For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ప్రాఫిట్ బుకింగ్ ఎఫెక్ట్, మార్కెట్ భారీ పతనం: సెన్సెక్స్ 695 పాయింట్లు డౌన్

|

ముంబై: భారత స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. వరుస భారీ లాభాల తర్వాత బుధవారం (నవంబర్ 25) ఒక్కసారిగా పతనమయ్యాయి. అమ్మకాలు వెల్లువెత్తడంతో ఉదయం లాభాలతో ప్రారంభమైన మార్కెట్లు అంతకంతకు పడిపోయాయి. ఉదయం సెన్సెక్స్ 300 పాయింట్లకు పైగా లాభంతో ప్రారంభమై ఆల్ టైం గరిష్టం 44,825.03ను, నిఫ్టీ 87 పాయింట్లు ఎగిసి 13,143 పాయింట్లను తాకింది. లాభాలు ఓ గంట మాత్రమే కనిపించాయి. అమ్మకాలు వెల్లువెత్తడంతో లాభాలు క్రమంగా క్షీణించి, ఉదయం గం.10.30 సమయానికి నష్టాల్లోకి వెళ్ళింది. ఆ తర్వాత ఎక్కడా కోలుకోలేదు. చివరి గంటలో అమ్మకాలు జోరందుకోవడంతో సెన్సెక్స్ 44వేల దిగువకు పడిపోయింది. నిఫ్టీ కూడా 13వేల పాయింట్ల కిందకు వచ్చింది.

ట్రంప్, కరోనా వ్యాక్సీన్ ఎఫెక్ట్: గ్లోబల్ మార్కెట్ జంప్, 8 నెలల గరిష్టానికి చమురు ధరలుట్రంప్, కరోనా వ్యాక్సీన్ ఎఫెక్ట్: గ్లోబల్ మార్కెట్ జంప్, 8 నెలల గరిష్టానికి చమురు ధరలు

మార్కెట్ భారీ పతనం.. ప్రాఫిట్ బుకింగ్

మార్కెట్ భారీ పతనం.. ప్రాఫిట్ బుకింగ్

సెన్సెక్స్ 695 పాయింట్లు (1.96 శాతం) క్షీణించి 43,828 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది. సెన్సెక్స్ నేటి గరిష్టం (44,828) పాయింట్ల నుండి దాదాపు 1,000 పాయింట్లు నష్టపోయింది. నిఫ్టీ 196.75 పాయింట్లు (1.51 శాతం) కోల్పోయి 12,858.40 పాయింట్ల వద్ద ముగిసింది. బీఎస్ఈ మిడ్ క్యాప్ సూచీ 1.76 శాతం, స్మాల్ క్యాప్ సూచీ 1.13 శాతం నష్టపోయింది. రియాల్టీ, బ్యాంకెక్స్, టెలికం రంగాలు భారీగా పతనమయ్యాయి.

నిఫ్టీ 50 1.51 శాతం పతనమైంది. ఓఎన్జీసీ, అధానీ పోర్ట్స్, ఎస్బీఐ లైఫ్, కోల్ ఇండియా, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్, పవర్ గ్రిడ్ మాత్రమే లాభపడ్డాయి. ఐచర్ మోటార్స్, యాక్సిస్ బ్యాంకు, కొటక్ బ్యాంకు, సన్ ఫార్మా, బజాజ్ ఫైనాన్స్, ఏషియన్ పేయింట్స్, శ్రీ సిమెంట్స్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు భారీగా నష్టపోయాయి. ఈ స్టాక్స్ అన్నీ ఇటీవల ఎగిశాయి. ఈ రోజు ప్రాఫిట్ బుకింగ్ కనిపించింది. దీంతో ఈ స్టాక్స్ భారీగా నష్టపోయాయి.

PSU బ్యాంకు మినహా అన్నీ పతనం

PSU బ్యాంకు మినహా అన్నీ పతనం

రంగాలవారీగా చూస్తే నిఫ్టీ ఆటో 1.68 శాతం, నిఫ్టీ బ్యాంకు 1.82 శాతం, నిఫ్టీ ఎనర్జీ 0.44 శాతం, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ 1.85 శాతం, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ 1.23 శాతం, నిఫ్టీ ఐటీ 1.62 శాతం, నిఫ్టీ మీడియా 0.37 శాతం, నిఫ్టీ మెటల్ 0.80 శాతం, నిఫ్టీ ఫార్మా 2.07 శాతం, నిఫ్టీ రియాల్టీ 2.25 శాతం, నిఫ్టీ ప్రయివేటు బ్యాంకు 1.87 శాతం నష్టపోయాయి.

కేవలం నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంకు 1.80 శాతం లాభపడింది.

టాప్ గెయినర్స్ జాబితాలో ONGC 6.18 శాతం, GAIL 1.99 శాతం, అదానీ పోర్ట్స్ 1.71 శాతం, SBI లైఫ్ ఇన్సురెన్స్ 1.20 శాతం, కోల్ ఇండియా 0.57 శాతం లాభపడ్డాయి.

టాప్ లూజర్స్ జాబితాలో ఐచర్ మోటార్స్ 3.65 శాతం, కొటక్ మహీంద్ర బ్యాంకు 3.24, యాక్సిస్ బ్యాంకు 3.20 శాతం, సన్ ఫార్మా 2.68 శాతం, బజాజ్ ఫైనాన్స్ 2.51 శాతం నష్టపోయాయి.

మోస్ట్ యాక్టివ్ స్టాక్స్‌లో రిలయన్స్, బజాజ్ ఫైనాన్స్, యాక్సిస్ బ్యాంకు, ఇండస్ ఇండ్ బ్యాంకు, ఎస్బీఐ ఉన్నాయి.

రిలయన్స్ స్టాక్ ప్రారంభంలో ఎగిసినప్పటికీ, చివరకు మార్కెట్ జోరుతో పాటు నష్టాల్లో ముగిసింది. నేడు 0.84 శాతం (రూ.16.55) నష్టపోయి రూ.1947.50 వద్ద ముగిసింది.

PSU స్టాక్స్ మాత్రమే నిలబడ్డాయి

PSU స్టాక్స్ మాత్రమే నిలబడ్డాయి

ఐటీ స్టాక్స్‌లో టీసీఎస్ 0.81 శాతం, హెచ్‌సీఎల్ స్టాక్ 1.84 శాతం, ఇన్ఫోసిస్ 1.86 శాతం, టెక్ మహీంద్రా 2 శాతం, విప్రో 1.52 శాతం, మైండ్ ట్రీ 2.28 శాతం, కోఫోర్జ్ 1.14 శాతం నష్టపోయింది.

సెన్సెక్స్ నేటి రికార్డు గరిష్టం నుండి 1000 పాయింట్లు, నిఫ్టీ 300 పాయింట్లు పడిపోయింది.

నిఫ్టీ బ్యాంకు 30,000 మార్కు అందుకున్నప్పటికీ దానిని నిలబెట్టుకోలేకపోయింది. 3.5 శాతం పడిపోయి 29,196 పాయింట్ల వద్ద ముగిసింది.

ఇండియా వొలాటిలిటీ ఇండెక్స్ 10 శాతం పెరిగింది.

అన్ని రంగాలు నష్టాల్లో ముగిసినప్పటికీ PSU స్టాక్స్ మాత్రమే నిలబడ్డాయి.

ప్రధానంగా ప్రాఫిట్ బుకింగ్ ప్రభావం కనిపించింది.

English summary

ప్రాఫిట్ బుకింగ్ ఎఫెక్ట్, మార్కెట్ భారీ పతనం: సెన్సెక్స్ 695 పాయింట్లు డౌన్ | Sensex plunges 695 points, Nifty ends below 12,900

In sync with the benchmarks, BSE Midcap and Smallcap indices too suffered strong losses. Barring Oil & Gas, all sectoral indices ended in the red on BSE, with Realty, Telecom, Bankex among the top losers.
Story first published: Wednesday, November 25, 2020, 17:33 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X