For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సెన్సెక్స్ 660 పాయింట్ల భారీ జంప్, రిలయన్స్ రూ.2000 మార్క్ క్రాస్

|

ముంబై: వరుసగా రెండు రోజుల పాటు భారీగా నష్టపోయిన స్టాక్ మార్కెట్లు నేడు (జనవరి 19, మంగళవారం) కోలుకున్నాయి. నేటి ఉదయం గం.09:16 సమయానికి సెన్సెక్స్ 359.64 పాయింట్లు లేదా 0.74% లాభపడి 48,923.91 పాయింట్ల వద్ద, నిఫ్టీ 100.10 పాయింట్లు లేదా 0.70% ఎగిసి 14,381.40 పాయింట్ల వద్ద ఉంది. 999 షేర్లు లాభాల్లో, 232 షేర్లు నష్టాల్లో ప్రారంభం కాగా, 28 షేర్లలో ఎలాంటి మార్పులేదు. అన్ని రంగాలు కూడా లాభాల్లోనే ఉన్నాయి. డాలర్ మారకంతో రూపాయి స్వల్పంగా లాభపడింది. 11 పైసలు ఎగబాకి 73.17 వద్ద ప్రారంభమైంది. క్రితం సెషన్లో 73.28 వద్ద క్లోజ్ అయింది.

Budget 2021-22: కరోనా వ్యాక్సీన్ కోసం ఖర్చులు, సంపన్నులపై కరోనా సెస్?Budget 2021-22: కరోనా వ్యాక్సీన్ కోసం ఖర్చులు, సంపన్నులపై కరోనా సెస్?

నేడు భారీగా జంప్

నేడు భారీగా జంప్

సెన్సెక్స్ నేడు ఉదయం 48,900 వద్ద ప్రారంభమై, ఆ తర్వాత అంతకంతకూ ఎగిసింది. ఏ దశలోను క్షీణించలేదు. మధ్యాహ్నం గం.12 సమయానికి 650 పాయింట్లు లాభపడి 49,215 పాయింట్ల వద్ద ఉంది. 49,237 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 48,805 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. క్రితం సెషన్లో సెన్సెక్స్ 48,564 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది. గత రెండు సెషన్లలోనే సెన్సెక్స్ 1000 పాయింట్లకు పైగా నష్టపోయింది. గత వారం చివరి సెషన్లో (శుక్రవారం) 550 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్, నిన్న 470 పాయింట్లు పతనమైంది. నేడు 650 పాయింట్ల వరకు ఎగిసిపడటం గమనార్హం. నిఫ్టీ 190 పాయింట్ల వరకు లాభపడింది.

టాప్ గెయినర్స్, లూజర్స్

టాప్ గెయినర్స్, లూజర్స్

నేటి టాప్ గెయినర్స్ జాబితాలో గ్రాసీమ్ 4.59 శాతం, బజాజ్ ఫిన్ సర్వ్ 4.64 శాతం, బజాజ్ ఫైనాన్స్, 3.97 శాతం, టాటా మోటార్స్ 3.46 శాతం, లార్సన్ 3.18 శాతం లాభపడ్డాయి.

టాప్ లూజర్స్ జాబితాలో టెక్ మహీంద్రా 0.76 శాతం, మహీంద్రా అండ్ మహీంద్రా 0.37 శాతం, బ్రిటానియా 0.33 శాతం నష్టపోయాయి.

మోస్ట్ యాక్టివ్ స్టాక్స్‌లో టాటా మోటార్స్, రిలయన్స్, టాటా స్టీల్, బజాజ్ ఫైనాన్స్, యూపీఎల్ ఉన్నాయి.

రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ 2.24 శాతం లాభపడి రూ.2,028 పాయింట్ల వద్ద ట్రేడ్ అయింది. చాలా రోజుల తర్వాత రిలయన్స్ రూ.2000 మార్కును క్రాస్ చేసింది.

ఐటీ రంగానికి వస్తే ఇన్ఫోసిస్ 0.61 శాతం, టీసీఎస్ 1.08 శాతం, విప్రో 0.22 శాతం, HCL టెక్ 0.056 శాతం లాభపడ్డాయి.

రంగాలవారీగా..

రంగాలవారీగా..

నిఫ్టీ 50 స్టాక్స్ 1.28 శాతం, నిఫ్టీ మిడ్ క్యాప్ 2.24 శాతం లాభపడ్డాయి. రంగాల వారీగా చూస్తే నిఫ్టీ ఆటో 1.43 శాతం, నిఫ్టీ ఆటో 1.43 శాతం, నిఫ్టీ బ్యాంకు 1.04 శాతం, నిఫ్టీ ఎనర్జీ 1.85 శాతం, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ 1.42 శాతం, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ 0.51 శాతం, నిఫ్టీ ఐటీ 0.64 శాతం, నిఫ్టీ మీడియా 2.05 శాతం, నిఫ్టీ మెటల్ 1.66 శాతం, నిఫ్టీ ఫార్మా 0.93 శాతం, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంకు 2.52 శాతం, నిఫ్టీ రియాల్టీ 4.16 శాతం, నిఫ్టీ ప్రయివేటు బ్యాంకు 1.12 శాతం లాభపడ్డాయి.

English summary

సెన్సెక్స్ 660 పాయింట్ల భారీ జంప్, రిలయన్స్ రూ.2000 మార్క్ క్రాస్ | Sensex zooms over 660 points to top 49k, all sectors in the green

Nifty auto, infra, energy, metal and PSU Bank indices rose 1-2 percent. The market is in the green in the current year so far, but Sensex scaling the 49,000-mark and Nifty50 touching 14,500 levels ahead of the Budget 2021 could make anyone cautious about the strength of the rally.
Story first published: Tuesday, January 19, 2021, 12:16 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X