For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

49,000 క్రాస్ చేసిన సెన్సెక్స్, సరికొత్త రికార్డు: టీసీఎస్ అదుర్స్, రిలయన్స్ పతనం

|

ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం (జనవరి 11) భారీ లాభాల్లో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ మొదటిసారి 49000 మార్కును దాటింది. నిఫ్టీ 14,500కు సమీపంలో ఉంది. డాలర్ మారకంతో రూపాయి వ్యాల్యూ 73.24 వద్ద ట్రేడ్ అయింది. టెక్ కంపెనీల స్టాక్స్ భారీగా రాణిస్తున్నాయి. కరోనా కేసులు తగ్గడానికి తోడు టీకా పంపిణీ, విదేశీ నిధుల వరద, ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుందనే సంకేతాలు మార్కెట్లకు ఊతమిచ్చాయి. గత రెండు నెలలుగా సూచీలు సరికొత్త శిఖరాలను తాకుతున్నాయి. తాజాగా సెన్సెక్స్ 49వేల మార్కును దాటగా, నిఫ్టీ 14500ను క్రాస్ చేసింది.

ప్రాసెసింగ్ ఫీజు మాఫీ, వడ్డీరేటుపై రాయితీ: హోంలోన్ తీసుకుంటున్నారా, ఎస్బీఐ గుడ్‌న్యూస్ప్రాసెసింగ్ ఫీజు మాఫీ, వడ్డీరేటుపై రాయితీ: హోంలోన్ తీసుకుంటున్నారా, ఎస్బీఐ గుడ్‌న్యూస్

49000 మార్కు దాటిన సెన్సెక్స్

49000 మార్కు దాటిన సెన్సెక్స్

ఉదయం గం.09:16 సమయానికి సెన్సెక్స్ 329.33 పాయింట్లు(0.68%) లాభపడి 49,111.84 పాయింట్ల వద్ద, నిఫ్టీ 83.90 పాయింట్లు(0.58%) ప్రారంభమై 14,431.20 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. ఓ సమయంలో సెన్సెక్స్ 391 పాయింట్లు ఎగిసి 49,177 పాయింట్లను తాకింది. 1270 షేర్లు లాభాల్లో, 307 షేర్లు నష్టాల్లో ప్రారంభం కాగా, 86 షేర్లలో ఎలాంటి మార్పులేదు. ఐటీ సూచీ రెండు శాతం ఎగిసిపడగా, మెటల్ సూచీ 1 శాతం క్షీణించింది.

టాప్ గెయినర్స్, లూజర్స్

టాప్ గెయినర్స్, లూజర్స్

నేటి టాప్ గెయినర్స్ జాబితాలో ఇన్ఫోసిస్ 3.27 శాతం, HCL టెక్ 2.55 శాతం, విప్రో 2.28 శాతం, టాటా మోటార్స్ 2.17 శాతం, HUL 1.79 శాతం లాభపడ్డాయి.

టాప్ లూజర్స్ జాబితాలో టాటా స్టీల్ 2.64 శాతం, అదానీ పోర్ట్స్ 2.34 శాతం, JSW స్టీల్ 2.27 శాతం, హిండాల్కో 2.20 శాతం, ONGC 1.99 శాతం నష్టపోయాయి.

నేటి మోస్ట్ యాక్టివ్ స్టాక్స్‌లో టీసీఎస్, ఇన్ఫోసిస్, రిలయన్స్, విప్రో, టాటా మోటార్స్ ఉన్నాయి.

టీసీఎస్ షేర్ నేడు 1.64 శాతం ఎగబాకి రూ.3172 వద్ద ట్రేడ్ అయింది.

రిలయన్స్ మాత్రం 0.65 శాతం పడిపోయి రూ.1921 వద్ద ట్రేడ్ అయింది.

టాప్ గెయినర్స్, లూజర్స్

టాప్ గెయినర్స్, లూజర్స్

నిఫ్టీ 50 స్టాక్స్ 0.49 శాతం లాభపడగా, నిఫ్టీ మిడ్ క్యాప్ 0.99 శాతం నష్టపోయాయి. నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ 0.11 శాతం, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ 1.25 శాతం, నిఫ్టీ ఐటీ 1.56 శాతం, నిఫ్టీ ఫార్మా 0.39 శాతం లాభపడ్డాయి. నిఫ్టీ ఆటో 0.03 శాతం, నిఫ్టీ బ్యాంకు 0.51 శాతం, నిఫ్టీ ఎనర్జీ 0.85 శాతం, నిఫ్టీ మీడియా 1.13 శాతం, నిఫ్టీ మెటల్ 1.79 శాతం, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంకు 1.64 శాతం, నిఫ్టీ రియాల్టీ 0.20 శాతం, నిఫ్టీ ప్రయివేటు బ్యాంకు 0.54 శాతం నష్టపోయాయి.

English summary

49,000 క్రాస్ చేసిన సెన్సెక్స్, సరికొత్త రికార్డు: టీసీఎస్ అదుర్స్, రిలయన్స్ పతనం | Sensex surges over 300 points to record high, Nifty above 14,400

Among Nifty stocks, Infosys was the top gainer, up 4% followed by Wipro and HCL Tech, which rallied 3.09% and 2.74% respectively.
Story first published: Monday, January 11, 2021, 11:18 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X