For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

టర్మ్ ఇన్సురెన్స్ ప్రీమియం మరింత భారం కావొచ్చు

|

టర్మ్ ఇన్సురెన్స్ పాలసీ తీసుకునే వారికి ఓ బ్యాడ్ న్యూస్. ప్రీమియం మొత్తాన్ని మరింత పెంచేందుకు ఇన్సురెన్స్ కంపెనీలు సిద్ధమయ్యాయి. కరోనా కారణంగా ఇప్పటికే 25 శాతం వరకు ప్రీమియం పెరిగింది. ఇప్పుడు కరోనాతో సంబంధం లేకుండా మరోసారి పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇన్సురెన్స్ రెగ్యులేటర్ IRDAI అనుమతించిన వెంటనే పెంపును అమలు చేసే అవకాశాలు ఉన్నాయి.

ప్రస్తుతం అభివృద్ధి చెందుతున్న దేశాల్లో లభిస్తున్న టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీల ప్రీమియం కంటే మనదేశంలో చాలా తక్కువగా ఉందని, ఇది ఆమోదయోగ్యం కాకపోవడంతో పెంపు తథ్యమని చెబుతున్నారు. గత పదేళ్లుగా తక్కువకే టర్మ్ పాలసీలను విక్రయిస్తున్నట్లు చెబుతున్నారు. 2010లో ఉన్న పాలసీ ప్రీమియంలతో పోలిస్తే ప్రస్తుతం నాలుగు నుండి ఐదు రెట్లు పెరిగాయి.

Term Insurance Premiums Could Rise Further

కాగా, ఇమ్యూనిటీ డేటాను బట్టి, IRDAI ఆమోదానికి లోబడి భౌగోళిక ఆధారంగా వివిధ ప్రీమియం ధరలు కూడా ఉండవచ్చునని ఈ రంగంలోని నిపుణులు అంటున్నారు. టర్మ్ ఇన్సురెన్స్ అనేది ఓ రకమైన జీవిత బీమా పాలసీ. ఇది పాలసీదారు మరణానంతరం కుటుంబానికి, నామినీకి ఆర్థిక కవరేజీని అందిస్తుది. పాలసీదారు మరణిస్తే ఆర్థిక రక్షణ అందిస్తుంది. రైడర్స్ సాయంతో టర్మ్ ఇన్సురెన్స్ కింద వ్యాధులు, వైకల్యానికి సమగ్ర కవరేజీ పొందవచ్చు.

English summary

టర్మ్ ఇన్సురెన్స్ ప్రీమియం మరింత భారం కావొచ్చు | Term Insurance Premiums Could Rise Further

Depending on the data relating to immunity, there could be a case for differential premium pricing based on geographies, subject to IRDAI approvals.
Story first published: Monday, December 7, 2020, 18:59 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X