For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Gold: పసిడి ప్రియులకు శుభవార్త.. రూ.4000 తగ్గనున్న గోల్డ్ ధర..! మోడీ ప్రభుత్వం మాస్టర్ ప్లాన్ వల్ల..

|

Gold Rate: భారతీయులు పసిడి ప్రియులు. అందువల్ల మనదేశం ప్రపంచంలో అతిపెద్ద బంగారం కొనుగోలు, దిగుమతిదారుగా ఉన్న విషయం మనందరికీ తెలిసిందే. స్వాతంత్య్రం తరువాత దేశంలో జరగని పనిని మోదీ ప్రభుత్వం చేస్తోంది. దీని వల్ల సామాన్యులు ఎక్కువగా ప్రయోజనం పొందుతారు.

 దేశంలో తొలి బులియన్ ఎక్స్ఛేంజ్ ప్రారంభం..

దేశంలో తొలి బులియన్ ఎక్స్ఛేంజ్ ప్రారంభం..

ఇటీవల దేశంలోని గుజరాత్ గిఫ్ట్ సిటీలో మొదటి బులియన్ ఎక్స్ఛేంజ్ ప్రారంభించబడింది. స్వర్ణకారులు నేరుగా ఈ ఎక్స్ఛేంజ్‌లో బంగారాన్ని కొనుగోలు చేయవచ్చు. ఈ ఎక్స్ఛేంజ్ అతిపెద్ద లక్షణం ఏమిటంటే.. మీరు ఇక్కడ బంగారాన్ని కొనుగోలు చేసిన వెంటనే మీరు దాని డెలివరీని పొందుతారు. అంటే భౌతిక బంగారాన్ని పొందవచ్చన్నమాట. దేశంలోని అనేక డజన్ల మంది బంగారు తయారీదారులు సభ్యులుగా ఉండగా, ఈ ఎక్స్ఛేంజ్ వారం రోజులు కూడా తెరవకపోవడానికి ఇదే కారణం. అదే సమయంలో.. బంగారం విక్రయించే ప్రపంచంలోని పెద్ద కంపెనీలు ఇక్కడ సభ్యులుగా మారుతున్నాయి. ప్రస్తుతం ఇందులో చేరుతున్న సభ్యుల సంఖ్య క్రమంగా పెరుగుతున్నట్లు సమాచారం.

ప్రజలకు చౌకగా బంగారం ఎలాగంటే..?

ప్రజలకు చౌకగా బంగారం ఎలాగంటే..?

నిపుణుల అంచనాల ప్రకారం.. ఒక సంవత్సరంలో ఈ ఎక్స్ఛేంజ్ నుంచి 100 టన్నుల బంగారం విక్రయాలు జరిగితే.. దాని ద్వారా ఆభరణాల వ్యాపారులకు సుమారు 5 మిలియన్ డాలర్లు అంటే రూ.400 కోట్లు ఆదా అవుతుంది. ఇది కిలోల వారీగా చూసుకున్నట్లయితే.. కిలోకు ధర దాదాపు రూ.4000 వరకు తగ్గుతుంది. ఇది ప్రారంభ అంచనా మాత్రమే. ఈ గోల్డ్ ఎక్స్ఛేంజ్‌లో పారదర్శక ట్రేడింగ్ కారణంగా.. రానున్న కాలంలో ఈ ధరలు మరింత తగ్గే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.

ఒకే దేశం ఒకటే బంగారం ధర..

ఒకే దేశం ఒకటే బంగారం ధర..

అయితే తాజాగా భారత ప్రభుత్వం త్వరలోనే దేశ వ్యాప్తంగా ఒకటే బంగారం ధర ఉండేలా చర్యలు ప్రారంభించింది. ఇప్పటి వరకు దేశంలో బంగారం ధరను నిర్ణయించే ప్రామాణిక పద్ధతి లేదు. అటువంటి పరిస్థితిలో.. దాని రేటు అంచనాపై నిర్ణయించబడింది. అయితే.. గోల్డ్ ఎక్స్ఛేంజ్‌లో బంగారం ట్రేడింగ్ అండ్ డెలివరీ రేటును బట్టి, బంగారు నగల వ్యాపారులు దీనిని ఏ రేటుకు పొందుతున్నారో తెలుస్తుంది. ఇలా గోల్డ్ రేటు నిర్ణయంలో మార్పుల ద్వారా దేశ వ్యాప్తంగా ధరల్లో స్థిరత్వం వస్తుందని నిపుణులు చెబుతున్నారు.

వినియోగదారులకు తగ్గింపు బదిలీ..

వినియోగదారులకు తగ్గింపు బదిలీ..

అటువంటి పరిస్థితిలో.. నగల వ్యాపారులు తన వినియోగదారులకు ధరల తగ్గింపు ప్రయోజనాన్ని బదిలీ చేయాలి. వ్యాపారుల మధ్య ఉండే పోటీ కారణంగా ఇది జరుగుతుందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. జ్యువెలర్లు తమ కస్టమర్లను నిలుపుకోవడానికి ఈ ప్రయోజనాన్ని ఇవ్వవలసి వస్తుందని అంటున్నారు. అంతే కాకుండా.. ఆభరణాల వ్యాపారులకు ఎంత తక్కువ ధరలో బంగారం లభిస్తే, భారతదేశ విదేశీ మారకద్రవ్య నిల్వలు అంత తక్కువ వెచ్చించాల్సి వస్తుంది. ప్రస్తుతం మన దేశం ఇంధనం, బంగారం దిగుమతులకు ఎక్కువగా విదేశీ మారక నిల్వలను ఉపయోగిస్తోంది. అంటే మోదీ ప్రభుత్వం చేపట్టిన ఈ చొరవతో దేశంలో బంగారం చౌకగా లభిస్తుండడంతో దిగుమతులపై కూడా తక్కువ విదేశీ మారకద్రవ్యాన్ని వెచ్చించడానికి దోహదపడుతుంది.

English summary

Gold: పసిడి ప్రియులకు శుభవార్త.. రూ.4000 తగ్గనున్న గోల్డ్ ధర..! మోడీ ప్రభుత్వం మాస్టర్ ప్లాన్ వల్ల.. | soon gold rate to reduce by 4000 rupees per kiolgram with gold exchange brought by modi government in gift city of gujrath

soon gold rate to reduce by 4000 rupees good news to yellow metal lovers
Story first published: Sunday, August 7, 2022, 7:20 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X