For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Wipro Q2 results: నికర లాభం 3% డౌన్, రూ.9500 కోట్ల బైబ్యాక్

|

భారత నాలుగో ఐటీ సేవల సంస్థ విప్రో 2020-21 ఆర్థిక సంవత్సరం రెండో క్వార్టర్ (సెప్టెంబర్) ఫలితాలను మంగళవారం (13 అక్టోబర్) ప్రకటించింది. రెండో త్వైమాసికంలో విప్రో ఏకీకృత లాభం 3.2 శాతంగా నమోదయింది. ఏడాది ప్రాతిపదికన నికర లాభం 3 శాతం క్షీణించింది. విప్రో వరుసగా వృద్ధిని నమోదు చేస్తోంది. కరోనా నేపథ్యంలో మిగతా అన్ని రంగాలతో పోలిస్తే ఐటీ రంగం వృద్ధి ఆశాజనకంగా ఉంది. కంపెనీ రూ.9,500 కోట్ల షేర్ల బైబ్యాక్‌ను ప్రకటించింది. మూడో క్వార్టర్‌లో ఏకీకృత లాభం రూ.2,390.4 కోట్ల నుండి రూ.2,465.7 కోట్లకు పెరిగింది.

TCS Q2 results: నికర లాభంలో 7% క్షీణత, రూ.16,000 కోట్ల షేర్ల బైబ్యాక్TCS Q2 results: నికర లాభంలో 7% క్షీణత, రూ.16,000 కోట్ల షేర్ల బైబ్యాక్

విప్రో లాభాలు

విప్రో లాభాలు

ఏకీకృత ఆదాయం 1.2 శాతం లాభపడి రూ.15,096.7 కోట్లకు పెరిగింది. క్వార్టర్ ప్రాతిపదికన డాలర్ రెవెన్యూలో వృద్ధి 3.7 శాతం పెరిగి 1,992.4 డాలర్లకు చేరింది. స్థిర కరెన్సీలో ఐటీ సేవల విభాగం ఆదాయం 2 శాతం పెరిగింది. క్వార్టర్లీ ప్రాతిపదికన మొదటి త్రైమాసికంలో 7.5 శాతం క్షీణించింది. విప్రో లాభాలు పలువురి అంచనాలు మించాయి. ఐటీ సేవల విభాగంలో రూపాయి ఆదాయం 1.2 శాతం పెరిగి రెండో క్వార్టర్‌లో రూ.14,768.1 కోట్లకు చేరింది.

తదుపరి క్వార్టర్‌లోను మంచి ఫలితాలు

తదుపరి క్వార్టర్‌లోను మంచి ఫలితాలు

రెవెన్యూ వృద్ధి, బలమైన నగదు నిల్వలతో ఈ క్వార్టర్ మంచి ఫలితాలు అందించిందని విప్రో విప్రో సీఈవో, మేనేజింగ్ డైరెక్టర్ అన్నారు. ప్రస్తుత ఫలితాలు ఉత్సాహాన్ని ఇచ్చేలా ఉన్నాయని వ్యాఖ్యానించారు. కాగా, రాబోయే క్వార్టర్‌లోను ఫలితాలు ఆశాజనకంగా ఉంటాయని భావిస్తోంది. డిసెంబర్ త్రైమాసికంలో ఐటీ సేవల బిజినెస్ నుండి రెవెన్యూ 2,022-2,062 మిలియన్ డాలర్ల మధ్య ఉంటుందని అంచనా వేస్తోంది. ఇది వరుసగా 1.5 శాతం నుండి 3.5 శాతం మేర వృద్ధి నమోదు చేసినట్లు అవుతుంది.

విప్రో బైబ్యాక్

విప్రో బైబ్యాక్

ఇటీవల టీసీఎస్ బైబ్యాక్ ప్లాన్‌‌ను ప్రకటించింది. విప్రో కూడా అదే దారిలో నడిచింది. రూ.9500 కోట్ల విలువైన బైబ్యాక్‌కు బోర్డు అంగీకారం తెలిపింది. రూ.400 వద్ద 23.75 కోట్ల షేర్లు బైబ్యాక్ చేయాలని నిర్ణయించింది. ఇది మొత్తం వ్యాల్యూలో 4.16 శాతం. విప్రో షేర్ ఈ రోజు 0.5 శాతం మేర నష్టపోయి రూ.375 వద్ద ముగిసింది. బైబ్యాక్ 6.6 శాతం ప్రీమియం లభిస్తుంది.

English summary

Wipro Q2 results: నికర లాభం 3% డౌన్, రూ.9500 కోట్ల బైబ్యాక్ | Wipro Q2 results: Net profit declines 3 percent YoY

Wipro, the fourth largest IT services company in India, has registered a 3.2 percent sequential growth in consolidated profit for the quarter ended September 2020, while IT services segment earnings were ahead of analysts estimates on all front. The company announced share buyback of Rs 9,500 crore.
Story first published: Tuesday, October 13, 2020, 17:49 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X