గణనీయమైన బంగారం నిల్వల నిర్వహణలో కేంద్ర బ్యాంకులు కీలకపాత్ర పోషిస్తాయి. ఒక దేశం బంగారం నిల్వలు ఆ దేశ కరెన్సీ వ్యాల్యూ పైన ప్రభావం చూపుతుంది. బంగారం నిల్వలకు పలు దేశాల కేంద్ర బ్యాంకులు అధిక ప్రాధాన్యత ఇస్తాయి. ద్రవ్యోల్భణం పెరిగినప్పుడు ప్రభుత్వాలు పెద్ద మొత్తంలో బంగారాన్ని కౌంటర్‌మెజర్‌లో భాగంగా కొనుగోలు చేస్తాయి. ఫిబ్రవరిలో లభించిన డేటా ప్రకారం ఆ నెలలో నికర కొనుగోళ్లను కేంద్ర బ్యాంకులు పెంచడం ప్రారంభించాయి. ప్రపంచ గోల్డ్ రిజర్వ్స్ 8.8 టన్నులు పెరిగాయి.

బంగారం అమ్మకాలు..
వివిధ దేశాలు బంగారం నిల్వలు పెరుగుతున్నాయి. భారత్ (11.2 ట్రిలియన్ టన్నులు), ఉజ్బెకిస్తాన్ (7.2 ట్రిలియన్ టన్నులు), కజకిస్తాన్ (1.6 ట్రిలియన్ డన్నులు), కొలంబియా (0.5 ట్రిలియన్ టన్నులు) పెంచుకున్నాయి. అంటే ఈ దేశాలు బంగారాన్ని పెద్ద మొత్తంలో కొనుగోలు చేయగా, అదే సమయంలో టర్కీ మాత్రం 11.7 ట్రిలియన్ టన్నులు విక్రయించింది. దీంతో ఈ దేశంలో నిల్వలు తగ్గాయి. గ్లోబల్ సెంట్రల్ బ్యాంకు నికర అమ్మకాలు 16.7 ట్రిలియన్ డాలర్ల వద్ద ఉన్నాయి. ఇది దశాబ్ద కాలంలో కనిష్టం.

అమెరికా టాప్
గోల్డ్ రిజర్వ్‌లో 8,133.5 టన్నులతో అమెరికా మొదటి స్థానంలో ఉంది.
రెండో స్థానంలో జర్మనీ ఉంది. ఈ దేశంలో 3,362.4 టన్నులు ఉంది. బ్యాంక్ డి-ఫ్రాన్స్, ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ న్యూయార్క్ నుండి 674 టన్నుల బంగారాన్ని తన సొంత వాల్ట్స్‌కు తిరిగి రప్పించే ఆపరేషన్‌ను 2017లో ప్రారంభించింది. ఇప్పుడు దానిని పూర్తి చేసింది.
ఇటలీలో బంగారం నిల్వలు 2,451.8 టన్నులుగా ఉంది. ఇందులో ప్రధానంగా బార్స్(95,493) ఉన్నాయి.

చైనాలో ఎంతంటే
ఫ్రాన్స్ సెంట్రల్ బ్యాంకు వద్ద రూ.2,436.0 టన్నులు, రష్యా సెంట్రల్ బ్యాంకు వద్ద రూ.2,299.9 టన్నులుగా ఉంది. బంగారం నిల్వల్లో చైనా 2018లో ఐదో స్థానానికి వచ్చింది. 2017లో రష్యా 224 టన్నుల బంగారం కొనుగోలు చేసింది. చైనాలో బంగారం నిల్వలు 1,948.3 టన్నులుగా ఉంది. ఇప్పుడు చైనా బంగారం నిల్వల్లో 6వ స్థానంలో ఉంది. స్విట్జర్లాండ్ బంగారం నిల్వలు 1,040 టన్నులుగా ఉంది. జపాన్ గోల్డ్ నిల్వలు 765.2 టన్నులు, ఇండియా వద్ద 657.7 టన్నులు, నెదర్లాండ్స్ వద్ద 612.5 టన్నులుగా ఉంది.
More From GoodReturns

బంగారం ధరలు పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎంతకు చేరిందంటే.. మార్చి 31, మంగళవారం ధరలు ఇవే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

భారీగా పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు పెరుగుదలతో ఎంతకు చేరిందంటే.. మార్చి 25, బుధవారం ధరలు ఇవే..

10 వేల డాలర్లకు బంగారం ధర.. షాకింగ్ అంచనాలను విడుదల చేసిన యార్డెని రీసెర్చ్..

బంగారం, వెండి ధరలు ఈ వారం ఎలా ఉండబోతున్నాయి..వరుస సెలవులు కాపాడుతాయా..కొంపలు ముంచుతాయా..

Today Gold Silver Rate Live: బంగారం ధరలు భారీగా పతనం.. పెట్టుబడిదారుల్లో తీవ్ర ఆందోళన.. సామాన్యులకు ఊరట

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు, కారణం ఏంటంటే..



Click it and Unblock the Notifications