ఉద్యోగుల ఓవర్ టైమ్ గురించి కేంద్ర ప్రభుత్వం పార్లమెంటరీ ప్యానెల్‌కు వివరణ ఇచ్చింది. అదనపు సమయానికి వేతనం చెల్లిస్తేనే ఉద్యోగులతో ఎనిమిది గంటలకు మించి పని చేయించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వాలకు అనుమతి ఇచ్చినట్లు పార్లమెంటరీ స్థాయి సంఘానికి తెలిపింది. అలాగే కార్మికులకు ఇష్టమైతేనే నాలుగు కార్మిక చట్టాలకు లోబడి అనుమతించినట్లు తెలిపింది.

ఓవర్ టైమ్‌కు వేతనం ఇస్తేనే..
కరోనా మహమ్మారి నేపథ్యంలో దాదాపు తొమ్మిది రాష్ట్రాలు ఎనిమిది గంటలకు బదులు పన్నెండు గంటలకు వర్కింగ్ హవర్స్ పెంచాలని ప్రతిపాదించాయి. అయితే కార్మిక సంఘాలు సహా వివిధ వర్గాల నుండి విమర్శలు వెల్లువెత్తడంతో నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. కార్మిక చట్టాల ప్రకారం వర్కర్స్‌తో ఎనిమిది గంటలకు పైగా పని చేయించుకుంటే ఓవర్ టైమ్ చెల్లించాలని, అదనపు వేతనం చెల్లించకుండా ఎనిమిది గంటలకు మించి వర్కింగ్ హవర్స్‌ను పెంచలేదని కేంద్రంలోని ఉన్నతాధికారులు సోమవారం పార్లమెంటరీ ప్యానెల్‌కు సూచించారు.

వివరణ కోరుతూ లేఖలు..
కరోనా, లాక్ డౌన్ సమయంలో రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక చట్టాల్లో తాత్కాలికంగా మార్పులు, కార్మిక చట్టాలను విస్మరించడం, వలస కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంపవర్‌మెంట్ శాఖ ఉన్నతాధికారులు బీజేడీ ఎంపీ భర్తృహరి మహ్తాబ్ అధ్యక్షతన గల కార్మిక, పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీకి నివేదించింది.
దాదాపు తొమ్మిది రాష్ట్రాలు పని గంటలను 8 గంటల నుండి 12 గంటలకు పెంచాలని కోరినట్లు తెలిపింది. ఆ తర్వాత విమర్శలు రావడంతో వెనక్కి తీసుకుంది. ఇందుకు సంబంధించి దీనిపై వివరణ కోరుతూ లేబర్ పార్లమెంటరీ ప్యానెల్ ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖలు రాసింది. పని గంటలు ఎందుకు పెంచారో చెప్పాలని ప్రశ్నించింది.

అదనపు పని చేయించుకుంటే.. వేతనం లేదా సెలవులు
నాలుగు చట్టాల పరిధిలోనే పని గంటల్లో మార్పులు చేసుకునేందుకు అనుమతించామని అధికారులు తెలిపారు. అంతర్జాతీయ కార్మిక సమితి (ILO)కు అనుబంధం కావడంతో ఎనిమిది గంటలకు మించి పని చేయించలేమని తెలిపింది. ఒకవేళ పెంచితే అందుకు కార్మికుల అనుమతి ఉండాలని, అదనపు సమయానికి వేతనం ఇవ్వాల్సి ఉంటుందని తెలిపింది. లేదా ఆ మేరకు సెలవులు ఇవ్వాల్సి ఉంటుందని వెల్లడించింది.

వలస కార్మికుల దుస్థిత్పౌ..
లాక్ డౌన్ సమయంలో వలస కార్మికుల దుస్థితి గురించి కూడా ప్యానెల్ ప్రశ్నించింది. వలస కార్మికుల యొక్క నిర్వచనం పరిధిని విస్తృతం చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇందులో సొంతగా కష్టం చేసుకునే హ్యాకర్లు, రిక్షా లాగేవారు, ఇతర స్వయం ఉపాధి కార్మికులను చేర్చాలని ప్యానెల్ సభ్యులు సూచించారు. అలాగే వీరు తమ సొంత రాష్ట్రాల్లో అర్హత కలిగిన అన్ని ప్రయోజనాలు పొందేలా చూడాలని తెలిపారు. ఈఎస్ఐ, ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ వంటి ప్రయోజనాలు పొందే పరిస్థితుల్ని సులభతరం చేయాలని సూచించింది.
More From GoodReturns

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్‌లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

ప్రయోగశాలలో పండించిన బంగారం వచ్చేస్తోంది.. ఇక పసిడి తవ్వకాలకు గుడ్ బై చెప్పడమే..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారం ధరలు ఒక్కసారిగా తగ్గడంపై ఆశ్చర్యపోతున్న బులియన్ నిపుణులు.. భవిష్యత్ ర్యాలీపై తీవ్ర ఆందోళన..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు: క్రూడ్ ఆయిల్ పతనం తర్వాత బంగారం, వెండి ధరలు ఇలా..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?



Click it and Unblock the Notifications