For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పోగొట్టుకున్న చోటే దొరికిందిగా: మార్కెట్ కళకళలాడినా ఎల్ఐసీ మాత్రం మరింత నష్టాల్లో

|

ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్‌ ఇవ్వాళ కళకళలాడింది. ఆకుపచ్చ రంగులో మెరిసిపోయింది. లాభాలతో ముగిసింది. ఈ వారం చివరిరోజు మెజారిటీ స్టాక్స్ అన్నీ అప్పర్ సర్క్యుట్‌లో ట్రేడ్ అయ్యాయి. గ్రీన్‌జోన్‌లో కనిపించాయి. గురువారం నాడు నష్టపోయిన పాయింట్లన్నింటినీ ఇవ్వాళ వెనక్కి తెచ్చుకుంది స్టాక్ మార్కెట్. సెన్సెక్స్, నిఫ్టీ భారీగా లాభపడ్డాయి. వచ్చే వారం కూడా మార్కెట్ ఇదే తరహాలో ఆరంభం కావొచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తోన్నాయి.

కంపెనీలో ఆర్థిక అవకతవకలు: భారత్‌కు చెందిన సీఈఓకు ఉద్వాసనకంపెనీలో ఆర్థిక అవకతవకలు: భారత్‌కు చెందిన సీఈఓకు ఉద్వాసన

కొద్దిరోజులుగా వెంటాడుతోన్న తిరోగమనాన్ని అధిగమించేలా ఇవ్వాళ స్టాక్ మార్కెట్‌లో ఫుల్ జోష్ కనిపించింది. అనేక అనుమానాలను పటాపంచలు చేసింది. అన్ని సెగ్మెంట్స్‌కు సంబంధించిన షేర్లు జోరందుకున్నాయి. ఇదివరకు నష్టపోయిన పాయింట్లన్నింటినీ రీగెయిన్ చేసుకున్నాయి. ఈ ట్రెండ్‌కు అనుగుణంగానే మార్కెట్ ట్రేడ్ నమోదైంది. ఈ సోమవారం ఉదయం స్టాక్ మార్కెట్ లాభాలతో ఆరంభమైన విషయం తెలిసిందే. అవే లాభాలతో ఈ వారంలో తన చివరి రోజును ముగించాయి స్టాక్స్.

Stock Market ends the week in green, Sensex surges 1,534 Points, Nifty ends above 16,200

ఈ మధ్యాహ్నం 3:30 గంటలకు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 1534.16 పాయింట్లు లాభపడింది. 54,326.39 పాయింట్ల వద్ద ట్రేడింగ్ ముగిసింది. నిఫ్టీ సైతం 456.80 పాయింట్లు లాభపడింది. 16,266.20 పాయింట్ల వద్ద ట్రేడింగ్ ముగించుకుంది. 2,468 కంపెనీలకు చెందిన షేర్లు లాభపడ్డాయి. ఆరు శాతం వరకు ఈ లాభలా షేర్ కనిపించింది. 801 షేర్లు.. నష్టపోయాయి. ఇందులో ఎల్‌ఐసీ షేర్లు కూడా ఉన్నాయి.

ఫార్మా, మెటల్, స్టీల్, ఆటోమొబైల్స్, ఐటీ, బ్యాంకింగ్.. ఇలా దాదాపు అన్ని సెగ్మెంట్స్‌కు చెందిన షేర్లు అప్పర్ సర్క్యుట్‌లో ట్రేడ్ అయ్యాయి. నిఫ్టీ 50లో డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్, రిలయన్స్ ఇండస్ట్రీస్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్స్, నెస్ట్లె ఇండియా, టాటా మోటార్స్ టాప్ గెయినర్స్‌గా నిలిచాయి..ఈ మధ్యాహ్నం 3:30 గంటలకు ముగిసిన బోంబే స్టాక్ ఎక్స్ఛేంజ్, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ ట్రేడింగ్‌లో. ఆయా కంపెనీల షేర్లు లాభపడ్డాయి. శ్రీసిమెంట్, యూపీఎల్ టాప్ లూజర్స్‌గా నిలిచాయి.

కొత్తగా స్టాక్ ఎక్స్ఛేంజెస్‌లల్లో లిస్టింగ్ అయిన ఎల్ఐసీ షేర్లు కూడా భారీగా నష్టపోయాయి. మార్కెట్ మొత్తం కళకళలాడుతున్నప్పటికీ.. ఎల్ఐసీ షేర్లు మాత్రం నేల చూపులు చూశాయి. ఒక్కో షేర్ మీద ఇవ్వాళ ఒక్కరోజే రూ.15.55 పైసల మేర నష్టాన్ని నమోదు చేశాయి. రెయిన్‌బో చిల్డ్రన్స్ హాస్పిటల్స్ 26 రూపాయల మేర లాభపడింది. ఇవ్వాళే లిస్టింగ్ అయిన ప్రుడెన్షియల్ 10 శాతం మేర నష్టపోయింది. 576 రూపాయల వద్ద ఈ కంపెనీ షేర్ ట్రేడింగ్ అయింది. దీని కటాఫ్ ప్రైస్ ధర 630 రూపాయలు.

English summary

పోగొట్టుకున్న చోటే దొరికిందిగా: మార్కెట్ కళకళలాడినా ఎల్ఐసీ మాత్రం మరింత నష్టాల్లో | Stock Market ends the week in green, Sensex surges 1,534 Points, Nifty ends above 16,200

Stock Market ends the week in green, Sensex surges 1,534 Points, Nifty ends above 16,200.
Story first published: Friday, May 20, 2022, 16:41 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X