For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

FII జోరు.. ప్రాఫిట్ బుకింగ్ దెబ్బ: ఒక్కరోజులో రూ.2.32 లక్షల కోట్ల సంపద ఆవిరి

|

ముంబై: స్టాక్ మార్కెట్లు బుధవారం (నవంబర్ 25) భారీ నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 695 పాయింట్లు (1.96 శాతం) క్షీణించి 43,828 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది. సెన్సెక్స్ నేడు 44,828 పాయింట్ల వద్ద గరిష్టాన్ని తాకింది. ఆ తర్వాత దాదాపు 1,000 పాయింట్లు నష్టపోయి 43,828 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 196.75 పాయింట్లు (1.51 శాతం) కోల్పోయి 12,858.40 పాయింట్ల వద్ద ముగిసింది. గత కొద్ది రోజులుగా 43,000ను, ఆ తర్వాత 44,000 మార్కును వేగంగా అందుకున్న సెన్సెక్స్, నిన్న 13వేల మార్కును తాకిన నిఫ్టీలు ఇప్పుడు ఆ మార్క్ దిగువకు వచ్చాయి. దీంతో ఇన్వెస్టర్లు భారీగా సంపదను కోల్పోయారు.

<strong>ప్రాఫిట్ బుకింగ్ ఎఫెక్ట్, మార్కెట్ భారీ పతనం: సెన్సెక్స్ 695 పాయింట్లు డౌన్</strong>ప్రాఫిట్ బుకింగ్ ఎఫెక్ట్, మార్కెట్ భారీ పతనం: సెన్సెక్స్ 695 పాయింట్లు డౌన్

FIIల జోరు, ఎగిసిపడిన మార్కెట్లు

FIIల జోరు, ఎగిసిపడిన మార్కెట్లు

బుధవారం సెన్సెక్స్ దాదాపు 700 పాయింట్లు నష్టపోవడంతో ఇన్వెస్టర్లు సంపద ఈ ఒక్కరోజు రూ.2.32 లక్షల కోట్లు హరించుకుపోయింది. దీంతో బీఎస్ఈ నమోదిత కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.174.91 కోట్ల నుండి రూ.172.59 లక్షల కోట్లకు పడిపోయింది. సెన్సెక్స్ 1000 పాయింట్లకు పైగా స్థాయిలో ట్రేడ్ అయింది. ఈ నెలలో సూచీలు 11 శాతానికి పైగా ఎగిశాయి. ఇందుకు FII పెట్టుబడులు పెద్ద ఎత్తున రావడమే కారణం. నవంబర్ నెలలో డొమెస్టిక్ ఈక్విటీ మార్కెట్లో రూ.53,167 కోట్ల FIIలు వచ్చాయి. దీంతో మార్కెట్లు ఎగిశాయి.

నేడు దిద్దుబాటు

నేడు దిద్దుబాటు

ఇటీవలి వరకు రికార్డుస్థాయికి చేరుకుంటూ వస్తున్న మార్కెట్లు నేడు ప్రాఫిట్ బుకింగ్ కారణంగా స్వల్ప దిద్దుబాటు చోటు చేసుకుందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఈ వారంలో రెండు రోజులు మంచి లాభాల్లో ముగిశాయని, ఈ రోజు ప్రాఫిట్ బుకింగ్ ముందు అంచనా వేసిందేనని చెబుతున్నారు. షార్ట్ టర్మ్‌లో ప్రాఫిట్ బుకింగ్ ఉంటుందని చెబుతున్నారు. విజయవంతంగా నిఫ్టీ 13,000 మార్కును తాకిందని, 13,100 నుండి 13,200 మధ్య నిరోధకస్థాయి నేపథ్యంలో ప్రాఫిట్ బుకింగ్ ఉంటుందన్నారు. 12800 మద్దతు ధరగా పేర్కొంటున్నారు.

బ్యాంకెక్స్ 1.55 శాతం

బ్యాంకెక్స్ 1.55 శాతం

నేడు కొటక్ మహీంద్ర, ఐచర్ మోటార్స్, భారతీ ఎయిర్ టెల్, యాక్సిస్ బ్యాంకు, ఏషియన్ పేయింట్స్ భారీగా నష్టపోయాయ. బీఎస్ఈ మిడ్ క్యాప్ సూచీ 235.58 పాయింట్లు పడిపోయి 16,505 పాయింట్ల వద్ద ట్రేడ్ అయింది. సూచీలో గరిష్ట వెయిటేజీ కలిగిన బీఎస్ఈ బ్యాంకెక్స్ 1.55 శాతం, ఐటీ సహా ఇతర సూచీలు 1.46 శాతం నష్టపోయాయి. ఆటో సూచీ 1.26 శాతం పడిపోయింది.

English summary

FII జోరు.. ప్రాఫిట్ బుకింగ్ దెబ్బ: ఒక్కరోజులో రూ.2.32 లక్షల కోట్ల సంపద ఆవిరి | Sensex plunges 695 points, Rs 2.32 lakh crore investors wealth wiped out

The BSE Sensex and the Nifty ended sharply lower on Wednesday as profit booking was witnessed across the sectors after a record-breaking rally. The Sensex closed 694.92 points or 1.56% lower at 43,828.10, wiping out Rs 2.32 lakh of investors' wealth.
Story first published: Wednesday, November 25, 2020, 18:34 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X