టాప్ 10 కంపెనీల్లోని ఆరు కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ భారీగా ఎగిసింది. ఈ కంపెనీల ఎం-క్యాప్ గతవారం రూ.60,198.67 కోట్లు పెరిగింది. టెక్ దిగ్గజాలు ఇన్ఫోసిస్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(TCS) భారీ రిటర్న్స్ ఇచ్చాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్, హిందూస్తాన్ యూనీలీవర్ లిమిటెడ్, కొటక్ మహీంద్రా బ్యాంకు, భారతీ ఎయిర్ టెల్ సంస్థల ఎం-క్యాప్ కూడా పెరిగింది. అదే సమయంలో HDFC బ్యాంకు, HDFC, ICICI బ్యాంకు, బజాజ్ ఫైనాన్స్ కంపెనీల మార్కెట్ క్యాప్ తగ్గింది.

మార్కెట్ క్యాప్ జంప్
ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.19,849.41 కోట్లు పెరిగి రూ.5,26,627.07 కోట్లకు చేరుకుంది.
టీసీఎస్ ఎం-క్యాప్ రూ.17,204.68 కోట్లు పెరిగి రూ.10,91,362.33 కోట్లకు చేరింది.
హెచ్‌యూఎల్ మార్కెట్ క్యాప్ రూ.16,035.72 కోట్లు ఎగిసి రూ.5,63,881.75 కోట్లుగా నమోదయింది.
భారతీ ఎయిర్టెల్ మార్కెట్ క్యాప్ రూ.3,518.83 కోట్లు పెరిగి రూ.2,82,079.59 కోట్లకు చేరింది.
కొటక్ మహీంద్రా బ్యాంకు ఎం-క్యాప్ రూ.2,544.02 కోట్లు ఎగిసి రూ.3,88,414.04 కోట్లకు చేరింది.
రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎంక్యాప్ రూ.1,046.01 కోట్లు పెరిగి రూ.12,64,021.09 కోట్లకు చేరుకుంది.

ఈ సంస్థల ఎం-క్యాప్ డౌన్
HDFC బ్యాంకు మార్కెట్ క్యాపిటలైజషన్ రూ.7,755 కోట్లు క్షీణించి రూ.7,69,364.60 కోట్లకు చేరింది.
HDFC మార్కెట్ క్యాప్ రూ.4,445.63 కోట్లు తగ్గి రూ.4,41,728.42 కోట్లకు పెరిగింది.
బజాజ్ ఫైనాన్స్ ఎం-క్యాప్ రూ.4,121.69 కోట్లు క్షీణించి రూ.3,12,360.19 కోట్లుగా నమోదయింది.
ఐసీఐసీఐ బ్యాంకు మార్కెట్ క్యాప్ రూ.2,263.57 కోట్లు తగ్గి రూ.3,54,590.10 కోట్లకు చేరుకుంది.

టాప్ 10 కంపెనీలు వరుసగా...
టాప్ టెన్ కంపెనీలు వరుసగా రిలయన్స్, TCS, HDFC బ్యాంకు, HUL, ఇన్ఫోసిస్, HDFC, కొటక్ మహీంద్రా బ్యాంకు, ICICI బ్యాంకు, బజాజ్ ఫైనాన్స్, భారతీ ఎయిర్ టెల్ ఉన్నాయి. గత వారం బీఎస్ఈ సెన్సెక్స్ 12.85 శాతం లేదా 0.02 శాతం ఎగిసింది. శుక్రవారం మార్కెట్‌కు సెలవు రోజు. మొత్తం నాలుగు రోజులు మార్కెట్లు నడిచాయి.
More From GoodReturns

వెండి ధరలు బిగ్ క్రాష్.. దెబ్బకు నిలిచిపోయిన ట్రేడింగ్.. లబోదిబోమంటున్న పెట్టుబడిదారులు

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..



Click it and Unblock the Notifications