ముంబై: స్టాక్ మార్కెట్లు కొత్త ఏడాది(2021) లాభాల్లో ప్రారంభమయ్యాయి. జనవరి 1, శుక్రవారం ఉదయం నిఫ్టీ 14,000 మార్కును క్రాస్ చేయగా, సెన్సెక్స్ 48,000 పాయింట్ల దిశగా సాగుతోంది. బ్యాంకింగ్ రంగం జంప్ చేయడంతో మార్కెట్లు అదరగొట్టాయి. ఉదయం గం.9.18 సమయానికి సెన్సెక్స్ 120.70 పాయింట్లు(0.25%) లాభపడి 47,872.03 పాయింట్ల వద్ద, నిఫ్టీ 35.30 పాయింట్లు(0.25%) ఎగిసి 14,017.10 పాయింట్ల వద్ద ప్రారంభమైంది.
903 షేర్లు లాభాల్లో, 249 షేర్లు నష్టాల్లో ప్రారంభం కాగా, 30 షేర్లలో ఎలాంటి మార్పులేదు. దాదాపు అన్ని రంగాలు కూడా లాభాల్లో ఉన్నాయి. ఇక, డాలర్ మారకంతో రూపాయి 73.09 వద్ద ప్రారంభమైంది. డిసెంబర్ 31న రూపాయి 73.07 వద్ద క్లోజ్ అయింది.

టాప్ గెయినర్స్, లూజర్స్
మధ్యాహ్నం గం.11.45 సమయానికి సెన్సెక్స్ 145 పాయింట్ల లాభంతో ఉంది. ఓ సమయంలో 47,950 సమీపంలోకి చేరుకొని, కొత్త ఏడాదిలో 48,000 దిశగా కనిపించింది. అయితే త్వరలో ఈ మార్కు చేరుకునే అవకాశముంది. నిఫ్టీ 37 పాయింట్ల లాభంతో ఉంది. క్రితం సెషన్లో 13981 వద్ద క్లోజ్ అయిన నిఫ్టీ నేడు ప్రారంభం నుండి 14000కు పైనే ఉంది. ఓ సమయంలో 14030 పాయింట్లను క్రాస్ చేసింది.
నేటి టాప్ గెయినర్స్ జాబితాలో మహీంద్రా అండ్ మహీంద్రా 2.70 శాతం, టీసీఎస్ 2.09 శాతం, UPL 1.43 శాతం, మారుతీ సుజుకీ 1.14 శాతం, SBI 1.07 శాతం లాభపడ్డాయి.
టాప్ లూజర్స్ జాబితాలో ఐసీఐసీఐ బ్యాంకు 0.95 శాతం, హిండాల్కో 0.87 శాతం, SBI లైఫ్ ఇన్సురా 0.89 శాతం, గ్రాసీమ్ 0.41 శాతం, పవర్ గ్రిడ్ కార్ప్ 0.40 శాతం నష్టపోయాయి.మోస్ట్ యాక్టివ్ స్టాక్స్‌లో రిలయన్స్, టీసీఎస్, మహీంద్రా అండ్ మహీంద్రా, టాటా స్టీల్, మారుతీ సుజుకీ ఉన్నాయి.

అందుకే జంప్
ఆసియా మార్కెట్లకు నేడు సెలవు దినం. క్రమంగా వ్యాక్సీన్ అందుబాటులోకి వస్తుండటం, పలు దేశాల్లో వ్యాక్సినేషన్ ప్రారంభం కావడంతో కొత్త సంవత్సరంలో పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకుంటాయనే అంచనాలతో సూచీలు బలపడుతున్నాయి. కరోనా కట్టడికి ఫైజర్ అభివృద్ధి చేసిన వ్యాక్సిన్‌కు ప్రపంచ ఆరోగ్య సంస్థ పచ్చజెండా ఊపడంతో సెంటిమెంట్ మరింత బలపడింది.

రంగాలవారీగా...
నిఫ్టీ 50 స్టాక్స్ 0.22 శాతం, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీలు 1.04 శాతం మేర లాభపడ్డాయి. రంగాలవారీగా చూస్తే నిఫ్టీ ఆటో 0.82 శాతం, నిఫ్టీ ఎనర్జీ 0.25 శాతం, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ 0.24 శాతం, నిఫ్టీ ఐటీ 0.77 శాతం, నిఫ్టీ మీడియా 0.71 శాతం, నిఫ్టీ ఫార్మా 0.44 శాతం, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంకు 2.07 శాతం,
నిఫ్టీ మెటల్ స్వల్పంగా లాభపడింది.
నిఫ్టీ బ్యాంకు 0.01 శాతం, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ 0.03 శాతం, నిఫ్టీ రియాల్టీ 0.10 శాతం, నిఫ్టీ ప్రయివేటు బ్యాంకు 0.24 శాతం నష్టపోయాయి.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..



Click it and Unblock the Notifications