For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

టాటా గ్రూప్ చేతికి బిగ్ బాస్కెట్! 80 శాతం వాటా కొనుగోలు చేసే ఛాన్స్

|

ప్రముఖ ఆన్‌లైన్ గ్రోసరీ సంస్థ బిగ్ బాస్కెట్‌లో దాదాపు 80 శాతం వాటాను కొనుగోలు చేసేందుకు టాటా గ్రూప్ సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. అలీబాబా గ్రూప్ లిమిటెడ్‌కు వాటాలు ఉన్న బిగ్ బాస్కెట్‌లో మెజార్టీ వాటా కొనుగోలుగా దాదాపు 1.3 బిలియన్ డాలర్లను వెచ్చించేందుకు టాటా గ్రూప్ సిద్ధమైందని తెలుస్తోంది. ఈ మేరకు చర్చలు జరుగుతున్నాయని చెబుతున్నారు. దీనిపై టాటా గ్రూప్, బిగ్ బాస్కెట్ స్పందించాల్సి ఉంది. దేశంలోని ఆన్‌లైన్ గ్రాసరీ మార్కెట్ రోజురోజుకు విస్తరిస్తోంది. కరోనా కారణంగా ఆన్‌లైన్ మార్కెట్‌కు ఆదరణ పెరిగింది.

ఉద్యోగులకు ఈ కంపెనీల గుడ్‌న్యూస్, వేతనాల పెంపు..ఉద్యోగులకు ఈ కంపెనీల గుడ్‌న్యూస్, వేతనాల పెంపు..

అందుకే టాటా గ్రూప్ ఆసక్తి

అందుకే టాటా గ్రూప్ ఆసక్తి

కరోనా నేపథ్యంలో అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ఈ కామర్స్ సంస్థలు మార్కెట్లో దూసుకెళ్తున్నాయి. ఆన్ లైన్ గ్రాసరీ విభాగంలో పట్టు కోసం ప్రయత్నాలు చేస్తున్నాయి. రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ కూడా జియో మార్ట్ పేరిట ఆన్ లైన్ విభాగంలోకి అడుగు పెట్టింది. వీరికి పోటీ ఇచ్చేలా టాట్ గ్రూప్ ఇప్పటికే ఈ రంగంలో ఉన్న బిగ్ బాస్కెట్ వైపు మొగ్గు చూపినట్లుగా కనిపిస్తోంది.

బిగ్ బాస్కెట్ వ్యాల్యూ

బిగ్ బాస్కెట్ వ్యాల్యూ

బిగ్ బాస్కెట్‌లో 80 శాతం వాటాను 1.3 బిలియన్ డాలర్ల(సుమారు రూ.9,600 కోట్లు)కు టాటా గ్రూప్ సొంతం చేసుకునే అవకాశాలు ఉన్నాయి. తద్వారా బిగ్ బాస్కెట్ వ్యాల్యూను 1.6 బిలియన్ డాలర్లు (సుమారు రూ.11,850 కోట్లు)గా మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఒప్పందంలో భాగంగా బిగ్ బాస్కెట్లో ఇప్పటికే వాటా కలిగిన ఇన్వెస్టర్ల నుండి టాటా గ్రూప్ 50 శాతం నుండి 60 శాతం వాటాను కొనుగోలు చేసే అవకాశముంది. బిగ్ బాస్కెట్‌లో అలీబాబా గ్రూప్ 26 శాతం వాటాను కలిగి ఉంది.

సూపర్ యాప్‌లో భాగం

సూపర్ యాప్‌లో భాగం

టాటా గ్రూప్.. తమ గ్రూప్‌లోని కన్స్యూమర్ బిజినెస్‌లు అన్నింటిని కలిపి సూపర్ యాప్‌ను రూపొందిస్తున్న విషయం తెలిసిందే. ఈ డిల్ ద్వారా బిగ్ బాస్కెట్‌ను సూపర్ యాప్‌లో భాగం చేసే యోచనలో ఉందని తెలుస్తోంది. హౌస్ హోల్డ్, గ్రాసరీ విభాగంలో పలు ప్రోడక్టులను అందించేందుకు వీలుంటుందని తెలిపారు. టాటా సన్స్ వార్షిక సమావేశంలో భాగంగా గత ఏడాది సూపర్ యాప్‌ను తీసుకు వస్తున్నట్లు చైర్మన్ చంద్రశేఖరన్ తెలిపారు.

English summary

టాటా గ్రూప్ చేతికి బిగ్ బాస్కెట్! 80 శాతం వాటా కొనుగోలు చేసే ఛాన్స్ | Tata Group closes in on deal to buy 80 percent stake in online grocer BigBasket

The Tata Group has entered advanced talks to buy as much as 80 per cent stake of Alibaba-backed online grocer BigBasket for $1.3 billion. If the deal succeeds, the local online grocer will see its value soar to $1.6 billion.
Story first published: Thursday, December 3, 2020, 19:58 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X