For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బడ్జెట్‌కు ముందు వరుసగా పతనం, సెన్సెక్స్ 600 పాయింట్లు డౌన్: 4 రోజుల్లో 2300

|

ముంబై: కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశ పెట్టడానికి ముందు మార్కెట్లు కుప్పకూలుతున్నాయి. నేడు సెన్సెక్స్ 900 పాయింట్లు నష్టపోయింది. గత గురువారం 50,000 పాయింట్లను తాకిన సెన్సెక్స్ ఆ తర్వాత నుండి కుప్పకూలుతోంది. నాలుగు సెషన్లుగా మార్కెట్లు తీవ్ర వష్టాల్లో ముగియడం లేదా కొనసాగడం జరుగుతోంది. గతవారం 50వేల మార్కు దాటిన సెన్సెక్స్ ఇప్పుడు 47,800 దిగువకు పడిపోయింది. నిఫ్టీ గతవారం 14,750 పై నుండి 14,100 పాయింట్ల దిగువకు చేరుకుంది. నేడు కేంద్ర కేబినెట్ కూడా భేటీ అవుతోంది. పీఎస్‌యూ ప్రయివేటైజేషన్ పాలసీకి కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది.

పరిహారం చెల్లించకపోతే ఆ ఆస్తులు జఫ్తు చేస్తాం: భారత్‌కు కెయిర్న్ తీవ్ర హెచ్చరికపరిహారం చెల్లించకపోతే ఆ ఆస్తులు జఫ్తు చేస్తాం: భారత్‌కు కెయిర్న్ తీవ్ర హెచ్చరిక

సెన్సెక్స్ 600 పాయింట్లు డౌన్

సెన్సెక్స్ 600 పాయింట్లు డౌన్

సెన్సెక్స్ ఉదయం గం.09:15 సమయానికి 280.96 పాయింట్లు లేదా 0.58% క్షీణించి 48,066.63 పాయింట్ల వద్ద నిఫ్టీ 81 పాయింట్లు లేదా 0.57% పడిపోయి 14,157.90 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. 526 షేర్లు లాభాల్లో, 586 షేర్లు నష్టాల్లో ట్రేడ్ అయ్యాయి. 88 షేర్లలో ఎలాంటి మార్పులేదు. దాదాపు అన్ని రంగాలు కూడా నష్టాల్లోనే ఉన్నాయి.

సెన్సెక్స్ ఉదయం 48,385.28 ప్రారంభమైనప్పటికీ, గరిష్టం 48,387.25 మాత్రమే. 47,709 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. ఫైనాన్షియల్ స్టాక్స్ అమ్మకాలు వెల్లువెత్తాయి. సెన్సెక్స్ 50వేల మార్కు నుండి ఈ నాలుగు సెషన్లలో 2300 మేరకు పడిపోయింది. మధ్యాహ్నం గం.1 సమయానికి సెన్సెక్స్ 47,754 పాయింట్ల వద్ద ఉంది. డాలర్ మారకంతో రూపాయి స్వల్పంగా లాభపడి 72.94 వద్ద ప్రారంభమైంది. సోమవారం 72.95 వద్ద ముగిసింది.

టాప్ గెయినర్స్, లూజర్స్

టాప్ గెయినర్స్, లూజర్స్

టాప్ గెయినర్స్ జాబితాలో విప్రో 2.60 శాతం, టెక్ మహీంద్రా 2.50 శాతం, అల్ట్రా టెక్ సిమెంట్ 2.64 శాతం, ఐటీసీ 2.00 శాతం, HDFC లైఫ్ 1.93 లాభపడ్డాయి.

టాప్ లూజర్స్ జాబితాలో టాటా మోటార్స్ 3.19 శాతం, యాక్సిస్ బ్యాంకు 3.14 శాతం, HDFC 2.68 శాతం, గెయిల్ 2.52 శాతం, ఏషియన్ పేయింట్స్ 2.48 శాతం నష్టపోయాయి.

మోస్ట్ యాక్టివ్ స్టాక్స్‌లో రిలయన్స్, టాటా మోటార్స్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, బజాజ్ ఫైనాన్స్, యాక్సిస్ బ్యాంకు ఉన్నాయి.

రిలయన్స్ షేర్ నేడు 1.54 శాతం లేదా రూ.30 క్షీణించి రూ.1911 వద్ద ట్రేడ్ అయింది.

రంగాలవారీగా..

రంగాలవారీగా..

నిఫ్టీ 50 స్టాక్స్ 1.11 శాతం, నిఫ్టీ మిడ్ క్యాప్ 0.85 శాతం నష్టపోయాయి. నిఫ్టీ ఆటో 0.65 శాతం, నిఫ్టీ బ్యాంకు 1.66 శాతం, నిఫ్టీ ఎనర్జీ 0.99 శాతం, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ 1.72 శాతం, నిఫ్టీ ఐటీ 0.49 శాతం, నిఫ్టీ మెటల్ 1.24 శాతం, నిఫ్టీ ఫార్మా 1.42 శాతం, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంకు 0.68 శాతం, నిఫ్టీ రియాల్టీ 1.54 శాతం, నిఫ్టీ ప్రయివేటు బ్యాంకు 1.82 శాతం నష్టపోయాయి. నిఫ్టీ ఎఫ్ఎంసీజీ 0.34 శాతం, నిఫ్టీ మీడియా 0.28 శాతం మాత్రం లాభపడ్డాయి.

English summary

బడ్జెట్‌కు ముందు వరుసగా పతనం, సెన్సెక్స్ 600 పాయింట్లు డౌన్: 4 రోజుల్లో 2300 | Sensex plunges 600 points, Nifty below 14,100 amid selloff in financial stocks

Nifty Bank, metal and pharma indices shed over a percent each. Sun Pharma, Axis Bank, HDFC, Asian Paints and Titan Company were among major losers on the BSE Sensex.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X