For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఇది తెలుసా? మీ బంగారం పోతే ఉచిత ఇన్సురెన్స్! నిర్లక్ష్యం వహిస్తే బాధ్యత లేదు

|

బంగారం రిటైలర్లు కొత్త కొత్త స్కీంలతో ముందుకొస్తున్నారు. కరోనా నేపథ్యంలో మార్చి చివరి వారం నుండి పసిడి, వెండి అమ్మకాలు పడిపోయాయి. సెప్టెంబర్, అక్టోబర్ నుండి క్రమంగా పుంజుకున్నాయి. దాదాపు ఐదారు నెలల పాటు సేల్స్ లేక వ్యాపారులు తీవ్రంగా నష్టపోయారు. సేల్స్ పెంచుకోవడానికి సరికొత్త ఆఫర్లకు తెరదీస్తున్నారు. రాయితీలు, డిస్కౌంట్లు ఎప్పుడు వినేదే. ఇటీవలి కాలంలో ఆభరణాల కొనుగోళ్ళపై ఉచిత బీమా సౌకర్యాన్ని అందిస్తున్నాయి. ఈ బీమా సదుపాయాన్ని దేశవ్యాప్తంగా అతిపెద్ద ఆభరణాల విక్రయ సంస్థలు అందిస్తున్నాయి. అల్లర్లు, భూకంపం, తుపాన్ వంటి విపత్తుల సమయంలో బీమా కవరేజీ లభిస్తుంది. ఇందుకు ఎలాంటి పాలసీ డాక్యుమెంట్లు అవసరం లేదు.

ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారెంటీ స్కీం మార్చి 31 వరకు పొడిగింపు: MSME,ముద్రా, ఇండివిడ్యువల్స్‌కు..ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారెంటీ స్కీం మార్చి 31 వరకు పొడిగింపు: MSME,ముద్రా, ఇండివిడ్యువల్స్‌కు..

ఉచిత జ్యువెల్లరీ ఇన్సురెన్స్

ఉచిత జ్యువెల్లరీ ఇన్సురెన్స్

మీరు ప్రయాణించే సమయంలో మీ బంగారం చోరీకి గురైందా? అయితే మీరు కొనుగోలు చేసిన ఉత్పత్తికి సంబంధించిన బిల్లును చూసి ఇన్సూరెన్స్ ఉందా చెక్ చేయండి. అనేక జ్యువెల్లరీ సంస్థలు తమ వద్ద కొనుగోలు చేసే జ్యువెల్లరీ పైన ఉచిత బీమా సౌకర్యాన్ని అందిస్తున్నాయి. పీసీ జ్యువెల్లర్స్, పప్లీ జ్యువెల్లర్స్, పీఎన్జీ జ్యువెల్లర్స్, మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్, ఓఆర్ఆర్ఏ, కారాట్లెన్, ఎస్ఎల్జీ జ్యువెల్లర్స్, రత్నాలయ జ్యువెల్లర్స్, కళ్యాణ్ జ్యువెల్లర్స్ తదితర ఎన్నో సంస్థలు తమ కస్టమర్లకు ఉచిత జ్యువెల్లరీ ఇన్సురెన్స్ కవర్ అందిస్తున్నాయి.

ఇలాంటి పరిస్థితుల్లో ఇన్సురెన్స్

ఇలాంటి పరిస్థితుల్లో ఇన్సురెన్స్

అల్లర్లు, భూకంపం, వరదలు, తుఫాన్ వంటి ప్రకృతి విపత్తుల సమయంలో, అలాగే దొంగతనం, దోపిడీ వంటి పరిస్థితుల్లోను ఈ బీమా కవరేజ్ ఉంటుంది. బీమా వినియోగదారులకు అదనపు ప్రయోజనమని ఓఆర్ఆర్ఏ మేనేజింగ్ డైరెక్టర్ దీపు మెహతా అన్నారు. ఎలాంటి డాక్యుమెంట్స్ ఇవ్వకపోయినా ఎన్నో జ్యువెల్లరీ సంస్థలు ఇన్సురెన్స్ పాలసీని అందిస్తున్నాయి.

ఈ బీమా అన్ని జ్యువెల్లరీ దుకాణాల్లో అందుబాటులో ఉండకపోవచ్చు. కాబట్టి కవరేజీ ఎలా ఉంది, ఎంత ఉందో చెక్ చేసుకోవాలి. కొన్ని సంస్థలు మొదటి ఏడాది కస్టమర్ తరఫున ప్రీమియం చెల్లిస్తాయి. రెండో సంవత్సరం రెన్యూవల్ కస్టమర్ చేసుకోవచ్చు.

అన్ని ఉత్పత్తులపై ఉంటుందా?

అన్ని ఉత్పత్తులపై ఉంటుందా?

ఉచిత ఇన్సురెన్స్ కొన్ని జ్యువెల్లరీ దుకాణాల్లో ఉంటుంది. అలాగే అన్ని ఉత్పత్తులపై ఉండకపోవచ్చు. కొన్ని దుకాణాలు డైమండ్ జ్యువెల్లరీ స్థాయిల్లో అందిస్తున్నాయి. రూ.10,000 లోపు ఉత్పత్తులు, గిఫ్ట్ కార్డుల వంటి వాటిపై దుకాణదారులు అందించడం లేదు.

ఆభరణాలు పోయినంత మాత్రాన క్లెయిమ్ చేయలేరు

ఆభరణాలు పోయినంత మాత్రాన క్లెయిమ్ చేయలేరు

అయితే ఇక్కడ మీరు ఆభరణాలు కోల్పోయినట్లు రుజువు ఉండాలి. నిర్లక్ష్యంతో ఆభరణాలు పోగొట్టుకుంటే దానిని క్లెయిమ్ చేయలేరు. బంగారం ఎలా పోయిందనే విషయాన్ని నిరూపించడం కాస్త సవాల్. పోలీసు ఎఫ్ఐఆర్ నమోదు చేసుకోగలిగిన నష్టం బీమా పరిధిలోకి రావొచ్చు. ఉదాహరణకు మీరు హోటల్ వాష్ రూంలో మరిచిపోయి, మీ జ్యువెల్లరీని నిర్లక్ష్యంతో పోగొట్టుకుంటే క్లెయిమ్చేయలేరు.

ఉచిత రవాణా బీమా

ఉచిత రవాణా బీమా

ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసిన కొనుగోళ్లపై ఉచిత రవాణా బీమాను అందిస్తున్నాయి. వేర్ హౌస్ నుండి మీ ఇంటికి డెలివరీ చేసే సందర్భంలో మాత్రమే ఇన్సురెన్స్ వర్తిస్తుది. ఇంటికి చేరే వరకు జ్యువెల్లరీ సంస్థలదే బాధ్యత అని, కాబట్టి కొనుగోలుదారులు ధైర్యంగా ఉండవచ్చునని చెబుతున్నారు.

English summary

ఇది తెలుసా? మీ బంగారం పోతే ఉచిత ఇన్సురెన్స్! నిర్లక్ష్యం వహిస్తే బాధ్యత లేదు | Wise to opt for gold jewellery insurance, All about the free insurance

Lost your jewellery to an incident of theft while travelling with the piece or due to burglary? Get the bill and check with your jeweller if the product you purchased was insured.1
Story first published: Monday, November 16, 2020, 13:39 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X