For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఉక్రెయిన్ బిగ్ ప్లాన్: మ్యూజియం ఆఫ్ వార్: విరాళాల సునామీ: ఎన్‌ఎఫ్టీ, క్రిప్టో రూపంలో

|

కీవ్: రష్యా, ఉక్రెయిన్ మధ్య కొనసాగుతున్న యుద్ధం నెల రోజులు దాటేసింది. కిందటి నెల 24వ తేదీన ఆరంభమైన ఈ యుద్ధం రావణకాష్ఠంలా మండుతూనే ఉంది. రెండు దేశాలు వెనకడుగు వేయట్లేదు. ఒకవంక శాంతి చర్చలు కొనసాగిస్తూనే.. దానికి సమాంతరంగా దాడులు, ప్రతిదాడులకు దిగుతున్నాయి. రష్యా సంధిస్తోన్న రాకెట్లు, మిస్సైళ్ల ధాటికి ఉక్రెయిన్‌లోని కీలక నగరాలు ధ్వంసం అయ్యాయి. మరుభూమిగా మారాయి. ఆకాశహర్మ్యాలు కుప్పకూలిపోయాయి.

ఆ సెగ్మెంట్‌పై ఎయిర్‌టెల్ ఫోకస్: కంపెనీ షేర్లు కొనుగోలుఆ సెగ్మెంట్‌పై ఎయిర్‌టెల్ ఫోకస్: కంపెనీ షేర్లు కొనుగోలు

రష్యాపై ముప్పేటదాడి..

రష్యాపై ముప్పేటదాడి..

ఈ దాడుల్లో రెండు వైపులా భారీ ఎత్తున ప్రాణనష్టం సంభవించింది. వేలాదిమంది సైనికులు, సాధారణ పౌరులు మరణించారు. ఉక్రెయిన్‌పై దండెత్టూ వస్తోన్నాయి. అలాగనీ- యుద్ధాన్ని సమర్థించట్లేదు. యుద్ధం నిలిపివేయాలంటూ భారత్.. తన గళాన్ని వినిపిస్తూనే ఉంది. మరోవంతిన రష్యాపై పాశ్చాత్య దేశాలన్నీ వ్యతిరేకంగా నిలిచాయి. యూరోపియన్ యూనియన్, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ (నాటో) సభ్య దేశాలు.. రష్యాపై భగ్గుమంటోన్నాయి. ఇప్పటికే అనేక రకాల ఆంక్షలు, నిషేధాలను జారీ చేశాయి. తాజాగా జీ 20 నుంచి కూడా బహిష్కరించడానికి పావులు కదుపుతున్నాయి.

 నిధుల వెల్లువ..

నిధుల వెల్లువ..

రష్యాతో దశాబ్దకాలంగా కొనసాగుతున్న స్నేహ సంబంధాలను దృష్టిలో ఉంచుకుని భారత్‌తో పాటు చైనా వంటి కొన్ని దేశాలు మాత్రమే తటస్థంగా ఉంక- ఉక్రెయిన్‌ పునర్నిర్మాణం కోసం పాశ్చాత్య దేశాలు ముందుకొచ్చాయి. యూరోపియన్ యూనియన్, నాటో సభ్య దేశాలు బిలియన్ల కొద్దీ నిధులను ఉక్రెయిన్‌కు కేటాయించాయి. వెల్లువలా నిధులు వచ్చిపడుతోన్నాయి. అటు ప్రపంచబ్యాంక్, ఐక్యరాజ్య సమితి సైతం ఉక్రెయిన్ కోసం పెద్ద ఎత్తున నిధులను మంజూరు చేశాయి.

 నిధుల సమీకరణ కోసం మాస్టర్‌ప్లాన్

నిధుల సమీకరణ కోసం మాస్టర్‌ప్లాన్

నిధులను సమీకరించుకోవడంలో భాగంగా ఉక్రెయిన్ మాస్టర్‌ప్లాన్ వేసింది. క్రౌడ్ ఫండింగ్‌పై దృష్టి సారించింది. ఫండ్ రైజింగ్ చేస్తోంది. ఇప్పటికే 65 మిలియన్ డాలర్లను సమీకరించింది. మరిన్ని నిధులను సేకరిస్తోంది. నిధులను సమీకరించుకోవడానికి ఉక్రెయిన్.. ప్రత్యేకంగా మెటా హిస్టరీ మ్యూజియం ఆఫ్ వార్‌ను ప్రారంభించింది. సింపుల్‌గా దీన్ని ఓ డిజిటల్ మ్యూజియంగా చెప్పుకోవచ్చు. ప్రపంచవ్యాప్తంగా విరాళాలను సేకరించడానికి దీన్ని ఆరంభించింది

 ఎన్ఎఫ్టీ, క్రిప్టో రూపంలో..

ఎన్ఎఫ్టీ, క్రిప్టో రూపంలో..

ఈ మధ్యకాలంలో బాగా ప్రజాదరణ పొందిన ప్లాట్‌ఫామ్ నాన్ ఫంజిబుల్ టోకెన్స్. క్లుప్తంగా ఎన్‌ఎఫ్టీ. ఈ విధానం ద్వారా ఉక్రెయిన్ ప్రభుత్వం నిధులను సేకరిస్తోంది. క్రిప్టోకరెన్సీ ద్వారా ఈ టోకెన్లను కొనుగోలు చేసి, యుద్ధానికి సంబంధించిన డిజిటల్ ఇమేజెస్‌ను ఈ మ్యూజియంలో తిలకించవచ్చు. నేలకూలిన యుద్ధ విమానాలు, ధ్వంసమైన అపార్ట్‌మెంట్లు, పౌరులు పడే ఇబ్బందులు.. ఇలాంటివన్నింటినీ ఈ డిజిటల మ్యూజియంలో అందుబాటులో పెట్టింది ఉక్రెయిన్. వాటిని తిలకించాలంటే ఈ టోకెన్లను తీసుకోవాల్సి ఉంటుంది.

English summary

ఉక్రెయిన్ బిగ్ ప్లాన్: మ్యూజియం ఆఫ్ వార్: విరాళాల సునామీ: ఎన్‌ఎఫ్టీ, క్రిప్టో రూపంలో | Ukraine started auctioning off a collection of NFTs of a cryptocurrency fundraising, collected $65 million

Ukraine started auctioning off a collection of non-fungible tokens (NFTs), in an expansion of a cryptocurrency fundraising push that Kyiv says has already collected more than $65 million for its war effort
Story first published: Saturday, March 26, 2022, 14:26 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X