For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

SIP collections: రూ.96,000 కోట్లకు తగ్గిన సిప్ పెట్టుబడులు

|

2020-21 ఆర్థిక సంవత్సరంలో మ్యూచువల్ ఫండ్స్ పథకాల్లోకి సిస్టమెటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్(SIP) రూపంలో వచ్చే పెట్టుబడులు 4 శాతం తగ్గి రూ.96,000 కోట్లుగా నమోదయ్యాయి. కరోనా, లాక్ డౌన్, ఆదాయ అస్థిరత ప్రభావం సహా వివిధ కారణాలతో SIPలు తగ్గాయి. సగటున ప్రతీ నెలా రూ.8,000 కోట్ల మేర పెట్టుబడులు వచ్చాయి. కరోనా కారణంగా ఏర్పడిన ప్రతికూల పరిస్థితుల ప్రభావం SIP పెట్టుబడులపై చూపించింది.

2019-20 ఏడాదిలో ఇన్వెస్టర్లు సిప్ రూపంలో వివిధ పథకాల్లోకి రూ.1,00,084 కోట్ల మేర పెట్టుబడులు వచ్చాయి. సిప్ ద్వారా వచ్చే పెట్టుబడుల పైన రిస్క్ తగ్గుతుంది. మార్కెట్లు గరిష్ట విలువల వద్ద, కనిష్ట విలువల వద్ద క్రమంగా పెట్టుబడులకు వీలు కల్పిస్తుంది. దీర్ఘకాలంలో రిస్క్‌ను అధిగమించి మెరుగైన రాబడులకు అందుకునే అవకాశం ఉంటుంది.

SIP collections drop to Rs 96,000 crore in FY21 amid pandemic led disruptions

2016-17 ఆర్థిక సంవత్సరంలో రూ.43,921 కోట్లు, 2017-18లో రూ.67,190 కోట్లు, 2018-19లో రూ.92,693 కోట్ల చొప్పున మ్యూచువల్ ఫండ్స్‌లోకి పెట్టుబడులు వచ్చాయి. వ్యాక్సినేషన్ విజయవంతం, అంచాలకు మించి ఆర్థిక పురోగతి, అధిక ఆదాయాలు సిప్ పెట్టుబడులపై రానున్న రోజుల్లో ప్రభావం చూపించే అవకాశాలుగా చెబుతున్నారు.

English summary

SIP collections: రూ.96,000 కోట్లకు తగ్గిన సిప్ పెట్టుబడులు | SIP collections drop to Rs 96,000 crore in FY21 amid pandemic led disruptions

The Mutual fund industry saw its collections through SIPs dropping 4 per cent to Rs 96,000 crore in the 2020-21 fiscal, as COVID-19 induced lockdowns led to income uncertainty.
Story first published: Thursday, April 15, 2021, 8:23 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X