For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

'తీవ్ర ఆర్థిక సంక్షోభంలో అమెరికా, వీరి ముందు సవాళ్లు'

|

వాషింగ్టన్: అమెరికా భారీ సంక్షోభంలో ఉందని, తాము గాడిన పెడతామని కాబోయే ఆర్థికమంత్రి జానెయ్ యెల్లెన్ అన్నారు. ఆర్థిక అంతరాన్ని తగ్గించాలని, ఇతర దేశాల్లో అమెరికా స్థితిని పునరుద్ధరించాలన్నారు. గతంలో కంటే మంచిగా అమెరికా ఆర్థిక వ్యవస్థను నిలబెట్టాలని పిలుపునిచ్చారు. అమెరికన్ ట్రాజెడీగా భావించే ఆర్థిక అసమానతలను పరిష్కరించడంపై దృష్టి సారించాలన్నారు. సంక్షోభంలో ఉన్నందున తమ పరిపాలనా వర్గం (జోబిడెన్) వేగంగా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉందని చెప్పారు. ఇటీవల అమెరికా ఎన్నికల్లో జోబిడెన్ గెలిచిన విషయం తెలిసిందే.

PF అకౌంట్ నుండి డబ్బులు తీసుకున్నారా? ఐటి రిటర్న్స్‌లో ఇది తప్పనిసరి!PF అకౌంట్ నుండి డబ్బులు తీసుకున్నారా? ఐటి రిటర్న్స్‌లో ఇది తప్పనిసరి!

రెంట్ కట్టేందుకు ఇబ్బందులు

రెంట్ కట్టేందుకు ఇబ్బందులు

అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన బైడెన్ తమ పాలక వర్గంలోని ఆర్థిక బృందాన్ని ప్రకటించారు. ఈ సందర్భంగా యెల్లెన్ మాట్లాడారు. అమెరికా మరోసారి చారిత్రాత్మక ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిందన్నారు. వీలైనంత త్వరగా స్పందించి, పరిష్కరించుకుంటే మరింత గడ్డు పరిస్థితులు తప్పవన్నారు. తమ ముందు పలు సవాళ్లు ఉన్నాయని, వాటిని ఎలా అధిగమిస్తామో కూడా యెల్లెన్ వివరించారు. కరోనా మహమ్మారి తీవ్ర ఆర్థిక నష్టాన్ని మిగిల్చిందన్నారు.

ఈ మహమ్మారి వల్ల ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారని, చాలామంది ఉద్యోగాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. చిన్నవ్యాపారాలు ఇబ్బందికర పరిస్థితిల్లో నడుస్తున్నాయని తెలిపారు. కొన్ని వ్యాపారాలు మూసివేశారన్నారు. చాలామంది పౌరులు తినడానికి, బిల్లులు చెల్లించడానికి, రెంట్ కట్టేందుకు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఇది అమెరికన్ ట్రాజెడీ అన్నారు.

వీటిని పరిష్కరించాల్సి ఉంది

వీటిని పరిష్కరించాల్సి ఉంది

ప్రజలకు ఉపాధి కల్పంచి వారిని ఆర్థికంగా పరిపుష్టం చేయడంపై ఇన్నాళ్లు తన కృషి కొనసాగిందని యెల్లెన్ అన్నారు. జోబిడెన్ కూడా తన జీవితం మొత్తం ఆ దిశగానే పని చేశారన్నారు. కరోనా అమెరికా ప్రజలు ఆర్థిక స్థితిగతులపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపిందన్నారు. చాలామంది జీవనోపాధి కోల్పోయారన్నారు. అన్నింటిని పరిష్కరించాల్సి ఉందన్నారు.

బిడెన్ ప్రశంసలు

బిడెన్ ప్రశంసలు

యెల్లెన్ పైన బిడెన్ ప్రశంసలు కురిపించారు. ప్రస్తుత సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి యెల్లెన్‌ను మించి ఎవరూ లేరన్నారు. తాను ఎంపిక చేసిన ఆర్థిక బృందం ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణను వీలైనంత త్వరగా పరిష్కరిస్తుందన్నారు. ఉద్యోగాల కల్పన, ప్రజల ఆదాయాలు పెరుగుదల, ఔషధాల తగ్గింపు, వివిధ వర్గాల మధ్య ఆర్థిక అంతరం వంటి సమస్యలను రూపుమాపడంలో కృషి చేస్తుందని హామీ ఇచ్చారు. కాగా, బడ్జెట్ చీఫ్‌గా ఎన్నికైన నీరా టాండన్ భారతీయ అమెరికన్.

English summary

'తీవ్ర ఆర్థిక సంక్షోభంలో అమెరికా, వీరి ముందు సవాళ్లు' | US facing historic crises again: Treasury Secretary nominee Janet Yellen

Janet Yellen called for closing the U.S. wealth gap and restoring American standing abroad as the former Federal Reserve chair was introduced as President-elect Joe Biden’s choice to be the next Treasury secretary.
Story first published: Wednesday, December 2, 2020, 13:21 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X