For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఫిబ్రవరి 1, శనివారం కూడా స్టాక్ మార్కెట్లు తెరిచే ఉంటాయి, కారణమిదే

|

న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ 2020 ఫిబ్రవరి 1న బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఈ సారి బడ్జెట్ రోజున కూడా స్టాక్ మార్కెట్ ట్రేడింగ్‌ను నిర్వహించే అవకాశాలు ఉన్నాయి. కేంద్రం బడ్జెట్ ప్రవేశ పెట్టే ఫిబ్రవరి 1న శనివారం అవుతోంది. ఈ నేపథ్యంలో ఈసారి శనివారం కూడా స్టాక్ మార్కెట్లు తెరిచే ఉంటాయని కథనాలు వస్తున్నాయి.

NSE ఆ రోజు పని చేసే అవకాశాలు ఉన్నాయి. గత ఏడాదితో పోలిస్తే ఈసారి దలాల్ స్ట్రీట్ ట్రేడర్లకు దాదాపు ఐదు సెలవులు తక్కువగా వచ్చాయి. ఈసారి జనవరి 1వ తేదీన మార్కెట్లు పని చేసినప్పటికీ మరో రోజు వీరికి సెలవు దక్కలేదు. ఆ రోజు ప్రపంచవ్యాప్తంగా చాలా మార్కెట్లకు సెలవులు ఉన్నాయి. ఫిబ్రవరిలో మహాశివరాత్రి రోజు మాత్రమే సెలవు లభించనుంది.

ఈ బ్యాంకు నుంచి రూ.35,000 కంటే ఎక్కువ విత్‌డ్రా చేసుకోలేరుఈ బ్యాంకు నుంచి రూ.35,000 కంటే ఎక్కువ విత్‌డ్రా చేసుకోలేరు

Will market open for a Saturday Budget?

ఇంగ్లీష్ మీడియాలో వచ్చిన కథనం మేరకు.. బడ్జెట్ ప్రవేశపెట్టే రోజున (ఫిబ్రవరి 1) కూడా స్టాక్ ఎక్స్చేంజ్ తెరిచి ఉంటుందని, ఎన్ఎస్ఈ కూడా ట్రేడింగ్ కోసం బడ్జెట్ రోజున తెరిచే ఉంటుందని, రెండు స్టాక్ ఎక్స్చేంజీలు కూడా ఒకే ట్రేడింగ్ క్యాలెండర్‌ను ఫాలో అవుతాయని బీఎస్ఈకీ చెందిన ఓ ప్రతినిధి చెప్పారు.

సాధారణంగా స్టాక్ మార్కెట్లు శనివారం, ఆదివారం పని చేయవు. ప్రతి వారంలో ఈ రెండు రోజులు హాలీడేస్. కానీ ఫిబ్రవరి 1న బడ్జెట్ ప్రవేశ పెట్టే శనివారం కూడా తెరిచే ఉంటుంది. 2015లో నాటి కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ బడ్జెట్ ప్రవేశ పెట్టిన తేదీ ఫిబ్రవరి 28వ తేదీ శనివారం వచ్చింది. ఆ రోజు స్టాక్ మార్కెట్లు క్లోజ్ అయ్యాయి.

English summary

ఫిబ్రవరి 1, శనివారం కూడా స్టాక్ మార్కెట్లు తెరిచే ఉంటాయి, కారణమిదే | Will market open for a Saturday Budget?

When finance minister Nirmala Sitharaman presents her second budget on February 1, share markets will remain open like any other weekday in spite of the Saturday holiday.
Story first published: Monday, January 13, 2020, 8:02 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X