For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రెమిటెన్స్, జన్‌ధన్, ఉద్యోగాల డేటా: భారత్‌లో రికవరీ ఉందా?: సర్వేలో కీలక విషయాలు

|

కరోనా నేపథ్యంలో ప్రపంచంతో పాటు భారత ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది. ఇప్పుడు ఆర్థిక రికవరీ సంకేతాలు కనిపిస్తున్నాయని ఎస్బీఐ రీసెర్చ్ నివేదిక తెలిపింది. వలస కార్మికుల నుండి నగదు బదలీ పెరగడం, ఉద్యోగంలో చేరాక ఈపీఎఫ్ఓ నమోదులు లాక్‌డౌన్ ముందుస్థాయికి చేరుకోవడం, జన్‌ధన్ ఖాతాల్లో నగదు జమ వృద్ధి వంటివి ఇందుకు నిదర్శనమని ఎస్బీఐ రీసెర్చ్ విడుదల చేసిన నివేదికలో తెలిపింది. ఆర్థిక వ్యవస్థ క్రమంగా కోలుకుంటోందని ప్రభుత్వంతో పాటు వివిధ సర్వేలు వెల్లడిస్తున్నాయి. ఎస్బీఐ రీసెర్చ్ కూడా ఆర్థిక రికవరీ సంకేతాలు స్పష్టంగా ఉన్నట్లు తెలిపాయి.

ఈసారి భారత జీడీపీ సున్నా, ప్రపంచ వేగవంత ఆర్థిక వ్యవస్థగా..: మోడీతో నిర్మల భేటీఈసారి భారత జీడీపీ సున్నా, ప్రపంచ వేగవంత ఆర్థిక వ్యవస్థగా..: మోడీతో నిర్మల భేటీ

కరోనా ముందుస్థాయికి రెమిటెన్స్

కరోనా ముందుస్థాయికి రెమిటెన్స్

కరోనా కారణంగా ఏప్రిల్ నెలలో వలస కార్మికుల రెమిటెన్సెస్ భారీగా తగ్గాయి. జూన్, జూలై నెలల్లో కాస్త పెరిగినప్పటికీ ఆశాజనకంగా కనిపించలేదు. సెప్టెంబర్ నెలలో అయితే కరోనా ముందుస్థాయికి చేరుకున్నాయి. అంటే ఫిబ్రవరి నెలస్థాయికి చేరాయి. దీనిని బట్టి కార్మికులు తిరిగి పెద్ద ఎత్తున పనుల్లో చేరుతున్నారని భావించవచ్చు. ఆగస్ట్ నెలలో వర్షాల వల్ల రెమిటెన్సెస్ కాస్త తగ్గాయి.

ఈపీఎఫ్ఓ పేరోల్ డేటా

ఈపీఎఫ్ఓ పేరోల్ డేటా

ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(EPFO) పేరోల్ డేటా ప్రకారం ఏప్రిల్-ఆగస్ట్ కాలంలో కొత్తగా 25 లక్షల ఈపీఎఫ్ చందాదారులు చేరారు. ఇందులో 12.4 లక్షలమంది తొలిసారి వేతనం అందుకుంటున్నవారు కావడం గమనార్హం. 2019-20లో 110.4 లక్షల కొత్త ఈపీఎఫ్ చందాదారులు చేరారు. అంతకుముందు ఏడాది ఇది 139.4 లక్షలుగా ఉంది. అంటే 29 లక్షలు తక్కువ. ఫార్మలైజేషన్ డిగ్రీ 2020-21 ఆర్థిక సంవత్సరంలో ఆరు శాతానికి గణనీయంగా పడిపోయింది. ఇది అంతకుముందు ఏడాది 11 శాతంగా ఉంది.

పెరిగిన జన్ ధన్ ఖాతాలు

పెరిగిన జన్ ధన్ ఖాతాలు

అక్టోబర్ 14వ తేదీ నాటికి జన్ ధన్ ఖాతాలు 41.05 కోట్లుగా ఉండగా, వాటిలో జమ అయిన మొత్తం రూ.1.31 లక్షల కోట్లుగా ఉంది. ఏప్రిల్ నుండి దాదాపు 3 కోట్ల ఖాతాలు తెరవగా, మొత్తం డిపాజిట్ల వృద్ధి రూ.11,060 కోట్లుగా ఉంది. కరోనా కారణంగా ఈ ఖాతాల సంఖ్య అరవై శాతం పెరిగింది. ఏప్రిల్‌లో సగటు జమ రూ.3400కు పెరగగా, సెప్టెంబర్ నాటికి రూ.3,168కి తగ్గింది. అక్టోబర్‌లో తిరిగి రూ.3,185కు పెరిగింది. కేంద్ర ప్రభుత్వం మహిళల అకౌంట్లలో రూ.500 చొప్పున జమ చేసిన విషయం తెలిసిందే. జన్ ధన్ ఖాతాల వల్ల యూపీ, మహారాష్ట్ర, హర్యానాలలో నేరాలు తగ్గాయి.

English summary

రెమిటెన్స్, జన్‌ధన్, ఉద్యోగాల డేటా: భారత్‌లో రికవరీ ఉందా?: సర్వేలో కీలక విషయాలు | Spike in internal remittance, new EPFO registrations indicate recovery

Indicating a faster than expected recovery, remittances from migrant labourers and the number of first-time EPFO registrations have crossed the pre-lockdown levels in September, according to a report. Another silver lining is the massive 60 per cent increase in the number of Jan Dhan accounts to over 41 crore and the balances in them, which also indicate the fall in crimes during the lockdown months, SBI Research said in a report on Tuesday.
Story first published: Wednesday, October 28, 2020, 17:20 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X