For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బఫెట్ ఇండికేటర్‌తో మన స్టాక్ మార్కెట్లకు ఏం జరగనుంది?

|

ప్రస్తుతం ప్రపంచ స్టాక్ మార్కెట్ల కు సంబంధించి ఒక పెద్ద చర్చ జరుగుతోంది. అదే బఫెట్ ఇండికేటర్. ఈ ఇండికేటర్ ఏం చెబుతుందంటే... ఒక దేశ జీడీపీ కి ఆ దేశ స్టాక్ మార్కెట్ల మార్కెట్ క్యాపిటలైజషన్ 100% నికి చేరితే అక్కడ స్టాక్ మార్కెట్లు పతనం అయ్యే అవకాశం ఉంటుందని. ఇప్పుడు ఇదే అంశం అగ్ర రాజ్యం అమెరికా సహా ప్రపంచాన్ని వణికిస్తోంది. కొంత కాలంగా అమెరికన్ మార్కెట్లు అంతకంతకూ పెరుగుతూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో వాటి మార్కెట్ క్యాపిటలైజషన్ ఇప్పటికే బఫెట్ ఇండికేటర్ ను సూచించిందని మార్కెట్ అనలిస్టులు పేర్కొంటున్నారు.

అంటే అక్కడ మార్కెట్లు పతనం అయ్యే అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి. సహజంగానే అమెరికన్ మార్కెట్లు పతనం అయితే ఆ ప్రభావం ఇండియన్ స్టాక్ మార్కెట్ల తో పాటు ప్రపంచవ్యాప్త స్టాక్ మార్కెట్లపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుందని ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. అలాగే ప్రస్తుతం మొత్తం ప్రపంచ జీడీపీ తో పోల్చితే స్టాక్ మార్కెట్ల వేల్యూ కూడా బఫెట్ ఇండికేటర్ ను సూచిస్తోంది. దీంతో ఇప్పుడు ఇదే అంశం మన దేశ స్టాక్ మార్కెట్ నిపుణులను సైతం ఆందోళనకు గురిచేస్తోంది. ఎప్పుడు ఏం జరగనుందో అని భయపడుతున్నారు.

కొత్త ట్యాక్స్ స్కీం, ఐటీ అధికారుల్లో టెన్షన్కొత్త ట్యాక్స్ స్కీం, ఐటీ అధికారుల్లో టెన్షన్

2008 లో అందుకే పతనం...

2008 లో అందుకే పతనం...

అమెరికా లో మొదలైన గ్లోబల్ ఫైనాన్సియల్ క్రైసిస్... 2008 లో ప్రపంచాన్ని మొత్తం చుట్టేసింది. అది భారత్ పై కూడా కనిపించింది. ఆ సమయంలో మన స్టాక్ మార్కెట్ల మొత్తం మార్కెట్ క్యాపిటలైజషన్ మన దేశ జీడీపీ తో పోల్చితే 180% నికి చేరుకుంది. బఫెట్ ఇండికేటర్ ప్రకారం 100% దాటితే ఆ దేశ స్టాక్ మార్కెట్లు పతనం చవిచూడాల్సిందే.

అప్పుడు సరిగ్గా అదే జరిగింది. మన స్టాక్ మార్కెట్లు విపరీతమైన పతనం చెందాయి. ఈ మేరకు ది ఎకనామిక్ టైమ్స్ ఒక ప్రత్యేక కథనం ప్రచురించింది. అందులో అనేక ఆసక్తికరమైన అంశాలను ప్రస్తావించింది. 1992 ఆ తర్వాత 2000 సంవత్సరంలో ఎదురైన మార్కెట్ పతనానికి కూడా ఇలాంటి చరిత్ర ఉంది. అయితే 2000 సంవత్సరంలో మాత్రం టెక్నాలజీ రంగంలో బబుల్ బరస్ట్ అవటంతో గ్లోబల్ మార్కెట్లు పతనం ఐన విషయం విదితమే.

ఇప్పుడు అమెరికాలో అదే పరిస్థితి...

ఇప్పుడు అమెరికాలో అదే పరిస్థితి...

ప్రముఖ మార్కెట్ అనలిస్టుల అంచనాల ప్రకారం ప్రస్తుతం అమెరికన్ స్టాక్ మార్కెట్ల మార్కెట్ క్యాపిటలైజషన్ ఆ దేశ జీడీపీ కి సుమారు 177% ఉండటం ఆందోళనకు గురిచేస్తోంది. అంటే బఫెట్ ఇండికేటర్ కంటే కూడా 77% అధిక వాల్యుయేషన్ తో అక్కడి స్టాక్ మార్కెట్లు ట్రేడ్ అవుతున్నాయి. అంటే, అవి కచ్చితంగా పతనాన్ని సూచిస్తున్నాయి.

సరిగ్గా 2008 లో ఇండియా లో స్టాక్ మర్కెట్ల ఇండికేటర్ సూచినట్లే... ప్రస్తుతం అమెరికా మరెట్ల కు కూడా బఫెట్ ఇండికేటర్ భయం పట్టుకుంది. స్టాక్ మార్కెట్లు ఎప్పుడు అంచనాలను తలకిందులు చేస్తుంటాయి. ఊహించిన విధంగా అవి ట్రేడ్ అయ్యే అవకాశాలు తక్కువే. కానీ, కొన్ని ఫండమెంటల్స్ మాత్రం మార్కెట్లకు ఎప్పుడూ వర్తిస్తాయి. కాబట్టి, కొంత మంది అనలిస్టుల మదిలో ఆందోళన నెలకొంది. ఒక వేళ వారి అంచనాలు నిజమైతే మాత్రం... అమెరికా మార్కెట్లు కొంత కరెక్షన్ కు లోనవడం తప్పదు. ఆ పరిణామం భారత్ సహా ఇతర మార్కెట్లపై కూడా ఉంటుందని చెప్పొచ్చు అని విశ్లేషకులు పేర్కొంటున్నారు.

నిఫ్టీ 15,000 కు పెరుగుతుందా... 8,400 కు పడిపోతుందా...

నిఫ్టీ 15,000 కు పెరుగుతుందా... 8,400 కు పడిపోతుందా...

ప్రస్తుతం మన దేశంలోని ప్రముఖ స్టాక్ మార్కెట్లలో ఒకటైన నేషనల్ స్టాక్ ఎక్స్చేంజి (ఎన్ఎస్ఈ) సూచీ నిఫ్టీ 11,385 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతోంది. కానీ, బఫెట్ ఇండికేటర్ ప్రకారం చూస్తే ఇది 15,000 పాయింట్లకు పెరుగుతుందా ... లేదంటే ప్రస్తుతమున్న స్థాయి నుంచి పతనం ఐ 8,400 పాయింట్ల కు చేరుకుంటుందా అనే అంచనాలు ప్రారంభమయ్యాయి.

అయితే మన దేశానికి చెందిన ప్రముఖ మార్కెట్ అనలిస్టుల అభిప్రాయం ప్రకారం ... మన స్టాక్ మార్కెట్లకు ఆ ప్రమాదం లేదని తెలుస్తోంది. 2008 లో జరిగిన క్రాష్ తర్వాత మన దేశంలో బఫెట్ ఇండికేటర్ కనిష్టంగా 56% నికి పడిపోయిందని, ఆ తర్వాత కోలుకుని 75% చేరిందని సమాచారం. కానీ ప్రస్తుతం మార్కెట్ బూమ్ లో అన్ని షేర్లు కాకుండా... కేవలం కొన్ని స్టాక్స్ మాత్రమే అధిక ర్యాలీ ని చూశాయని, దీన్ని బట్టి చూస్తే మన మార్కెట్ కు పతనం ఉండకపోవచ్చని అంచనా వేస్తున్నారు. మన స్టాక్ మార్కెట్ల వాల్యుయేషన్ మరీ ఎక్కువగా లేవని చెబుతున్నారు. అలాగే, కరోనా కు వాక్సిన్ వచ్చే అవకాశం ఉండటంతో పాటు 2021 లో ఆర్థిక వ్యవస్థ కోలుకునే అంశాలు ఇక్కడ ప్రభావం చూపవచ్చని అంటున్నారు. చూద్దాం ఏం జరుగుతుందో.. ఎవరి అంచనాలు నిజం అవుతాయో!

English summary

బఫెట్ ఇండికేటర్‌తో మన స్టాక్ మార్కెట్లకు ఏం జరగనుంది? | why D Street veterans are shrugging off danger signal on Buffett Indicator

With Warren Buffett’s favourite indicator dropping hints that stocks have become expensive globally, Indian investors are wondering whether it will halt the rally on Dalal Street too.
Story first published: Thursday, August 20, 2020, 19:17 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X