ జూలై 14, 2021న ప్రారంభమైంది. ఐపీవో సబ్‌స్క్రిప్షన్ ముగింపు జూలై 16, 2021. బేసిస్ ఆఫ్ అలాట్మెంట్ తేదీ జూలై 22. రీఫండ్ ప్రారంభ తేదీ జూలై 23. డీమ్యాట్ ఖాతాకు షేర్ల బదలీ తేదీ జూలై 26. మార్కెట్‌లో లిస్ట్ అయ్యే తేదీ జూలై 27. ఫేస్ వ్యాల్యూ రూ.1. లాట్ సైజ్ 195 షేర్లు. కనీసం ఆర్డర్ చేయాల్సిన షేర్లు ఒక లాట్ లేదా 195 షేర్లు. గరిష్ట ఆర్డర్ 13 లాట్లు. ఐపీవో ప్రైస్ రూ.72 నుండి రూ.76.

బిడ్స్..

బిడ్స్..

నేడు మధ్యాహ్నం గం.3 వరకు 39,98,37,165 షేర్లకు బిడ్స్ దాఖలయ్యాయి. ఇష్యూ సైజ్ 71,92,33,522లో ఇది 56 శాతం. కరోనా వైరస్ సంక్షోభంలోప్రజలు బయటకు వెళ్లలేని పరిస్థితులు నెలకొన్నాయి. ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ రంగం వేగంగా పుంజుకుంది. గత కొన్నాళ్లుగా ఈ మార్కెట్ పైన జొమాటో పట్టు సాధిస్తోంది.

అదే సమయంలో స్విగ్గీ వంటి సంస్థల నుండి పోటీ ఎదుర్కొంటోంది. దీంతో సేవలను మరింత విస్తృతం చేసేందుకు నిధులను సమీకరిస్తోంది. ఫుడ్ డెలివరీ మాత్రమే కాకుండా ఈ యాప్ వేదికగా వివిధ రెస్టారెంట్లలో ముందుగానే టేబుల్ బుక్ చేసుకునే సౌలభ్యం కూడా ఉంది. స్విగ్గీ వంటి వాటికి గట్టి పోటీగా ఉంది జొమాటో. అలాగే వివిధ నగరాల్లోకి చొచ్చుకుపోతోంది.

సేవలు మరింత విస్తృతం

సేవలు మరింత విస్తృతం

ఈ ఐపీవో ద్వారా సేకరించిన నిధులను సేవలను మరింత విస్తృతం చేయడంతో పాటు సరికొత్త సాంకేతికతను అందిపుచ్చుకోవడానికి వినియోగిస్తామని జొమాటో తెలిపింది. ఈ ఏడాది జొమాటోనే అతిపెద్ద ఐపీవో. అయితే పేటీఎం దీనిని అధిగమిస్తుందని భావిస్తున్నారు. దేశీయంగా టాప్ 20-30 నగరాలకు కార్యకలాపాలు విస్తరించిన అనంతరం వృద్ధి అవకాశాలు పెద్దగా ఉండటం లేదని మార్కెట్ పరిశీలకులు చెబుతున్నారు. దీంతో స్టార్టప్ సంస్థలు అంతర్జాతీయ మార్కెట్ వైపు దృష్టి సారిస్తున్నారు.

English summary

దుమ్ములేపిన జొమాటో, సేవలు మరింత విస్తృతపరిచేందుకే... | Zomato IPO is creating a buzz among investors

The Rs 9,375 crore Zomato IPO saw a strong investor response on Wednesday as the issue crossed the half-way-mark by 3 pm on first day of bidding.
Story first published: Wednesday, July 14, 2021, 17:31 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X