మెటా యాజమాన్యంలోని ఇన్‌స్టాగ్రామ్ తన పని విధానంలో కీలక నిర్ణయాన్ని తీసుకుంది. అమెరికాలో ఉన్న ఉద్యోగులు ఫిబ్రవరి 2, 2026 నుండి వారానికి ఐదు రోజులు కార్యాలయానికి తప్పనిసరిగా హాజరు కావాలని ఈ కొత్త నియమం ప్రకటించింది. కరోనా తర్వాత సంవత్సరాలుగా కొనసాగుతున్న హైబ్రిడ్, రిమోట్-వర్క్ మోడల్‌ను పూర్తిగా నిలిపివేస్తూ, సంస్థ మళ్లీ మహమ్మారి ముందు ఉన్న పని సంస్కృతికి తిరిగి వెళ్లేందుకు సిద్ధమవుతోంది.
ఈ నిర్ణయం వెనుక ముఖ్యమైన కారణాన్ని ఇన్‌స్టాగ్రామ్ నాయకత్వం వెల్లడించింది. ఉద్యగోల టీం భౌతికంగా కలిసి ఉన్నప్పుడు పని నాణ్యత, సృజనాత్మక ఆలోచనలు, వేగవంతమైన నిర్ణయాలు, జట్టుకృషి గణనీయంగా మెరుగవుతాయని వారు భావిస్తున్నారు. వీడియో కాల్స్ ద్వారా అధికారిక సమావేశాలు జరిగినా, ఆసక్తకర చర్చలు, ముఖాముఖీ చర్చలు, ఆలోచనలో మార్పు వంటి అంశాలను పూర్తిగా డిజిటల్ పద్ధతిలో పునరావృతం చేయడం సాధ్యం కాదని యాజమాన్యం చెబుతోంది. అలాగే ఆఫీసులో అందరితో కలిసి ఉండటం ఉద్యోగుల మధ్య బంధాన్ని బలపరుస్తుందని, పని పట్ల ఉత్సాహాన్ని పెంచుతుందని వారు అంచనా వేస్తున్నారు.

రాబోయే సంవత్సరం సోషల్ మీడియా రంగానికి సవాళ్లతో కూడుకున్నదని Instagram కంపెనీ స్పష్టం చేసింది. వినియోగదారుల అలవాట్లు వేగంగా మారడం, AI-ఆధారిత టెక్నాలజీల విస్తరణ, వీడియో కంటెంట్‌పై పెరుగుతున్న పోటీ, రాబోయే మార్కెట్ ఒత్తిడి.. ఇవన్నీ కలిసి పరిశ్రమను మరింత కఠిన మార్గంలో నడిపిస్తాయని భావిస్తున్నారు. కాబట్టి ఉద్యోగులు ఒకే ప్రదేశంలో పనిచేయడం ద్వారా మరింత వేగంగా ఆవిష్కరణలు చేయగలమని, బలమైన ఉత్పత్తులను నిర్మించడానికి వ్యూహాత్మక నిర్ణయాలు త్వరగా తీసుకోగలమని కంపెనీ నమ్ముతోంది.
కరోనా తరువాత దాదాపు మూడు సంవత్సరాలుగా ఇన్‌స్టాగ్రామ్ హైబ్రిడ్ షెడ్యూల్‌ను అనుసరిస్తూ వచ్చింది. అనేక మంది ఉద్యోగులు ఇంటి నుండి పనిచేస్తూ సమయాన్ని ఆదా చేసుకోవడం, వర్క్-లైఫ్ బ్యాలెన్స్‌ను ఆస్వాదించడం, కుటుంబంతో సమయం గడపడం వంటి ప్రయోజనాలను అనుభవించారు. ఈ సౌలభ్యం చాలా మందికి ఎంతో ఇష్టమైంది. అయితే ఇన్‌స్టాగ్రామ్ ఇప్పుడిచ్చిన రిటర్న్-టు-ఆఫీస్ ఆర్డర్ ఉద్యోగులకు కొత్త సవాళ్లను తెచ్చే అవకాశం ఉంది. ట్రాఫిక్, ప్రయాణ సమయాలు, పిల్లల సంరక్షణ, వ్యక్తిగత జీవితంతో పనిని సమన్వయించడం మళ్లీ కష్టమైన అంశాలవచ్చు. కొన్ని వర్గాలు ఈ నిర్ణయాన్ని విమర్శిస్తూ, ఇది ఉద్యోగులకు ఒత్తిడిని పెంచవచ్చని అంటున్నాయి.
అయితే ఇదే సమయంలో.. ఆఫీస్ సంస్కృతి తిరిగి రావడం పట్ల సంతోషంగా ఉన్న ఉద్యోగులు కూడా ఉన్నారు. వారిలో కొంతమంది ముఖాముఖి చర్చలు, ప్రత్యక్ష టీమ్ వర్క్, కార్యాలయ వాతావరణంలోని ఉత్సాహం మరియు సహ ఉద్యోగులతో ఉన్న అనుబంధం మళ్లీ పునరుద్ధరించబడుతుందని ఆశిస్తున్నారు.
ఈ నిర్ణయం టెక్ పరిశ్రమలో పెద్ద చర్చకు దారితీసింది. ఎందుకంటే అనేక టెక్ కంపెనీలు ఇప్పటికి కూడా హైబ్రిడ్ పద్ధతిని ఉత్తమ పరిష్కారంగా పరిగణిస్తున్నాయి. కాని ఇన్‌స్టాగ్రామ్ తీసుకున్న ఈ చర్య ద్వారా ఆఫీస్-సెంట్రిక్ వర్క్ కల్చర్ మళ్లీ పెరగవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. మరికొంతమంది దీనిని "పరీక్షా కాలం"గా చూస్తున్నారు.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications