For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కేంద్రం పెద్దనిర్ణయం!: ఈపీఎఫ్ఓ కొత్త రూల్, 50లక్షలమందికి ప్రయోజనం

|

ఉద్యోగులకు అదనపు ప్రయోజనాలు తీసుకువచ్చేందుకు కొన్ని నిబంధనలను మార్చే అవకాశాలను ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) పరిశీలిస్తోంది. ఎక్కువమంది ఉద్యోగులకు సామాజిక భద్రత కల్పించాలనే లక్ష్యంతో ఈపీఎఫ్ఓ శుభవార్త అందించనుందని తెలుస్తోంది. ఈపీఎఫ్ఓ ద్వారా 6 కోట్ల మంది ఉద్యోగులు ప్రయోజనాలు పొందుతున్నారు. అదనంగా 50 లక్షల మందికి సామాజిక భద్రత కల్పించాలని ఈఫీఎఫ్ఓ భావిస్తోంది. ఈ ఉద్యోగులకు ఇప్పటివరకు పీఎఫ్ కట్ ఉండదు. వారికి కూడా జనవరి 1 నుంచి పీఎఫ్ కావొచ్చు.

ఉద్యోగులు సొంతగా UAN నెంబర్ తీసుకోవచ్చు, పెన్షనర్లకూ గుడ్‌న్యూస్ఉద్యోగులు సొంతగా UAN నెంబర్ తీసుకోవచ్చు, పెన్షనర్లకూ గుడ్‌న్యూస్

వీరికీ సోషల్ సెక్యూరిటీ

వీరికీ సోషల్ సెక్యూరిటీ

ప్రస్తుత EPF నిబంధనల ప్రకారం 20 మంది లేదా అంతకంటే ఎక్కువ ఉద్యోగులు ఉన్న కంపెనీలకు ప్రావిడెంట్ ఫండ్ నిబంధనలు వర్తిస్తాయి. ఈపీఎఫ్ యాక్ట్ కింద అలాంటి సంస్థలకు ఈపీఎఫ్ మెంబర్‌షిప్ ఇస్తారు. కేంద్ర ప్రభుత్వం దీనిని 10 మంది ఉద్యోగులకు తగ్గిస్తోందని వార్తలు వస్తున్నాయి. వీరికి కూడా సోషల్ సెక్యూరిటీ ఉండాలని భావిస్తోంది. దీంతో 10 మంది అంతకంటే ఎక్కువ ఉద్యోగులు కలిగిన కంపెనీ కూడా ఈపీఎఫ్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు.

త్వరలో అమల్లోకి...!

త్వరలో అమల్లోకి...!

10 మంది లేదా అంతకంటే ఎక్కువ ఉద్యోగులు కలిగిన సంస్థలు EPF పరిధిలోని ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్, ఇతర నిబంధనల చట్టం కింద తాము నమోదు చేసుకోవాలి. ప్రస్తుతం మాత్రం 20 మంది అంతకంటే ఎక్కువమంది ఉద్యోగులు ఉన్న కంపెనీలు మాత్రమే ఈ పరిధిలోకి వస్తాయి.

జనవరి నుంచి అమలు..

జనవరి నుంచి అమలు..

2008 జూలైలోనే 183వ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సమావేశంలో ఈ ప్రతిపాదనకు అప్రూవల్ వచ్చింది. దీనిని అమలు చేయాల్సి ఉంది. తాజాగా, కేంద్ర కార్మిక శాఖకు కొత్త రూల్ అమలుకు ఆమోదం లభించినట్లుగా తెలుస్తోంది. కాగా, ఈ అంశానికి సంబంధించి కార్మిక శాఖ నోటిఫికేషన్ ఇచ్చిందని, దీనికి పార్లమెంటు అప్రూవల్ అవసరం లేదని అంటున్నారు. వీటిని జనవరి 1, 2020 నుంచి అమలు చేయవచ్చు.

English summary

కేంద్రం పెద్దనిర్ణయం!: ఈపీఎఫ్ఓ కొత్త రూల్, 50లక్షలమందికి ప్రయోజనం | This EPFO rule to be changed, 50 lakh more employees to benefit

To bring added benefits to employees, certain regulations of the Employees' Provident Fund Organisation (EPFO) are going to be changed soon.
Story first published: Wednesday, November 6, 2019, 16:32 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X