For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పడిలేచిన సెన్సెక్స్: ఐటీ స్టాక్స్, రిలయన్స్ భారీ జంప్, కిందకు లాగిన HDFC

|

ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్ల సోమవారం (నవంబర్ 23) భారీ లాభాల్లో ప్రారంభమయ్యాయి. క్రితం సెషన్లో 43,882 పాయింట్ల వద్ద క్లోజ్ అయిన సెన్సెక్స్ నేడు 44వేల మార్కు పైన ప్రారంభమైంది. అయితే ఆ తర్వాత కాసేపటికే ఆ మార్కు దిగువకు వచ్చింది. ఉదయం గం.09:17 సమయానికి సెన్సెక్స్ 350.09 పాయింట్ల(0.80%) ఎగిసి 44,232.34 పాయింట్ల వద్ద, నిఫ్టీ 95 పాయింట్లు(0.74%) లాభపడి 12,954 పాయింట్ల వద్ద ప్రారంభమైంది.

1013 షేర్లు లాభాల్లో, 325 షేర్లు నష్టాల్లో ప్రారంభం కాగా, 69 షేర్లలో ఎలాంటి మార్పులేదు. బ్యాంకింగ్ రంగ షేర్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. ఐటీ, మెటల్, ఫార్మా రంగ షేర్లు ఒక శాతం నుండి రెండు శాతం మేర లాభపడ్డాయి.

పన్ను ఎగవేతలు, దుర్వినియోగం.. భారత్‌కు రూ.75,000 కోట్ల నష్టంపన్ను ఎగవేతలు, దుర్వినియోగం.. భారత్‌కు రూ.75,000 కోట్ల నష్టం

మార్కెట్లు 'పడి'లేచాయి

మార్కెట్లు 'పడి'లేచాయి

ఉదయం గం.12 సమయానికి సెన్సెక్స్ 93.76 (0.21%) పాయింట్లు లాభపడి 43,976.01 వద్ద ట్రేడ్ అయింది. ఓ సమయంలో సెన్సెక్స్ క్రితం సెషన్ కంటే 120 పాయింట్లు పడిపోయి 43,763.51 పాయింట్ల వద్ద ట్రేడ్ అయింది. ఉదయం భారీ లాభాల నుండి నష్టాల్లోకి వెళ్లి, ఆ తర్వాత 100 పాయింట్ల లాభంలో ట్రేడ్ అయింది. నిఫ్టీ 40.05 (0.31%) పాయింట్లు ఎగిసి 12,899.10 వద్ద ట్రేడ్ అయింది. నిఫ్టీ ఓ సమయంలో 12,960 పాయింట్లను తాకింది. ఆ తర్వాత క్రితం సెషన్ క్లోజింగ్ (12,859) కంటే పడిపోయి 12,834 వద్ద ట్రేడ్ అయింది. తర్వాత కోలుకొని 30 పాయింట్ల లాభంలో ట్రేడ్ అయింది.

నిఫ్టీ ఐటీ, ఫార్మా జంప్

నిఫ్టీ ఐటీ, ఫార్మా జంప్

నేటి టాప్ గెయినర్స్ జాబితాలో ఇండస్ ఇండ్ బ్యాంకు 4.27 శాతం, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ 3.51 శాతం, బజాజ్ ఫిన్ సర్వ్ 3.31 శాతం, రిలయన్స్ 2.92 శాతం, టెక్ మహీంద్ర 2.43 శాతం ఉన్నాయి.

టాప్ లూజర్స్ జాబితాలో HDFC 3.79 శాతం, టైటాన్ కంపెనీ 2.14 శాతం, ICICI బ్యాంకు 1.96 శాతం, మహీంద్రా అండ్ మహీంద్రా 1.96 శాతం, యాక్సిస్ బ్యాంకు 1.23 శాతం నష్టాల్లో ట్రేడ్ అయ్యాయి.

మోస్ట్ యాక్టివ్ స్టాక్స్‌లో రిలయన్స్, బజాజ్ ఫిన్ సర్వ్, బజాజ్ ఫైనాన్స్, ఇండస్ ఇండ్ బ్యాంకు, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ఉన్నాయి.

నిఫ్టీ ఆటో 0.01 శాతం, నిఫ్టీ బ్యాంకు 0.75 శాతం, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ 1.20 శాతం, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ 0.01 శాతం, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంకు 0.29 శాతం, నిఫ్టీ ప్రయివేటు బ్యాంకు 0.59 శాతం నష్టపోయాయి.

నిఫ్టీ ఎనర్జీ 1.98 శాతం, నిఫ్టీ ఐటీ 1.79 శాతం, నిఫ్టీ మీడియా 0.83 శాతం, నిఫ్టీ మెటల్ 0.68 శాతం, నిఫ్టీ ఫార్మా 2.30 శాతం, నిఫ్టీ రియాల్టీ 0.54 శాతం లాభపడ్డాయి.

ఐటీ, ఫార్మా రంగాలు మార్కెట్లను పైకి లాగగా, హెచ్‌డీఎఫ్‌సీ, ఇండస్ ఇండ్ బ్యాంకు తదితర బ్యాంకింగ్ రంగ స్టాక్స్ నష్టాల్లోకి లాగాయి.

HDFC షేర్ ధర ఏకంగా 4.40 శాతం పడిపోయింది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు స్టాక్ 0.68 శాతం నష్టపోయింది. ఇండస్ఇండ్ బ్యాంకు స్టాక్ 4.43 శాతం నష్టపోయింది.

లాభాల్లో రిలయన్స్.. ఐనా రూ.2000 లోపే..

లాభాల్లో రిలయన్స్.. ఐనా రూ.2000 లోపే..

నేటి ప్రారంభ సెషన్లో ఫార్మా, ఐటీ స్టాక్స్ సూచీలను పైకి లేపాయి. క్రితం సెషన్లో రూ.1900 వద్ద ముగిసిన రిలయన్స్ స్టాక్ నేడు 3.28 శాతం లాభపడి రూ.1962 వద్ద ట్రేడ్ అయింది. అయినప్పటికీ రూ.2000కు దిగువనే ఉంది.

ఐటీ స్టాక్స్‌లో టీసీఎస్ స్టాక్ 1.93 శాతం, హెచ్‌సీఎల్ టెక్ 1.72 శాతం, ఇన్ఫోసిస్ 2.23 శాతం, టెక్ మహీంద్ర 3.04 శాతం, విప్రో 1.59 శాతం, మైండ్ ట్రీ 2.32 శాతం, కోఫోర్జ్ 2.42 శాతం లాభపడ్డాయి.

English summary

పడిలేచిన సెన్సెక్స్: ఐటీ స్టాక్స్, రిలయన్స్ భారీ జంప్, కిందకు లాగిన HDFC | Sensex, Nifty turn flat: IndusInd Bank top gainer, HDFC drags

Among sectors, some selling seen in the banking names, while IT, metal and pharma indices rose 1-2 percent.
Story first published: Monday, November 23, 2020, 12:43 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X