For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

10వరోజు భారీ నష్టాల్లోకి... కిందకు లాగిన ఐటి, బ్యాంకింగ్: దెబ్బకొట్టిన విప్రో ఫలితాలు!

|

ముంబై: స్టాక్ మార్కెట్లు బుధవారం (అక్టోబర్ 14) నష్టాల్లో ప్రారంభమయ్యాయి. ఉదయం గం.9.16 సమయానికి సెన్సెక్స్ 41.48 పాయింట్లు (0.10%) నష్టపోయి 40,584.03 వద్ద, నిఫ్టీ 21.10 పాయింట్లు (0.18%) పాయింట్లు క్షీణించి 11,913.40 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. గం.10.21 సమయానికి సెన్సెక్స్ 235 పాయింట్లు నష్టపోయి 40,390 పాయింట్ల వద్ద ట్రేడ్ అయింది. 9 రోజుల పాటు వరుస లాభాలు చూసిన మార్కెట్లు, పదో రోజు నష్టాల్లో ప్రారంభమయ్యాయి.
429 షేర్లు లాభాల్లో, 477 షేర్లు నష్టాల్లో, 52 షేర్లలో ఎలాంటి మార్పు లేకుండా ప్రారంభమైంది. నిన్న విప్రో సెప్టెంబర్ త్రైమాసిక ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాల అనంతరం ఈరోజు ఈ స్టాక్ నష్టాల్లోకి వెళ్ళింది. నేడు ఇన్ఫోసిస్ ఫలితాలు వెల్లడి కానున్నాయి. బ్యాంకింగ్ స్టాక్స్ ఈ రోజు కూడా నష్టాల్లోనే ఉన్నాయి.

ఉద్యోగులకు ఆఫర్: రూ.50వేలు పొందాలంటే రూ.1.18 లక్షలు ఖర్చు.. LTC స్కీం ప్రయోజనకరమేనా?ఉద్యోగులకు ఆఫర్: రూ.50వేలు పొందాలంటే రూ.1.18 లక్షలు ఖర్చు.. LTC స్కీం ప్రయోజనకరమేనా?

మార్కెట్లను కిందకు లాగిన ఐటీ, బ్యాంకింగ్ స్టాక్స్

మార్కెట్లను కిందకు లాగిన ఐటీ, బ్యాంకింగ్ స్టాక్స్

ఉదయం గం.10 సమయానికి నిఫ్టీ బ్యాంకు 1 శాతానికి పైగా నష్టపోయింది. పీఎన్‌బీ, కొటక్ మహీంద్ర, ఇండస్ ఇండ్, హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ, యాక్సిస్, ఎస్బీఐ, ఫెడరల్ బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఆర్బీఎల్, బంధన్ బ్యాంకు.. అన్ని స్టాక్స్ కూడా 0.36 శాతం నుండి 1.91 శాతం మేర నష్టాల్లో ఉన్నాయి.

ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంకు, బంధన్ బ్యాంకు, ఆర్బీఎల్ బ్యాంకు భారీ నష్టాల్లో ట్రేడ్ అయ్యాయి.

నిఫ్టీ బ్యాంకు 1 శాతం, నిఫ్టీ ఆటో 0.39 శాతం, నిఫ్టీ ఫైనాన్స్ సర్వీసెస్ 0.75 శాతం, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ 0.30 శాతం, నిఫ్టీ ఐటీ 0.99 శాతం, నిఫ్టీ మీడియా 0.63 శాతం, నిఫ్టీ మెటల్ 0.89 శాతం, నిఫ్టీ ఫార్మా 0.80 శాతం, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంకులు 0.81 శాతం, నిఫ్టీ ప్రయివేటు బ్యాంకు 1.09 శాతం, నిఫ్టీ రియాల్టీ 0.80 శాతం క్షీణించింది. నిఫ్టీ ఐటీ కూడా నష్టాల్లో ఉంది.

నిఫ్టీ బ్యాంకు, నిఫ్టీ ఐటీ రంగాలు మార్కెట్లను కిందకు ఎక్కువగా లాగాయి.

పెరిగిన అమ్మకాలు

పెరిగిన అమ్మకాలు

టాప్ గెయినర్స్ జాబితాలో టైటాన్ కంపెనీ, బజాజ్ ఫిన్ సర్వ్, టాటా స్టీల్, బజాజ్ పైనాన్స్, ఏషియన్ పేయింట్స్ ఉండగా, టాప్ లూజర్స్ జాబితాలో విప్రో, కోల్ ఇండియా, ఎన్టీపీసీ, ఓఎన్జీసీ, బీపీసీఎల్ ఉన్నాయి.

మోస్ట్ యాక్టివ్ స్టాక్స్‌లో విప్రో, రిలయన్స్, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్, బజాజ్ ఫైనాన్స్ ఉన్నాయి.

విప్రో ఫలితాల అనంతరం విప్రో, ఇన్ఫోసిస్ వంటి స్టాక్స్ అమ్మకాలు పెరిగాయి.

రిలయన్స్ షేర్ధర 0.96 శతం ఎగిసి రూ.2,282.90 వద్ద ట్రేడ్ అయింది. జియో సబ్‌స్క్రైబర్లు పెరగడంతో పాటు పెట్టుబడులు వస్తుండటంతో ఈ స్టాక్ కొనుగోళ్లు పెరుగుతున్నాయి.

డాలర్ మారకంతో రూపాయి 73.39 వద్ద ప్రారంభమైంది.

ఐటీ స్టాక్స్ నేలచూపులు

ఐటీ స్టాక్స్ నేలచూపులు

ఐటీ స్టాక్స్‌లో టీసీఎస్ షేర్ ధర 0.83 శాతం క్షీణించి రూ.2,802 వద్ద ట్రేడ్ అయింది.

హెచ్‌సీఎల్ టెక్ షేర్ 1.84 శాతం, ఇన్ఫోసిస్ షేర్ 1.36 శాతం, టెక్ మహీంద్ర షేర్ 1.58శాతం, విప్రో షేర్ 6.42 శాతం, మైండ్ ట్రీ షేర్ 1.84 శాతం, కోఫోర్జ్ షేర్ 4.84 శాతం మేర క్షీణించింది.

టీసీఎస్ ఫలితాల అనంతరం ఐటీ స్టాక్స్ ఎగిసిపడితే, విప్రో ఫలితాల తర్వాత ఐటీ స్టాక్స్ నేలచూపులు చూస్తున్నాయి.

ఈ నేపథ్యంలో ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్ స్టాక్స్ వైపు ఇన్వెస్టర్లు దృష్టి సారించారు.

English summary

10వరోజు భారీ నష్టాల్లోకి... కిందకు లాగిన ఐటి, బ్యాంకింగ్: దెబ్బకొట్టిన విప్రో ఫలితాలు! | Sensex slips 170 points: Nifty below 11,900, Wipro down 6 percent

Benchmark indices are trading lower following weak global markets. IT and banking names remained under pressure.
Story first published: Wednesday, October 14, 2020, 10:30 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X