For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నిర్మలా సీతారామన్ ప్యాకేజీ ప్రకటించినా..నష్టాల్లో మార్కెట్లు:దెబ్బకొట్టిన పైనాన్షియల్ స్టాక్స్

|

ముంబై: స్టాక్ మార్కెట్లు గురువారం (నవంబర్ 12) నష్టాల్లో ముగిశాయి. వరుస లాభాల్లో ఉన్న దేశీయ స్టాక్ మార్కెట్లకు నేడు బ్రేక్ పడింది. ఉదయం నుండి బ్యాంకింగ్, ఫైనాన్షియల్ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆత్మనిర్భర్ భారత్ 3.0 పేరిట ఉద్దీపనలు ప్రకటించారు. ఈ ప్రభావం మార్కెట్లపై కనిపించలేదు. ఎనిమిది రోజులుగా లాభాల్లో ఉన్న మార్కెట్లు ఈ వారంలో మొదటి మూడు సెషన్‌లలో రికార్డులు నెలకొల్పింది. మిడ్ క్యాప్, స్మాల్ క్యూప్ సూచీలు 0.5 శాతం చొప్పున ఎగిశాయి. కానీ ఈ రోజు సూచీలు నష్టపోయాయి.

ఒత్తిడిలోని 26రంగాలకు భారీ ప్యాకేజీ: నిర్మలా సీతారామన్, 5 ఏళ్ల కాలపరిమితి, మార్చి 31 వరకు గడువుఒత్తిడిలోని 26రంగాలకు భారీ ప్యాకేజీ: నిర్మలా సీతారామన్, 5 ఏళ్ల కాలపరిమితి, మార్చి 31 వరకు గడువు

మార్కెట్‌ను ఆదుకోని నిర్మల ప్యాకేజీ

మార్కెట్‌ను ఆదుకోని నిర్మల ప్యాకేజీ

నేడు సెన్సెక్స్ 236.48 పాయింట్లు(0.54%) నష్టపోయి 43,357.19 పాయింట్ల వద్ద, నిఫ్టీ 58.40 పాయింట్లు(0.46%) నష్టపోయి 12,690.80 వద్ద ముగిసింది. 1531 షేర్లు లాభాల్లో, 1117 షేర్లు నష్టాల్లో ముగియగా, 185 షేర్లలో ఎలాంటి మార్పులేదు.

డాలర్ మారకంతో రూపాయి 74.66 వద్ద క్లోజ్ అయింది. రూపాయి 74.44 వద్ద ప్రారంభమైంది. క్రితం సెషన్లో 74.37 వద్ద క్లోజ్ అయింది.

నిర్మలా సీతారామన్ భారీ ప్యాకేజీ మార్కెట్లకు ఏమాత్రం ఊతమివ్వలేకపోయింది.

నష్టాల్లో ముగిసినప్పటికీ సెన్సెక్స్ 43వేల పాయింట్లకు పైనే ఉంది. ఉదయం నష్టాల్లోనే ప్రారంభమైన మార్కెట్లు ఏ దశలోను కోలుకున్న సంకేతాలు కనిపించలేదు. నిర్మలా సీతారామన్ ఆర్థిక ప్యాకేజీని ప్రకటించిన సమయంలో నేటి కనిష్టం 43,136కు పడిపోయింది.

రిలయన్స్ మళ్లీ పతనం

రిలయన్స్ మళ్లీ పతనం

నేడు టాప్ గెయినర్స్ జాబితాలో గ్రాసీమ్ 2.97 శాతం, HUL 2.86 శాతం, శ్రీసిమెంట్స్ 2.51 శాతం, హిండాల్కో 2.23 శాతం, ఐటీసీ 1.46 శాతం లాభాల్లో ముగిశాయి.

టాప్ లూజర్స్ జాబితాలో SBI 3.16 శాతం, కోల్ ఇండియా 2.98 శాతం, కొటక్ మహీంద్ర 2.94 శాతం, ఇండస్ఇండ్ బ్యాంకు 2.38 శాతం, ఎన్టీపీసీ 2.26 శాతం నష్టపోయాయి.

మోస్ట్ యాక్టివ్ స్టాక్స్‌లో రిలయన్స్, బజాజ్ ఫైనాన్స్, ఇండస్ఇండ్ బ్యాంకు, యాక్సిస్ బ్యాంకు, హెచ్‌డీఎఫ్‌సీ ఉన్నాయి.

రిలయన్స్ ఇండస్ట్రీస్ స్టాక్ రూ.2000 దిగువన ట్రేడ్ అయింది. రిలయన్స్ షేర్ నేడు ఓ సమయంలో రూ.2,005ను తాకింది. ఆ తర్వాత ఏ దశలోను రూ.2000 మార్కును చేరుకోలేదు. నిన్న రూ.1997 వద్ద క్లోజ్ కాగా, నేడు 0.77 శాతం క్షీణించి రూ.1982 వద్ద క్లోజ్ అయింది.

రంగాలవారీగా...

రంగాలవారీగా...

టాప్ 10 నిఫ్టీ లూజర్స్‌లో 6 ఫైనాన్షియల్స్ కావడం గమనార్హం. ఎస్బీఐ, కొటక్ మహీంద్ర, ఇండస్ ఇండ్ ఉన్నాయి. నిఫ్టీ బ్యాంక్ 566 పాయింట్లు నష్టపోయి 28,279 వద్ద ముగిసింది. మిడ్ క్యాప్ 108 పాయింట్లు నష్టపోయి 18,183 వద్ద క్లోజ్ అయింది.

నిఫ్టీ ఆటో 0.35 శాతం, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ 1.28 శాతం, నిఫ్టీ ఐటీ 0.15 శాతం, నిఫ్టీ మీడియా 0.66 శాతం, నిఫ్టీ ఫార్మా 0.26 శాతం, నిఫ్టీ రియాల్టీ 0.74 శాతం లాభాల్లో క్లోజ్ అయ్యాయి.

నిఫ్టీ బ్యాంకు 1.96 శాతం, నిఫ్టీ ఎనర్జీ 0.19 శాతం, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ 1.06 శాతం, నిఫ్టీ మెటల్ 0.31 శాతం, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంకు 2.29 శాతం, నిఫ్టీ ప్రయివేటు బ్యాంకు 1.82 శాతం నష్టాల్లో ముగిశాయి.

ఫైనాన్షియల్ స్టాక్స్ భారీగా దెబ్బకొట్టాయి. దీనికి తోడు రిలయన్స్ 0.77 శాతం నష్టపోవడం దెబ్బతీసింది.

English summary

నిర్మలా సీతారామన్ ప్యాకేజీ ప్రకటించినా..నష్టాల్లో మార్కెట్లు:దెబ్బకొట్టిన పైనాన్షియల్ స్టాక్స్ | Sensex snaps 8 day rally: falls 236 points despite FM sops, Nifty below 12,700

SBI, Coal India, Kotak Mahindra Bank, IndusInd Bank and NTPC were among major losers on the Nifty, while gainers were Grasim, HUL, Shree Cements, Hindalco and ITC.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X