For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Personal Loan: పర్సనల్ లోన్స్ విషయంలో అనుమానాల గందరగోళమా..? ఈ వాస్తవాలు తెలుసుకుని లాభపడండి..

|

Personal Loan: పర్సనల్ లోన్ అనేది అసురక్షిత రుణం. దీనిని ఏ అవసరం కోసమైనా సదరు వ్యక్తులు వినియోగించుకోవచ్చు. లోన్ సొమ్మును ఇంటి రెనోవేషన్ నుంచి అప్పులు కట్టడం వరకు ఇలా ఏ అవసరానికైనా వినియోగించుకోవచ్చు. పర్సనల్ లోన్ అనేది ఒక ప్రముఖ ఆర్థిక ఉత్పత్తి అయినప్పటికీ.. దానికి సంబంధించిన విషయంలో చాలా మందికి అనేక అపోహలు ఉంటాయి. ఈ రుణాలను అనేక మంది అప్పుల ఉచ్చులుగా చూస్తుంటారు. లోన్ విషయంలో సహజంగా చాలా మంది మెదడులో ఇవి పాతుకుపోయాయి. చాలా మంది అసలు నిజాలను క్రాస్ చెక్ చేసుకోకుండానే నమ్ముతుంటారు. పర్సనల్ లోన్‌ల విషయంలో ఎక్కువ మందిలో ఉండే కొన్ని అపోహల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. అవి ఎంత వరకు నిజమో పరిశీలిద్దాం..

1. చాలా మంది అనుకునే అపోహల్లో మెుదటికి ఏంటంటే.. కేవలం బ్యాంకులు మాత్రమే పర్సనల్ లోన్స్ అందిస్తాయని అనుకోవటం. దేశంలో కేవలం ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లోని బ్యాంకులు మాత్రమే కాదు మరికొన్ని సంస్థలు సైతం పర్సనల్ లోన్స్ అందిస్తున్నాయి. ముందుగా ఫిన్ టెక్ కంపెనీలు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలతో పాటు ఇతర సంస్థలు లోన్స్ అందిస్తుంటాయి. ఇవి కూడా అనుకూలమైన, సరసమైన వడ్డీ రేట్లకే రుణాలను అందిస్తుంటాయి.

know about facts about personal loan myths taht people have in common that are not true

2. లోన్ తీసుకునే వారందరికీ ఒకే వడ్డీ రేటు వర్తిస్తుందని అనుకోవటం పొరపాటు. ఎందుకంటే.. వేరు వేరు ఫైనాన్స్ కంపెనీలు.. తమ వద్ద రుణాలు తీసుకునే వారికి వివిధ వడ్డీ రేట్లను అందిస్తుంటాయి. సదరు వ్యక్తి క్రెడిట్ హిస్టరీ, సిబిల్, క్రెడిట్ స్కోర్ వంటి వాటి ఆధారంగా వడ్డీ రేట్లను మారుస్తుంటాయి. సదరు వ్యక్తి ప్రొఫైల్ క్రెడిట్ బాగుంటే.. వారికి తక్కువ వడ్డీకే లోన్ ఇస్తుంటాయి. మీరు తక్కువ-వడ్డీ రేటుతో పర్సనల్ లోన్ పొందాలనుకుంటే.., మీరు మీ క్రెడిట్ స్కోర్‌ను మెరుగుపరుచుకోవాల్సిందే.

3. తక్కువ క్రెడిట్ స్కోర్ ఉంచడే వారికి లోన్స్ రావు లేదా వారి లోన్ అప్లికేషన్ రిజెక్ట్ అవుతుంది అనుకోవటం సరైనది కాదు. పర్సనల్ లోన్ అర్హతను నిర్ణయించేటప్పుడు క్రెడిట్ స్కోర్ పరిగణించబడే ముఖ్యమైన అంశం అయినప్పటికీ.. ఇది మీకు ఇవ్వాలా వద్దా అని నిర్ణయించటానికి ఉండే ఏకైక అంశం మాత్రమే కాదని గుర్తించాలి. 750 లేదా అంత కంటే ఎక్కువ సిబిల్ స్కోర్ ఉంటే అది మంచి క్రెడిట్ స్కోర్ గా పరిగణిస్తారు. ఒక్కోసారి మీ క్రెడిట్ స్కోర్ తక్కువగా ఉన్నప్పుడు మీరు పనిచేసే కంపెనీ, మీ ఆదాయం లాంటి ఇతర అంశాల ఆదారంగా లోన్ జారీ చేయబడుతుంది. మంచి క్రెడిట్ స్కోర్ లేనప్పుడు ఎక్కువ వడ్డీ రేటుకు లోన్ ఇవ్వటం జరుగుతుంది.

know about facts about personal loan myths taht people have in common that are not true

4. అత్యవసర పరిస్థితుల్లో వ్యక్తిగత రుణాలు సహాయం చేయవని చాలా మంది అనుకుంటూ ఉంటారు. ఆర్థిక అత్యవసర పరిస్థితి అనేది ఊహించని ఖర్చులను కలిగి ఉంటుంది. అలాంటి సమయంలో వెంటనే డబ్బు అవసరం ఉంటుంది. ఎక్కువ సమయం కూడా కొన్ని సార్లు ఉండదు. అలాంటి సమయంలో పర్సనల్ లోన్స్ ఉపయోగపడుతుంటాయి. ఎందుకంటే ఇవి అన్ సెక్యూర్డ్ లోన్స్. కాబట్టి వీటి ఆమోదానికి, ప్రాసెసింగ్ కు చాలా తక్కువ సమయం పడుతుంటుంది. ఈ రోజుల్లో చాలా కంపెనీలు 24 గంటలకంటే తక్కువ సమయంలోనే లోన్ అందిస్తున్నాయి. కాబట్టి అత్యవసర అవసరాల సమయంలో ఇవి మిమ్మల్ని ఆదుకుంటాయి.

5. పర్సనల్ లోన్స్ ఎలాంటి టాక్స్ ప్రయోజనాలను అందించవు అనేది తప్పుడు ఆలోచన. మీరు పర్సనల్ లోన్‌లను ఏ అవసరానికైనా ఉపయోగించవచ్చు. అయినప్పటికీ.. కొన్ని నిర్దిష్ట పరిస్థితులలో మాత్రమే టాక్స్ ప్రయోజనాలు పొందటానికి వీలు ఉంటుంది. మీరు వ్యాపారంలో పెట్టుబడి పెట్టడానికి, ఆస్తిని కొనుగోలు చేయడానికి లేదా ఇంటిని నిర్మించడానికి వ్యక్తిగత రుణాన్ని ఉపయోగించినప్పుడు.., మీరు టాక్స్ మినహాయింపులను పొందటానికి వీలు ఉంటుంది.

know about facts about personal loan myths taht people have in common that are not true

6. కేవలం శాలరీ ఇన్కమ్ ఉండేవారికి మాత్రమే.. పర్సనల్ లోన్ లభిస్తుంది అనుకోవటం చాలా తప్పు. స్వయం ఉపాధి కలిగిన సీఏలు, డాక్టర్లు వంటి వృత్తి నిపుణులు సైతం లోన్స్ కోసం ఫైనాన్స్ కంపెనీలను సంప్రదించవచ్చు. వారికి లోన్ ఇవ్వాలా వద్దా అన్న విషయం సదరు వ్యక్తుల క్రెడిట్ స్కోర్, ప్రతి సంవత్సరం దాఖలు చేస్తున్న ఆదాయ పన్ను రిటర్న్స్ పై ఆధారపడి ఉంటుంది.

7. పర్సనల్ లోన్ చెల్లించటం కస్టమవుతుందిని చాలా మందిలో అనుమానం ఉంటుంది. ఇలాంటి అపోహలను దూరం చేసుకోవాలంటే మీరు లోన్ తీసుకోవటానికి ముందే ఎంత EMI చెల్లించాల్సి ఉంటుంది అనే దానిని లెక్కించేందుకు చేయడానికి EMI కాలిక్యులేటర్‌ని ఉపయోగించవచ్చు. మీరు మీ ఆర్థిక సామర్థ్యాన్ని బట్టి మీ EMIలను ఎంచుకోవచ్చు.

know about facts about personal loan myths taht people have in common that are not true

8. చాలా మంది లోన్ కోసం అనేక కంపెనీల వద్ద దరఖాస్తులు చేసుకుంటుంటారు. ఇలా చేయటం వల్ల త్వరగా లోన్ వస్తుందని అపోహపడుతుంటారు. అనేక సంస్థల వద్ద లోన్ కోసం ఏక కాలంలో ప్రయత్నించటం వల్ల రుణం వచ్చే అవకాశం నాశనం అవుతుంది. తక్కువ వ్యవధిలో చాలా లోన్ ఎంక్వైరీలు చేయటం వల్ల మీ క్రెడిట్ స్కోర్‌ దెబ్బతింటుంది. తద్వారా మీరు పర్సనల్ లోన్ ఆమోదం పొందడం కష్టతరం అవుతుంది.

9. పర్సనల్ లోన్ ఆమోదానికి చాలా రోజులు పడుతుందని అనుకోవటం పెద్ద పొరపాటు. ఎందుకంటే వాస్తవానికి దీని ప్రాసెసింగ్ కు 24 గంటల నుంచి రెండు రోజులు సరిపోతుంది. చాలా సందర్భాల్లో 24 గంటల్లోనే లోన్ అందుతుంది. లోన్ ఇచ్చేందుకు అవసరమైన అర్హతలు మీకు ఉన్నట్లయితే వేగంగా లోన్ కావాలనుకున్నప్పుడు వ్యక్తిగత రుణాలు సరిగ్గా ఉపయోగపడతాయి. కాబట్టి పర్సనల్ లోన్ కావాటనుకునేవారు ఇలాంటి అపోహలను పక్కన పెట్టి సరైన పద్ధతిలో ఈజీగా ఇప్పుడు లోన్ పొందవచ్చు.

English summary

Personal Loan: పర్సనల్ లోన్స్ విషయంలో అనుమానాల గందరగోళమా..? ఈ వాస్తవాలు తెలుసుకుని లాభపడండి.. | these are the Personal Loan Myths and the Truths that every one Should Know

know about facts about personal loan myths taht people have in common that are not true
Story first published: Friday, June 17, 2022, 7:36 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X