For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఒక్కరోజులో రూ.4.60 లక్షల కోట్ల పెట్టుబడులు హుష్‌కాకి!

|

ముంబై: స్టాక్ మార్కెట్లు సోమవారం(సెప్టెంబర్ 21) కుప్పకూలాయి. సెన్సెక్స్ 811.68 పాయింట్లు (2.09 శాతం), నిఫ్టీ 282.75 పాయింట్లు(2.46 శాతం) నష్టపోయి 11,222.20 పాయింట్ల వద్ద ముగిసింది. దీంతో ఇన్వెస్టర్లు ఈ రోజు భారీగా నష్టపోయారు. అంతర్జాతీయ మార్కెట్లు బలహీనంగా ఉండటం, కరోనా కేసులు పెరుగుతుండటం, మిడ్, స్మాల్ క్యాప్స్ కరెక్షన్ వంటి వివిధ కారణాలతో మార్కెట్లు నష్టపోయాయి. వ్యవసాయ బిల్లుపై రాజ్యసభలో కేంద్రప్రభుత్వానికి సవాళ్లు ఎదురు కావడం, చైనాతో సరిహద్దు వివాదాలు వంటి అంశాలు మార్కెట్ సెంటిమెంటును దెబ్బతీశాయి.

కుప్పకూలిన మార్కెట్లు: సెన్సెక్స్ 812 పాయింట్లు డౌన్, కారణాలు ఇవే..కుప్పకూలిన మార్కెట్లు: సెన్సెక్స్ 812 పాయింట్లు డౌన్, కారణాలు ఇవే..

రూ.4.58 లక్షల కోట్ల సంపద ఫట్

రూ.4.58 లక్షల కోట్ల సంపద ఫట్

మార్కెట్లు కుప్పకూలడంతో ఈరోజు ఇన్వెస్టర్లు భారీగా నష్టపోయారు. రూ.4.58 లక్షల కోట్ల మేర ఇన్వెస్టర్ల సంపద హరించుకుపోయింది. దీంతో బిఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.154.42 కోట్లకు క్షీణించింది. మార్కెట్లో భయాల నేపథ్యంలో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ బలహీనపడింది. మధ్యాహ్నం వరకు మార్కెట్లు ఊగిసలాటలో ఉన్నాయి. చివరికి అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి.

నిలబెట్టుకోలేకపోయిన ఐటీ స్టాక్స్

నిలబెట్టుకోలేకపోయిన ఐటీ స్టాక్స్

ఈ నెలలో సెన్సెక్స్ ఒకరోజులో కుప్పకూలడం ఇదే గరిష్టం. ప్రధానంగా అంతర్జాతీయ మార్కెట్ నష్టాలు, కరోనా కేసులు పెరగడం మార్కెట్ పైన ప్రభావం చూపింది. బీఎస్ఈ మార్కెట్ క్యాప్ ఈరోజు ఒక్కరోజే రూ.4.5 లక్షల కోట్ల మేర నష్టపోయింది. సెన్సెక్స్ 38000 కాస్త పైన ఉండగా, నిఫ్టీ 11,300 దిగువకు వచ్చింది. సెన్సెక్స్, నిఫ్టీ 2 శాతం చొప్పున నష్టపోయాయి. మిడ్ క్యాప్ 3.6 శాతం, నిఫ్టీ బ్యాంక్ 3 శాతం కోల్పోయింది. 47 నిఫ్టీ స్టాక్స్ నష్టాల్లో ముగిశాయి. ఇండస్ ఇండ్ బ్యాంకు, టాటా మోటార్స్, హిండాల్కోలు టాప్ లూజర్స్‌గా నిలిచాయి. నిఫ్టీ బ్యాంకు 646 పాయింట్లు నష్టపోయింది. మిడ్ క్యాప్ ఇండెక్స్ 634 పాయింట్లు కోల్పోయింది.

అన్ని రంగాలు కూడా నష్టాల్లోనే ముగిశాయి.

ఐటీ స్టాక్స్ ప్రారంభంలో భారీ లాభాల్లో కనిపించినప్పటికీ, చివరకు లాభాలను నిలబెట్టుకోలేదు. హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ 6 శాతం మేర నష్టపోయింది. విప్రో 4 శాతం కోల్పోయింది.

FPI

FPI

నగదు విభాగంలో వారంతంలో FPIలు రూ.205 కోట్లు ఇన్వెస్ట్ చేయగా, దేశీ ఫండ్స్(DII) రూ.101 కోట్ల అమ్మకాలు చేపట్టాయి. గురువారం FPIలు రూ.250 కోట్లు, DIIలు రూ.1,068 కోట్లు చొప్పున పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. బుధవారం FPIలు రూ.265 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేశాయి. DIIలు రూ.212 కోట్ల అమ్మకాలు చేపట్టాయి.

English summary

ఒక్కరోజులో రూ.4.60 లక్షల కోట్ల పెట్టుబడులు హుష్‌కాకి! | Sensex's 812 point crash, Investors lose Rs 4.60 lakh crore

Surging virus cases in countries that seemingly had controlled the outbreak hit the market sentiments on Dalal Street with domestic equity indices racing to their third close in the red in as many days on Monday.
Story first published: Monday, September 21, 2020, 18:43 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X