For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

IPO News: మార్కెట్లోకి మద్యం కంపెనీ ఐపీవో.. సెబీ గ్రీన్ సిగ్నల్.. గెట్ రెడీ బాయ్స్..

|

IPO News: ఈ నెల వరుసగా ఐపీవోలో మార్కెట్లోకి క్యూ కడుతున్నాయి. తాజాగా మరో ఐపీవోకు సెబీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం ఇన్వెస్టర్లలో జోష్ నింపుతోంది. అయితే ఈ సారి వస్తున్నది మద్యం తయారు చేసే కంపెనీ. దీనికి సంబంధించిన వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

దేశంలోని ప్రముఖ వైన్ తయారీ, విక్రయదారు.. సులా వైన్యార్డ్స్ IPOకు SEBI నుంచి అనుమతి లభించింది. ఈ ఏడాది జూలైలో పబ్లిక్ ఇష్యూ కోసం కంపెనీ DRHP దాఖలు చేసింది. అయితే ఈ బ్రూయింగ్ కంపెనీకి తాజాగా మార్కెట్ రెగ్యులేటర్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా అనుమతి లభించింది.

 Sula Vineyard Company IPO got clerance From SEBI Know Details

ఈ IPO పూర్తిగా ఆఫర్ ఆఫ్ సేల్ మార్గంలో మార్కెట్లోకి వస్తోంది. ఇందులో ప్రమోటర్లు, ఇన్వెస్టర్లు, ఇతర వాటాదారులకు చెందిన 25,546,186 ఈక్విటీ షేర్లను ఆఫర్ ద్వారా ఇన్వెస్టర్లకు విక్రయించనున్నారు. సులా వైన్యార్డ్స్ ఎరుపు, తెలుపు, మెరిసే వైన్‌లను విక్రయిస్తుంది. కంపెనీ మెుత్తం 13 బ్రాండ్ల కింద 56 రకాల మద్యాన్ని తయారు చేస్తోంది.

గత ఏడాది సులా వైన్యార్డ్స్ కంపెనీ 14.5 మిలియన్ లీటర్ల తయారీ సామర్థ్యాన్ని కలిగి ఉందని వెల్లడించింది. FY21లో కేవలం రూ.3.01 కోట్లుగా ఉన్న కంపెనీ లాభం FY22లో రూ.52.14 కోట్లకు చేరుకుంది. ఈ కాలంలో కంపెనీ ఆదాయం 8.60% పెరిగి రూ.453.92 కోట్లకు చేరుకుంది.

Read more about: sula vineyard wine maker ipo sebi
English summary

IPO News: మార్కెట్లోకి మద్యం కంపెనీ ఐపీవో.. సెబీ గ్రీన్ సిగ్నల్.. గెట్ రెడీ బాయ్స్.. | Sula Vineyard Company IPO got clerance From SEBI Know Details

Sula Vineyard Company IPO got clerance From SEBI Know Details
Story first published: Tuesday, November 8, 2022, 11:43 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X