For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Cooking Oil: అంతర్జాతీయ మార్కెట్లలో లీటరుకు రూ.50 తగ్గిన వంటనూనెలు.. ఇక్కడ ఎలా ఉన్నాయంటే..

|

Oil Prices: విదేశీ మార్కెట్లలో వంటనూనెల ధరల పతనం కారణంగా దేశవ్యాప్తంగా నూనె గింజల మార్కెట్లలో ఆవాలు, సోయాబీన్, వేరుశెనగ, పత్తి, సీపీఓ, పామోలిన్ ఆయిల్ సహా వివిధ నూనె గింజల ధరలు గత వారంలో పడిపోయాయి. మిగిలిన వంటనూనెలు, నూనె గింజల ధరల్లో ఎలాంటి మార్పు లేదు. దిగుమతి చేసుకున్న సోయాబీన్‌, సీపీఓ, పామోలిన్‌, సన్‌ఫ్లవర్‌ నూనెల హోల్‌సేల్‌ ధర కిలోకు దాదాపు రూ.50 తగ్గిందని వ్యాపారులు చెబుతున్నారు.

కానీ.. ఇప్పటికే దిగుమతి చేసుకున్న వ్యాపారులు తక్కువ ధరలకు అమ్మాల్సి వస్తుందని అంటున్నారు. పైగా వాటి కోసం తీసుకున్న బ్యాంక్ రుణాలకు పెరిగిన డాలర్ రేటు ప్రకారం చెల్లించాల్సి ఉంటుందని అంటున్నారు. ఈ కారణంగా వారి జేబులకు చిల్లుపడుతోంది. అందువల్లనే ధరలు ఒకపక్క అంతర్జాతీయంగా తగ్గుతున్నా ఆ ప్రయోజనాలు వినియోగదారులుకు చేరుకోవటం లేదు. పైగా రేట్లు ఏకపక్షంగా వసూలు చేస్తున్నారు.

vegetable oil prices redusing drastically in international markets but benefits not reaching to indian customers

డిమాండ్ ఎక్కువ..
మరో పక్క దిగుమతులపై సుంకాలు తగ్గించటం వల్ల దేశీయ రైతులు నష్టపోతారని, వారిని ఇవి నిరుత్సాహపరుస్తాయి. మరో పక్క దిగుమతి సుంకాలను తొలగించాలని కంపెనీలు కేంద్రాన్ని కోరుతున్నాయి. ఇదే సమయంలో పత్తి గింజల వ్యాపారం చాలా తక్కువగా ఉంది. ఈ క్రమంలో ఆవాల గిరాకీ ఎక్కువగా ఉన్నప్పటికీ మార్కెట్లోకి వాటి రాక సగానికి తగ్గింది. ఆర్డర్ చేసిన తరువాత అవి మన దేశానికి చేరుకోవటానికి కనీసం రెండున్నర నెలల సమయం పడుతున్నట్లు తెలుస్తోంది. ఈ కారణంగా పండుగల సమయం నాటికి ఈ సమస్య మరింత పెరుగుతుందని, ఎడిబుల్ ఆయిల్ సరఫరాలో సమస్య ఉండవచ్చని అంచనాలు చెబుతున్నాయి.

vegetable oil prices redusing drastically in international markets but benefits not reaching to indian customers

తగ్గుతున్న నూనెల ధరలు..
విదేశీ నూనెల తగ్గుదల కారణంగా సమీక్ష వారంలో వేరుశెనగ నూనె గింజల ధరలు కూడా రూ.70 తగ్గి క్వింటాల్‌కు రూ.6,655-6,780కి చేరాయి. గుజరాత్‌లోని వేరుశెనగ నూనె గత వారాంతం ముగింపు ధరతో పోలిస్తే క్వింటాల్‌కు రూ.240 తగ్గి రూ.15,410కి చేరగా, శుద్ధి చేసిన వేరుశెనగ నూనె రూ.135 తగ్గి రూ.2,580-రూ.2,770కి పడిపోయింది. ఇదే క్రమంలో.. పామోలిన్ ఢిల్లీ ధర రూ. 1,300 తగ్గి రూ. 13,450కి, పామోలిన్ కాండ్లా రూ. క్వింటాలుకు రూ.1,450 నుంచి రూ.12,150కి తగ్గాయి.

English summary

Cooking Oil: అంతర్జాతీయ మార్కెట్లలో లీటరుకు రూ.50 తగ్గిన వంటనూనెలు.. ఇక్కడ ఎలా ఉన్నాయంటే.. | vegetable oil prices redusing drastically in international markets but benefits not reaching to indian customers

cooking oils prices falling internationally know full details
Story first published: Monday, June 27, 2022, 14:48 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X