For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

భారీ నష్టాల్లో మార్కెట్లు, సెన్సెక్స్ 370 పాయింట్లు డౌన్: కుప్పకూలిన రిలయన్స్, మెటల్, ఆటో

|

ముంబై: స్టాక్ మార్కెట్లు సోమవారం (అక్టోబర్ 26) భారీ నష్టాల్లో ఉన్నాయి. ఉదయం గం.9.20 సమయానికి సెన్సెక్స్ 35 పాయింట్లు(0.09 శాతం) నష్టపోయి 40,649.76 వద్ద, నిఫ్టీ 7 పాయింట్లు(0.06 శాతం) కోల్పోయి 11,937.40 వద్ద ప్రారంభమైంది. కొటక్ మహీంద్రా బ్యాంకుతో చర్చల వార్తల నేపథ్యంలో ఇండస్ఇండ్ బ్యాంకు స్టాక్స్ ఎగిశాయి. టెక్ మహీంద్ర షేర్లు 0.5 శాతం లాభపడ్డాయి. ఏడాది కాలంలో మహీంద్రా గ్రూప్ కంపెనీ ఆదాయం 3.32 శాతం, జూన్ క్వార్టర్‌తో 2.32 శాతం లభపడి రూ.9,371 కోట్లుగా ఉంది. మెటల్ సూచీలు 2 శాతం మేర, ఆటో సూచీ 1 శాతం మేర నష్టపోయింది.

3 నెలల గరిష్టానికి బంగారం ధర ప్రీమియం, పండుగపై ఆశలు3 నెలల గరిష్టానికి బంగారం ధర ప్రీమియం, పండుగపై ఆశలు

నష్టాల్లో మార్కెట్లు..

నష్టాల్లో మార్కెట్లు..

మధ్యాహ్నం గం.12.23 సమయానికి సెన్సెక్స్ 376 (0.91%) పాయింట్లు క్షీణించి 40,309 పాయింట్ల వద్ద, నిఫ్టీ 114 పాయింట్లు(0.96 శాతం) కోల్పోయి 11,815 పాయింట్ల వద్ద ట్రేడ్ అయింది.

డాలర్ మారకంతో రూపాయి 73.74 వద్ద ట్రేడ్ అయింది. డొమెస్టిక్ ఈక్విటీ మార్కెట్లో అమ్మకాలు పెరగడంతో ప్రభావం పడింది. శుక్రవారం 73.60 వద్ద క్లోజ్ అయింది.

టాప్ గెయినర్స్ జాబితాలో HDFC లైఫ్, అదానీ పోర్ట్స్, నెస్ట్లే, ఇండస్ ఇండ్ బ్యాంకు, పవర్ గ్రిడ్ కార్పోరేషన్ ఉన్నాయి.

టాప్ లూజర్స్ జాబితాలో జేఎస్‌డబ్ల్యు స్టీల్, హీరో మోటో కార్ప్, బజాజ్ ఆటో, హిండాల్కో, టాటా స్టీల్ ఉన్నాయి.

మోస్ట్ యాక్టివ్ స్టాక్స్‌లో రిలయన్స్, ఇండస్ ఇండ్ బ్యాంకు, టాటా మోటార్స్, టెక్ మహీంద్ర, బజాజ్ ఫైనాన్స్ ఉన్నాయి.

కుప్పకూలిన రిలయన్స్ షేర్

కుప్పకూలిన రిలయన్స్ షేర్

ఐటీ దిగ్గజం టీసీఎస్ వోల్ట్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. టీసీఎస్ స్టాక్స్ ఆర శాతం మేర లాభపడింది.

కొటక్ మహీంద్ర బ్యాంకు రెండో త్రైమాసికం ఫలితాలు దాదాపు 20 శాతం మేర క్షీణిస్తాయనే అంచనాలు ఉన్నాయి. దీంతో ఈ స్టాక్ 1 శాతానికి పైగా నష్టాల్లో ట్రేడ్ అయింది.

కొటక్ మహీంద్ర బ్యాంకు కొనుగోలుకు ప్రయత్నాలు చేస్తుందనే వార్తల నేపథ్యంలో ఇండస్ ఇండ్ బ్యాంకు షేర్ మూడు శాతానికి పైగా లాభపడింది.

రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ ఏకంగా 2.43 శాతం మేర క్షీణించి రూ.2,061కి పడిపోయింది.

నెస్ట్లే షేర్ ధర 0.23 శాతం లాభపడి రూ.106.56 వద్ద ట్రేడ్ అయింది. సెప్టెంబర్ త్రైమాసికంలో నెస్ట్లే ఇండియా నికర లాభం స్వల్పంగా 1.37 శాతం మేర క్షీణించింది.

వేదాంత స్టాక్స్ 0.048 శాతం క్షీణించి 104.70 వద్ద ట్రేడ్ అయింది.

జేఎస్‌డబ్ల్యు స్టీల్ ఏకీకృత నికర లాభం 37 శాతం క్షీణించడంతో ఈ స్టాక్ నష్టాల్లో ట్రేడ్ అయింది.

ఐసీఐసీఐ లాంబార్డ్ స్టాక్స్ 0.4 శాతం లాభపడ్డాయి.

ఐటీ స్టాక్స్ మిశ్రమంగా..

ఐటీ స్టాక్స్ మిశ్రమంగా..

నిఫ్టీ బ్యాంకు 0.05 శాతం, నిఫ్టీ ఆటో 0.98 శాతం, నిఫ్టీ ఐటీ 0.21 శాతం, నిఫ్టీ మీడియా 1.01 శాతం, నిఫ్టీ ఫార్మ 0.46 శాతం, నిఫ్టీ మెటల్ 2.03 శాతం, నిఫ్టీ రియాల్టీ 0.77 శాతం నష్టపోయింది.

నిఫ్టీ ఫైనాన్సియల్ సర్వీసెస్ స్వల్పంగా 0.07 శాతం, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ 0.14 శాతం, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంకు 0.48 శాతం క్షీణించింది.

ఇన్ఫోసిస్ స్టాక్ 0.58 శాతం క్షీణించి రూ.1,116, టెక్ మహీంద్ర 1.92 శాతం దిగజారి రూ.832, కోఫోర్జ్ 5 శాతం పడిపోయి రూ.2,261 వద్దకు పిపోయాయి. టీసీఎస్ స్టాక్ 0.52 శాతం ఎగబాకి రూ.2700 వద్ద, హెచ్‌సీఎల్ టెక్ 0.18 శాతం ఎగిసి రూ.844 వద్ద, విప్రో 0.058 శాతం లాభపడి 342 వద్ద, మైండ్ ట్రీ 0.29 శాతం ఎగిసి రూ.1397 వద్ద ట్రేడ్ అయి లాభాల్లో ఉన్నాయి.

English summary

భారీ నష్టాల్లో మార్కెట్లు, సెన్సెక్స్ 370 పాయింట్లు డౌన్: కుప్పకూలిన రిలయన్స్, మెటల్, ఆటో | Sensex tanks 350 points, Nifty sub-11,850: metals, auto stocks drag

Among sectors, metal index shed over 2 percent and auto index fell 1 percent, while buying seen in the PSU banking names.
Story first published: Monday, October 26, 2020, 12:29 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X