For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

టీవీ ఛానల్స్ ధర తగ్గుదల ఎఫెక్ట్: నష్టాల్లో సన్ టీవీ, జీ షేర్లు

|

ముంబై: టెలికం అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) టీవీ ఛానళ్ల రేట్లకు సంబంధించి కొత్త సవరణలను తీసుకు వస్తోన్న విషయం తెలిసిందే. ట్రాయ్ నిబంధనలు టీవీ వినియోగదారులకు ప్రయోజనకరంగా ఉన్నాయి. రూ.153కు 100 ఛానల్స్ బదులు 200 ఛానల్స్ అందించడంతో పాటు అందుబాటులోని అన్ని ఛానల్స్‌ను రూ.160కి అందించాలని ఆపరేటర్లను ఆదేశిస్తోంది. ఈ నేపథ్యంలో సన్ టీవీ, జీ ఎంటర్టైన్మెంట్ షేర్లు గురువారం (జనవరి 2) నష్టాల్లో ట్రేడ్ అయ్యాయి. ఈ షేర్లు 2 శాతం నుంచి 4 శాతం మేర నష్టపోయాయి.

న్యూఇయర్ గిఫ్ట్!: తక్కువ ధరకే మరిన్ని టీవీ ఛానల్స్, రూ.153కే 200 ఛానల్స్, రూ.160 చెల్లిస్తే...న్యూఇయర్ గిఫ్ట్!: తక్కువ ధరకే మరిన్ని టీవీ ఛానల్స్, రూ.153కే 200 ఛానల్స్, రూ.160 చెల్లిస్తే...

సన్ టీవీ షేర్ ధరలు మధ్యాహ్నం సమయానికి రూ.18.20 శాతం లేదా 4.14 శాతం పడిపోయాయి. ఈ షేర్లు రూ.430 నుంచి రూ.412కు పడిపోయాయి. ఇక జీ ఎంటర్టైన్మెంట్ షేర్లు 2 శాతం తగ్గాయి. మధ్యాహ్నం గం.1.30 సమయానికి రూ.5.85 (1.33%) తగ్గి 433.70, జీ ఎంటర్ట్నైమెంట్ షేర్ మాత్రం కాస్త కోలుకుంది.

Sun TV, Zee Ent fall 2 to 4% after TRAI sets new rules on tariff framework

ఇదిలా ఉండగా, స్టాక్ మార్కెట్లు గురువారం ఉదటం లాభాల్లో ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. ఉదయం గం.8.45కు సెన్సెక్స్ 118 పాయింట్ల లాభంతో, నిఫ్టీ 35 పాయింట్ల లాభంతో ట్రేడ్ అయింది. మధ్యాహ్నం గం.1.34 సమయానికి సెన్సెక్స్ 258.62 (0.63%) పాయింట్లు ఎగిసి 41,564.64కు, నిఫ్టీ 80.55 (0.66%) పాయింట్లు పెరిగి 12,263.05 వద్ద ట్రేడ్ అయింది.

English summary

టీవీ ఛానల్స్ ధర తగ్గుదల ఎఫెక్ట్: నష్టాల్లో సన్ టీవీ, జీ షేర్లు | Sun TV, Zee Ent fall 2 to 4% after TRAI sets new rules on tariff framework

Telecom Regulatory Authority of India (TRAI) has set RS 160 price ceiling for all channels available on a distributor’s platform as it aims to reduce rising costs for subscribers.
Story first published: Thursday, January 2, 2020, 14:02 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X