For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నష్టాల్లో మార్కెట్లు, రిలయన్స్ మరింత పతనం: ఈ రంగాలు అదుర్స్

|

ముంబై: భారత ఈక్విటీ మార్కెట్లు శుక్రవారం (నవంబర్ 27) నష్టాల్లో ప్రారంభమయ్యాయి. ఉదయం గం.11.30 సమయం వరకు ఏ దశలోను కోలుకోలేదు. నిన్న 44,260 పాయింట్ల వద్ద ముగిసిన మార్కెట్లు నేడు పడిపోయాయి. ఉదయం గం.9.16 సమయానికి 18.30 పాయింట్లు(0.04%) క్షీణించిన సెన్సెక్స్ 44,241.44 పాయింట్ల వద్ద, 2.10 పాయింట్లు(0.02%) పడిపోయిన నిఫ్టీ 12,984.90 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. 753 షేర్లు లాభాల్లో, 322 షేర్లు నష్టాల్లో ప్రారంభం కాగా, 74 షేర్లలో ఎలాంటి మార్పులేదు. దాదాపు అన్ని రంగాలు కూడా నష్టాల్లో ఉన్నాయి. మధ్యాహ్నం గం.11.30 సమయానికి సెన్సెక్స్ 147 పాయింట్లు నష్టపోయింది.

కొత్తగా హోమ్‌లోన్ తీసుకుంటున్నారా.. BHFL గుడ్‌న్యూస్, వారికి కూడా ఈ ప్రయోజనంకొత్తగా హోమ్‌లోన్ తీసుకుంటున్నారా.. BHFL గుడ్‌న్యూస్, వారికి కూడా ఈ ప్రయోజనం

రిలయన్స్ స్టాక్ డౌన్

రిలయన్స్ స్టాక్ డౌన్

టాప్ గెయినర్స్ జాబితాలో టాటా మోటార్స్ 5.04 శాతం, బజాజ్ ఆటో 3.30 శాతం, ఐచర్ మోటార్స్ 2.12 శాతం, ఏషియన్ పేయింట్స్ 1.64 శాతం, బ్రిటానియా 1.59 శాతం లాభాల్లో ఉన్నాయి.

టాప్ లూజర్స్ జాబితాలో HDFC లైఫ్ 2.06 శాతం, పవర్ గ్రిడ్ కార్పోరేషన్ 1.85 శాతం, హిండాల్కో 1.61 శాతం, టీసీఎస్ 1.35 శాతం, SBI 1.04 శాతం నష్టాల్లో ఉన్నాయి.

మోస్ట్ యాక్టివ్ స్టాక్స‌లో బజాజ్ ఫైనాన్స్, టాటా మోటార్స్, కొటక్ మహీంద్రా, రిలయన్స్, టాటా స్టీల్ ఉన్నాయి.

ఈ రోజు రిలయన్స్ స్టాక్ మరింత పతనమైంది. 0.80 శాతం లేదా రూ.15.60 క్షీణించి రూ.1,937 వద్ద ట్రేడ్ అయింది. రిలయన్స్ స్టాక్ రూ.1940 దిగువన ఉంది.

రంగాలవారీగా...

రంగాలవారీగా...

రంగాలవారీగా నిఫ్టీ ఆటో 1.75 శాతం, నిఫ్టీ ఎనర్జీ 0.36 శాతం, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ 0.40 శాతం, నిఫ్టీ మీడియా 2.04 శాతం, నిఫ్టీ మెటల్ 0.30 శాతం, నిఫ్టీ ఫార్మా 1.29 శాతం, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంకు 0.69 శాతం, నిఫ్టీ రియాల్టీ 2.32 శాతం, నిఫ్టీ ప్రయివేటు బ్యాంకు 0.03 శాతం లాభపడ్డాయి.

నిఫ్టీ బ్యాంకు 0.31 శాతం, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ 0.42 శాతం, నిఫ్టీ ఐటీ 0.37 శాతం నష్టాల్లో ఉన్నాయి.

నిఫ్టీ కమోడిటీస్ 0.43 శాతం లాభపడగా, నిఫ్టీ 50 0.19 శాతం నష్టపోయింది.

ఆటో, రియాల్టీ, ఫార్మా, మీడియా స్టాక్స అదరగొట్టాయి.

కొనుగోళ్లు.. అమ్మకాలు

కొనుగోళ్లు.. అమ్మకాలు

కాగా, నగదు విభాగంలో గురువారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(FPI) రూ.2,027 కోట్లను ఇన్వెస్ట్ చేశాయి. దేశీ ఫండ్స్(DII) రూ.3,400 కోట్ల విలువైన అమ్మకాలు చేపట్టాయి. బుధవారం FPIలు నామమాత్రంగా రూ.24 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేయగా, DIIలు రూ.1,840 కోట్లకు పైగా పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి.

English summary

నష్టాల్లో మార్కెట్లు, రిలయన్స్ మరింత పతనం: ఈ రంగాలు అదుర్స్ | Stock Market News: Sensex down 100 points, Nifty below 13,000

Among sectors, auto and pharma indices rose 1 percent each. Tata Motors, Bajaj Auto, NTPC, Britannia Industries and Bajaj Finance were among top gainers on the Nifty.
Story first published: Friday, November 27, 2020, 11:38 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X