For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Petrol diesel: అంతర్జాతీయంగా తగ్గుతోన్న క్రూడ్ ఆయిల్ ప్రైస్.. పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గుతాయా..

|

అంతర్జాతీయంగా క్రూడ్ ఆయల్ ధరలు తగ్గుతున్నాయి. ప్రస్తుతం బ్రెంట్ క్రూడ్ బ్యారెల్‌కు 95 డాలర్ల దిగువన ట్రేడవుతోంది. దీంతో త్వరలో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయని భావిస్తున్నారు. అయితే తగ్గుదల వల్ల వచ్చిన లబ్దిని ఆయిల్ కంపెనీల నష్టాలను తగ్గించుకోవడానికి ఉపయోగిస్తామని కేంద్రం తెలిపింది. అంటే ఆయిల్ కంపెనీలు లాభాల బాటలోకి వచ్చిన తర్వాత ధరలు తగ్గే అవకాశం ఉంది.

హర్దీప్ సింగ్

హర్దీప్ సింగ్

అయితే అప్పటి వరకు అంతర్జాయంగా క్రూడ్ ఆయిల్ ధర తగ్గే ఉంటుందా అంటే కష్టమేనని చెప్పారు. దీంతో పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపుపై ప్రజలు ఆశలు పెట్టుకోవడం మానేయడం మంచిది. చమురు కంపెనీలు తమ నష్టాలను భర్తీ చేయడానికి సమయం కావాలని పెట్రోలియం, సహజవాయువు మంత్రి హర్దీప్ సింగ్ చెప్పారు.

ఆ తర్వాత తగ్గింపు..

ఆ తర్వాత తగ్గింపు..

ఆ తర్వాతే పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపుపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని చెప్పారు. 15 రోజుల్లో ముడి చమురు ధరల సగటు కొనుగోలు ధర ఆధారంగా చమురు కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలను రోజువారీగా సమీక్షిస్తాయి. గత 137 రోజులుగా పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు. చమురు రిటైల్ అమ్మకంపై రూ. 18,000 కోట్ల నష్టం వాటిల్లిందని చమురు కంపెనీలు గత నెలలో వెల్లడించాయి.

పెరిగిన ధర

పెరిగిన ధర

ప్రస్తుతం చమురు పతనంపై కంపెనీలు ఈ నష్టాన్ని పూడ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఇది ఇలా ఉండగా శుక్రవారం ముడిచమురు ధర పెరిగింది. బ్రెంట్ క్రూడ్ బ్యారెల్‌కు మరోసారి 90 డాలర్లు దాటగా.. రోజులో 4 శాతానికి పైగా పెరిగింది. అయితే, గత ఒక నెలలో చాలా వరకు, బ్రెంట్ బ్యారెల్‌కు $100 స్థాయి కంటే దిగువనే కొనసాగుతోంది.

English summary

Petrol diesel: అంతర్జాతీయంగా తగ్గుతోన్న క్రూడ్ ఆయిల్ ప్రైస్.. పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గుతాయా.. | Will the prices of petrol and diesel in the country decrease as the price of crude oil decreases internationally?

Crude oil prices are falling internationally. With this, there is a possibility that the prices of petrol and diesel will decrease in the country as well.
Story first published: Saturday, September 10, 2022, 14:56 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X