For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సెన్సెక్స్@44,545: భారత మార్కెట్లు హైజంప్, అమెరికా మార్కెట్లో ప్రాఫిట్ బుకింగ్

|

ముంబై: స్టాక్ మార్కెట్లు మంగళవారం (డిసెంబర్ 1) లాభాల్లో ప్రారంభం అయ్యాయి. ఉదయం గం.9.16 సమయానికి సెన్సెక్స్ 49.92 పాయింట్లు (0.11%) లాభపడి 44,199.64 వద్ద, నిఫ్టీ 17.10 పాయింట్లు(0.13%) లాభపడి 12,986.10 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. 981 షేర్లు లాభాల్లో, 376 నష్టాల్లో ప్రారంభం కాగా, 74 షేర్లలో ఎలాంటి మార్పులేదు. దాదాపు అన్ని రంగాలు కూడా లాభాల్లో ఉన్నాయి. మెటల్ రంగాలు ఒక శాతం మేర లాభపడింది. ఇక రూపాయి 73.95 వద్ద ప్రారంభమైంది.

FY20 ITR forms: ఐటీఆర్ ఫామ్‌లో ఈ ఏడాది కీలక మార్పులు.. ఇవీFY20 ITR forms: ఐటీఆర్ ఫామ్‌లో ఈ ఏడాది కీలక మార్పులు.. ఇవీ

మార్కెట్లు జంప్

మార్కెట్లు జంప్

ఉదయం గం.10.30 సమయానికి సెన్సెక్స్ 245 పాయింట్లు లాభపడి 44,400 మార్కుకు చేరువలో నిలిచింది. ఆ తర్వాత కాసేపటికి 393 పాయింట్లు లాభపడి 44,542 పాయింట్లకు చేరుకుంది.

టాప్ గెయినర్స్ జాబితాలో గెయిల్ 7.06 శాతం, గ్రాసీమా 3.15 శాతం, అల్ట్రా టెక్ సిమెంట్ 2.57 శాతం, యూపీఎల్ 2.42 శాతం, సన్ ఫార్మా 2.49 శాతం లాభాలతో ఉన్నాయి.

టాప్ లూజర్స్ జాబితాలో నెస్ట్లే 2.55 శాతం, కొటక్ మహీంద్రా బ్యాంకు 1.47 శాతం, బ్రిటానియా 0.93 శాతం, టైటాన్ కంపెనీ 0.90 శాతం, మహీంద్రా అండ్ మహీంద్రా 0.78 శాతం శాతం నష్టాల్లో ట్రేడ్ అయ్యాయి.

మోస్ట్ యాక్టివ్ స్టాక్స్‌లో కొటక్ మహీంద్ర బ్యాంకు, బజాజ్ ఫైనాన్స్, హెచ్‌డీఎఫ్‌సీ, రిలయన్స్, దివిస్ ల్యాబ్స్ ఉన్నాయి.

రిలయన్స్ స్టాక్ ధర నేడు దాదాపు 1 శాతం లాభపడి రూ.1,947 వద్ద ట్రేడ్ అయింది.

ఈ స్టాక్స్ అదుర్స్

ఈ స్టాక్స్ అదుర్స్

నిఫ్టీ 50 నేడు 0.49 శాతం, నిఫ్టీ మిడ్ క్యాప్ 0.33 శాతం లాభపడ్డాయి. రంగాల వారీగా చూస్తే నిఫ్టీ ఆటో 0.05 శాతం, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ 0.05 శాతం నష్టపోయాయి.

నిఫ్టీ బ్యాంకు 0.44 శాతం, నిఫ్టీ ఎనర్జీ 1.34 శాతం, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ 0.22 శాతం, నిఫ్టీ ఐటీ 0.75 శాతం, నిఫ్టీ మీడియా 1.12 శాతం, నిఫ్టీ మెటల్ 0.96 శాతం, నిఫ్టీ ఫార్మా 1.19 శాతం, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంకు 1.65 శాతం, నిఫ్టీ రియాల్టీ 2.68 శాతం, నిఫ్టీ ప్రయివేటు బ్యాంకు 0.46 శాతం లాభపడ్డాయి.

బ్యాంకింగ్, ఫైనాన్షియల్, ఫార్మా, రియాల్టీ, మెటల్ స్టాక్స్ జంప్ చేశాయి.

పుంజుకుంటున్న కార్యకలాపాలు.. వృద్ధి

పుంజుకుంటున్న కార్యకలాపాలు.. వృద్ధి

అక్టోబర్ నెలలో 8 కీలక రంగాల వృద్ధి మైనస్ 2.5 శాతంగా నమోదయింది. సెప్టెంబర్ నెలలో ఇది మైనస్ 0.1 శాతంగా ఉంది. ఏప్రిల్ - అక్టోబర్ కాలంలో మైనస్ 13 శాతంగా ఉంది. గత ఏడాది ఇదే సమయంలో 0.3 శాతంగా ఉంది. ఈ ప్రభావం మార్కెట్లపై ఉంటుంది.

అమెరికా మార్కెట్లు నష్టాల్లో ఉండటంతో తొలుత స్వల్ప నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఆసియా, భారత మార్కెట్ స్వల్ప లాభాల్లో కనిపించింది. అమెరికాలో ఇన్వెస్టర్లు ప్రాఫిట్ బుకింగ్ చేశారు. దీంతో మార్కెట్లు నష్టపోయాయి.

ఆసియా మార్కెట్లు నిక్కీ, స్ట్రెయిట్స్ టైమ్స్, హాంగ్ షెంగ్, తైవాన్ వెయిటెడ్, కోస్పి, సెట్ కాంపోజిట్, జకర్తా కాంపోజిట్, షాంఘై కాంపోజిట్ లాభాల్లో ఉన్నాయి.

2020 ఏడాదిలో భారత జీడీపీ రేటును నోమురా హోల్డింగ్స్ సవరించింది. అంతకుముందు మైనస్ 9 శాతంగా అంచనా వేయగా, ఇప్పుడు మైనస్ 7.1 శాతానికి సవరించించింది. ఇతర రేటింగ్ ఏజెన్సీలు, బ్రోకరింగ్ సంస్థలు కూడా భారత ఆర్థిక వ్యవస్థ వేగంగా పుంజుకుంటుందని చెబుతున్నాయి.

English summary

సెన్సెక్స్@44,545: భారత మార్కెట్లు హైజంప్, అమెరికా మార్కెట్లో ప్రాఫిట్ బుకింగ్ | Sensex up 400 points, Nifty tests 13K: Nifty Metal jumps 1 percent

All the sectoral indices are trading in the green, with metal index up 1 percent. Shree Cements, GAIL, UltraTech Cement, Infosys and Grasim were among major gainers on the Nifty.
Story first published: Tuesday, December 1, 2020, 11:53 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X