For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సెన్సెక్స్ సరికొత్త రికార్డ్: IRCTC దాదాపు 8% జంప్, రిలయన్స్ రూ.2,000కు చాలా దూరంలోనే..

|

ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం (డిసెంబర్ 7) ఫ్లాట‌గా ప్రారంభమయ్యాయి. ఉదయం గం.9.20 సమయానికి సెన్సెక్స్ 7 పాయింట్ల లాభపడింది. నిఫ్టీ 13,265 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. ఓఎన్జీసీ స్టాక్స్ 4 శాతం, భారతీ ఎయిర్ టెల్ స్టాక్స్ 2 శాతం లాభపడ్డాయి. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు క్షీణించాయి. వివిధ దేశాల్లో కరోనా కేసులు పెరగడం, లాక్ డౌన్ ఆంక్షలు కొనసాగుతున్న నేపథ్యంలో డిమాండ్ తగ్గుతుందనే ఆందోళన నేపథ్యంలో ఈ వారంలో ప్రారంభంలోనే చమురు ధరలు క్షీణించాయి. ఆసియా, అంతర్జాతీయ, భారత మార్కెట్లు కాస్త సానుకూలంగా ఉన్నాయి. ఐఆర్‌సీటీసీ స్టాక్స్ 8 శాతం లాభపడింది.

సరికొత్త గరిష్టాలకు..

సరికొత్త గరిష్టాలకు..

సెన్సెక్స్ గతవారం 45,079.55 పాయింట్ల వద్ద ముగిసింది. నేడు స్వల్ప లాభాల్లో ప్రారంభమై, అదే ఒరవడి కొనసాగిస్తోంది. ఉదయం గం.9.51 సమయానికి సెన్సెక్స్ 171 పాయింట్లు లాభపడి 45,250 పాయింట్ల వద్ద ఉంది. తద్వారా సెన్సెక్స్ నేడు మరోసారి జీవనకాల గరిష్టాన్ని తాకింది. నిఫ్టీ 10 పాయింట్లు లేదా 0.08 శాతం లాభపడి 13,269 పాయింట్ల వద్ద ప్రారంభం ్యింది. 1180 షేర్లు లాభాల్లో, 377 షేర్లు నష్టాల్లో ప్రారంభం కాగా, 86 షేర్లలో ఎలాంటి మార్పులేదు.

రూ.2000కు దిగువనే రిలయన్స్

రూ.2000కు దిగువనే రిలయన్స్

ఉదయం గం.9.45 సమయానికి టాప్ గెయినర్స్ జాబితాలో అదానీ పోర్ట్స్ 3.37 శాతం, ONGC 2.73 శాతం, BPCL 2.56 శాతం, గెయిల్ 2.63 శాతం, యూపీఎల్ 2.06 శాతం లాభపడ్డాయి.

టాప్ లూజర్స్ జాబితాలో HDFC బ్యాంకు 1.21 శాతం, దివిస్ ల్యాబ్స్ 1.15 శాతం, టైటాన్ కంపెనీ 1.05 శాతం, కొటక్ మహీంద్ర బ్యాంకు 0.82, హెచ్‌సీఎల్ టెక్ 0.63 శాతం నష్టపోయాయి.

మోస్ట్ యాక్టివ్ స్టాక్స్‌లో ఐసీఐసీఐ బ్యాంకు, ఎస్బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, భారతీ ఎయిర్‌టెల్, రిలయన్స్ ఉన్నాయి.

రిలయన్స్ స్టాక్ స్టాక్ ధర నేడు 0.26 శాతం పెరిగి రూ.1952 వద్ద ట్రేడ్ అయింది. గత కొద్ది సెషన్లుగా రూ.2000కు దిగువనే పలుకుతోంది.

రంగాలవారీగా..

రంగాలవారీగా..

రంగాలవారీగా చూస్తే నిఫ్టీ 50 స్టాక్స్ 0.35 శాతం, మిడ్ క్యాప్ సూచీలు 0.72 శాతం ఎగిశాయి. నిఫ్టీ ఆటో 0.08 శాతం, నిఫ్టీ బ్యాంకు 0.13 శాతం, నిఫ్టీ ఎనర్జీ 0.80 శాతం, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ 0.06 శాతం, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ 1.27 శాతం, నిఫ్టీ ఐటీ 0.09 శాతం, నిఫ్టీ మీడియా 1.41 శాతం, నిఫ్టీ మెటల్ 0.71 శాతం, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంకు 0.85 శాతం, నిఫ్టీ రియాల్టీ 0.25 శాతం, నిఫ్టీ ప్రయివేటు బ్యాంకు 0.29 శాతం లాభపడ్డాయి.

నిఫ్టీ ఫార్మా మాత్రం 0.08 శాతం నష్టపోయింది.

ఐటీలో టీసీఎస్ స్టాక్స్ 0.65 శాతం, హెచ్‌సీఎల్ టెక్ స్టాక్ 0.49 శాతం నష్టపోయాయి.ఇన్ఫోసిస్ 0.35 శాతం, టెక్ మహీంద్రా స్టాక్ 0.37 శాతం, కోఫోర్జ్ స్టాక్ 0.32 శాతం, మైండ్ ట్రీ స్టాక్ 1.43 శాతం లాభపడ్డాయి.

English summary

సెన్సెక్స్ సరికొత్త రికార్డ్: IRCTC దాదాపు 8% జంప్, రిలయన్స్ రూ.2,000కు చాలా దూరంలోనే.. | Sensex opens flat, Nifty tops 13,250: IRCTC gains 8 percent

The NSE has revised circuit limits of 302 stocks, including Adani Gas, Angel Broking, and Emkay Global among others, with effect from today.
Story first published: Monday, December 7, 2020, 9:56 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X