నిన్న మొన్నటి వరకు పుంజుకున్న స్టాక్ మార్కెట్లకు మళ్లీ ఇప్పుడు కరోనా భయం పట్టుకుంది. రోజురోజుకీ పెరుగుతున్న కరోనా కేసులతో , కరోనా సెకండ్ వేవ్ దేశంలో విజృంభిస్తున్న పరిస్థితులు, వివిధ రాష్ట్రాలలో అక్కడక్కడా విధించిన లాక్ డౌన్ లు వెరసి స్టాక్ మార్కెట్లకు టెన్షన్ పట్టుకుంది. ఇదిలా ఉంటే యుఎస్ ఫెడరల్ రిజర్వ్ మీట్ ఫలితానికి ముందు ప్రపంచ పెట్టుబడిదారులు జాగ్రత్తగా వ్యాపారం చేయడం మార్కెట్లపై ఊహించని ఒత్తిడిని కొనసాగించింది.

నష్టాల్లోకి జారుకుంటున్న స్టాక్ మార్కెట్లు
దీంతో ఈ రోజు కూడా మార్కెట్లు నష్టాల్లోకి జారుకున్నాయి దేశీయ స్టాక్ మార్కెట్ వరుసగా ఐదో రోజు నష్టాలను చవిచూశాయి . బిఎస్‌ఇ సెన్సెక్స్ 585 పాయింట్లు పడిపోయి 49,216 వద్ద ముగిసింది. ఇక నొప్పి 123 పాయింట్ పడిపోయి 14,557 కి చేరుకుందియుఎస్ ఫెడ్ సమావేశానికి ముందు పెట్టుబడిదారులు జాగ్రత్తగా వర్తకం చేయడంతో పాటు, కోవిడ్ కేసులలో తిరిగి పుంజుకోవడంతో భారత మార్కెట్ ప్రతికూల ఫలితాలను చవిచూడాల్సి వస్తుంది.

అమ్మకాల వైపు మొగ్గు చూపుతున్న ఇన్వెస్టర్లు
దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో అప్రమత్తమైన ఇన్వెస్టర్లు, అమ్మకాల వైపు మొగ్గు చూపారు. ఇప్పటికే పలు రాష్ట్రాలలో కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉన్న కారణంగా లాక్డౌన్ విధిస్తూ పోతున్నారు. ఇక ఈ పరిస్థితులు మరింత పెరిగే ప్రమాదం ఉందని కేంద్రం సైతం హెచ్చరికలు జారీ చేస్తుంది. దీంతో మార్కెట్లు నష్టాల బాటలో పయనిస్తున్నాయి.
మొన్నటి వరకు ఉత్సాహంగా పరుగులు తీసిన దేశీయ స్టాక్ మార్కెట్లు వరసగా నష్టాల్లోకి జారిపోతున్నాయి.

క్షీణిస్తున్న కీలక సూచీలు .. కరోనా భయమే కారణం ..
వరుసగా ఐదో రోజూ మార్కెట్లు బలహీనపడ్డాయి. దీనికి పెరుగుతున్న కరోనా మహమ్మారి కూడా ఒక కారణమని నిపుణులు భావిస్తున్నారు. దేశంలో మళ్లీ కరోనా మహమ్మారి విజృంభిస్తుంది అన్న కారణాలతో మార్కెట్లో మళ్లీ ఒక్కసారిగా కుదుపులు మొదలయ్యాయి. కరోనామహమ్మారి విజృంభిస్తున్న అంచనాల మధ్య కీలక సూచీలు కుప్పకూలాయి. దాదాపు అన్ని రంగాలలోనూ అమ్మకాల ఒత్తిడి పెరిగింది . బేర్ గుప్పెట్లోకి దేశీయ స్టాక్ మార్కెట్లు చేరుకున్నాయి.
More From GoodReturns

భారీ నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్.. కుప్పకూలిన సెన్సెక్స్, నిఫ్టీ ప్రధాన సూచీలు..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications