Success Story: కేవలం వేల రూపాయలతో వ్యాపారాన్ని ప్రారంభించి కోట్లను ఆర్జించటం అనేది ప్రస్తుత కాలంలో అసాధ్యం. కానీ.. దీనిని సుసాధ్యం చేసి చూపారు ఇద్దరు కాలేజ్ యువకులు. వారి విజయగాథ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

చిన్న ఆలోచన నుంచి కోట్లు..
ప్రభాకిరణ్ సింగ్, సిద్ధార్థ్ మనోట్ అనే యువకులు Bewakuf.comను స్థాపించారు. దీనిని 1012లో ప్రారంభించారు. ప్రస్తుతం ఈ కంపెనీ భారతదేశపు అతిపెద్ద రీసెల్లింగ్, ఈ-కామర్స్ కంపెనీగా ఎదిగింది. అసలు వీరు చేసే వ్యాపారం ఏమిటో ఇప్పుడు చూద్దాం.

కాలేజీ చదువుతున్న రోజుల్లో..
ఐఐటీలో చదువుకుంటున్న రోజుల్లో స్నేహితులిద్దరూ కలిసి Bewakuf.com ప్రారంభించారు. వారు కాలేజీలో ఉన్నప్పుడు.. అప్పట్లో ఎన్నో వ్యాపారాలు చేసేవారు. వ్యాపారాలు ఎలా నడుస్తాయి, వాటి విజయానికి కారణాలు ఏమిటి, ఎలా నిర్వహించాలి వంటి విషయాలను సేకరించేవారు. అలా.. ప్రభాకిరణ్ సింగ్, సిద్ధార్థ్ మనోట్ చాలా చిన్న వ్యాపారాలు చేసేవారు. వాటిలో ఒకటి టీ-షర్ట్స్ ప్రింటింగ్ వ్యాపారం.

2010లో ఆలోచన ప్రారంభమై..
ఈ ఇద్దరు స్నేహితులు ఐఐటీ బాంబేలో సివిల్ ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడు 2010లో డొమైన్ పేర్లను వెతకడం ప్రారంభించారు. చాలా శోధించిన తర్వాత.. Bewakuf.com డొమైన్‌ను కొనుగోలు చేశారు. 2012 చివరలో ఈ-కామర్స్ వెబ్‌సైట్ Bewakuf.comని ప్రారంభించారు.

వ్యాపారంలో ఆవిష్కరణలు..
ఈ మిత్రులిద్దరూ తమ వ్యాపారంలో ఎన్నో కొత్త ఆవిష్కరణలు చేశారు. తమ వ్యాపారాన్ని మంచి స్థితికి తీసుకెళ్లేందుకు చాలా కష్టపడ్డారు. వారు ఎప్పుడూ ఏదో ఒక కొత్త ఆలోచన కోసం వెతుకుతూ ఉండేవారు. అప్పుడే మార్కెట్‌లో ట్రెండ్ గురించి తెలుసుకుని T- షర్టుపై ప్రింట్ చేసి విక్రయించటం ప్రారంభించారు. వీరి ఉత్పత్తులకు ప్రజల నుంచి మంచి ఆదరణ లభించింది.

రూ.200 కోట్ల కంపెనీగా..
వ్యాపారం ప్రారంభించిన తర్వాత.. అనుకున్నదానికంటే తక్కువ సమయంలోనే చాలా డబ్బు కూడబెట్టారు. దీంతో వారు బట్టలు మార్కెట్‌లో చాలా వేగంగా అమ్ముడుపోయాయి. ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్ సహాయంతో అతను తన వ్యాపారాన్ని చాలా వేగంగా విస్తరించడం ప్రారంభించారు. తన కఠోర శ్రమతో ఈరోజు బెవాకుఫ్.కామ్‌ను పెద్ద కంపెనీగా మార్చారు. రూ.30వేలతో ఈ కంపెనీని ప్రారంభించినప్పటికీ.. ప్రస్తుతం రూ. 200 కోట్ల వ్యాపారంగా ఎదిగింది.
More From GoodReturns

Bengaluru: ఒకప్పుడు డబ్బు లేక నేలపై నిద్ర.. నేడు రూ. 800 కోట్ల టర్నోవర్! 23 ఏళ్ల అంజలి ఇన్స్పైరింగ్ జర్నీ!

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు తగ్గాయి.. ఎంత తగ్గాయో తెలిస్తే ఎగిరి గంతేస్తారు.. మార్చి 2, సోమవారం పసిడి ధరలు ఇవే..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఏంటంటే..

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. 10 గ్రాములు ధర ఎంత తగ్గిందంటే.. మార్చి 3, మంగళవారం ధరలు ఇవే..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications