For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Sputnik Lilght:భారత్‌లో బాటిళ్లలో నింపడానికి ఇంకా వెయిటింగ్: టెక్నాలజీ బదిలీకీ

|

మాస్కో: ప్రాణాంతక కరోనా వైరస్ మహమ్మారిని నిర్మూలించడానికి రష్యా అభివృద్ధి చేసిన స్పుత్నిక్ వీ (Sputnik V) వ్యాక్సిన్ భారత్‌లో అత్యవసర పరిస్థితుల్లో వినియోగించడానికి సిద్ధంగా ఉంది. ఇప్పటికే దీనికి సంబంధించిన రెండు బ్యాచ్‌ల వ్యాక్సిన్లు భారత్‌కు అందాయి. రష్యా నుంచి హైదరాబాద్‌కు చేరుకున్నాయి. హైదరాబాదీ టాప్ ఫార్మాసూటికల్స్ కంపెనీ డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ ఈ వ్యాక్సిన్‌ను ఉత్పత్తి చేసే కాంట్రాక్ట్‌ను పొందింది. ఈ కంపెనీ నుంచే వ్యాక్సిన్ డిస్ట్రిబ్యూషన్ కొనసాగుతోంది. చాలాకాలం నుంచి వార్తల్లో నానుతోన్న స్పుత్నిక్ లైట్ (Sputnik Light) వ్యాక్సిన్ కోసం ఇంకా ఎదురు చూడాల్సి వస్తోంది.

ఇంకా పరిశీలన దశలో..

ఇంకా పరిశీలన దశలో..

స్పుత్నిక్ లైట్ వ్యాక్సిన్‌ను అత్యవసర పరిస్థితుల్లో వినియోగించడానికి అనుమతి ఇవ్వాలంటూ రష్యా డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ (RDIF) ఇదివరకే దరఖాస్తులను దాఖలు చేసింది. అవి ఇంకా పరిశీలన దశలోనే ఉన్నాయి. ఈ ప్రతిపాదనలపై ఆమోదం కోసం ఆర్డీఐఎఫ్ ఎదురు చూస్తోంది. స్పుత్నిక్ లైట్ వ్యాక్సిన్‌కు ఇంకా అనుమతి లభించలేదని రష్యాలోని భారత రాయబారి డీ బాల వెంకటేష్ వర్మ స్పష్టం చేశారు. త్వరలోనే అనుమతి లభిస్తుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. ఈ వ్యాక్సిన్ కూడా అందుబాటులోకి వస్తే.. భారత్-రష్యా మధ్య ఉన్న సంబంధాలు మరింత బలోపేతమౌతాయని అన్నారు.

మూడోదశల్లో వ్యాక్సిన్

మూడోదశల్లో వ్యాక్సిన్

భారత్‌లో మూడుదశల్లో ఈ వ్యాక్సిన్‌ను ఉత్పత్తి చేయాల్సి ఉందని ఆయన వివరించారు. తొలిదశలో రష్యా నుంచి వ్యాక్సిన్లు భారత్‌కు అందాల్సి ఉందని, ఈ దశ పూర్తయిందని ఆయన చెప్పారు. ఇక రెండోదశలో ఆర్డీఎఫ్ఐ ఆ వ్యాక్సిన్లను పెద్ద ఎత్తున భారత్‌కు సరఫరా చేయాల్సి ఉందని అన్నారు. ఈ దశ కూడా సిద్ధంగా ఉందని, వాటిని బాటిళ్లలో నింపాల్సిన ప్రక్రియ ఒక్కటే మిగిలిపోయి ఉందని బాల వెంకటేష్ వర్మ తేల్చి చెప్పారు. దీనికోసం అనుమతి తీసుకోవాల్సిన ప్రక్రియ మాత్రమే మిగిలి ఉందని అన్నారు.

సాంకేతిక పరిజ్ఞానం భారత్‌కు బదిలీ..

సాంకేతిక పరిజ్ఞానం భారత్‌కు బదిలీ..

మూడోదశలో రష్యా ప్రభుత్వం.. స్పుత్నిక్ లైట్ వ్యాక్సిన్ సాంకేతిక పరిజ్ఞానాన్ని భారత్‌కు పూర్తిస్థాయిలో బదిలీ చేయాల్సి ఉంటుందని ఆయన వ్యాఖ్యానించారు. ఈ మూడు దశల ప్రక్రియ పూర్తయితే- భారత్‌లో ప్రతి సంవత్సరానికీ 850 మిలియన్ డోసుల స్పుత్నిక్ లైట్ వ్యాక్సిన్లను ఉత్పత్తి చేయడానికి అవకాశం ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రక్రియ త్వరలోనే పూర్తవుతుందని భావిస్తున్నట్లు ఆయన అంచనా వేశారు. స్పుత్నిక్ లైట్ వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే.. కరోనా వైరస్ నిర్మూలన ప్రక్రియ మరింత వేగవంతమౌతుందనడంలో సందేహాలు అక్కర్లేదని అభిప్రాయపడ్డారు.

English summary

Sputnik Lilght:భారత్‌లో బాటిళ్లలో నింపడానికి ఇంకా వెయిటింగ్: టెక్నాలజీ బదిలీకీ | Sputnik Light: it will have to be filled in various bottles in India: Indian Ambassador to Russia

Indian Envoy to Russia said that the Russian side has also proposed Sputnik Light. The regulatory approvals for that in India are still not completed. But once those regulatory approvals are given, Sputnik Light will be one more area of cooperation.
Story first published: Saturday, May 22, 2021, 13:20 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X