For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

లాభాల్లో స్టాక్ మార్కెట్లు, పార్మా రంగ షేర్లు జూమ్

|

దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం లాభాల్లో ట్రేడింగ్ ప్రారంభించాయి. ఉదయం గం.9.16 సమయానికి సెన్సెక్స్ 130.20 పాయింట్లు లేదా 0.34% ఎగిసి 38,440.69, నిఫ్టీ 39.30 పాయింట్లు లేదా 0.35% లాభపడి 11,339.80 వద్ద ట్రేడింగ్ ప్రారంభించింది. 871 షేర్లు లాభాల్లో, 282 షేర్లు నష్టాల్లో ప్రారంభం కాగా 61 షేర్లలో ఎలాంటి మార్పు లేదు. మధ్యాహ్నం గం.12 సమయానికి సెన్సెక్స్ 109 పాయింట్లు లాభపడింది. డాలర్ మారకంతో రూపాయి 74.85 వద్ద ప్రారంభించింది. అంతకు ముందు సెషన్‌లో 74.84 వద్ద ముగిసింది.

మైక్రోసాఫ్ట్ ఆసక్తి.. ముఖేష్ అంబానీ రిలయన్స్‌తో టిక్‌టాక్ చర్చలుమైక్రోసాఫ్ట్ ఆసక్తి.. ముఖేష్ అంబానీ రిలయన్స్‌తో టిక్‌టాక్ చర్చలు

ఫార్మా స్టాక్స్ భారీ లాభాల్లో ప్రారంభమయ్యాయి. టాప్ గెయినర్స్ జాబితాలో సన్ ఫార్మా, సిప్లా, గ్రాసిమ్, లార్సన్, శ్రీ సిమెంట్స్, టాప్ లూజర్స్ జాబితాలో ఐచర్ మోటార్స్, టాటా మోటార్స్, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్, హెచ్‌సీఎల్ టెక్, ఓఎన్జీసీ టాప్ లూజర్స్ జాబితాలో ఉన్నాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ ఈ రోజు దాదాపు 1 శాతం ఎగిసి రూ.2,143 వద్ద ఉంది.

Sensex, Nifty trade higher: pharma stocks gain

2020-21 ఆర్థిక సంవత్సరం మొదటి క్వార్టర్‌లో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించడంతో ఐచర్ మోటార్స్ మధ్యాహ్నం సమయానికి 4 శాతానికి పైగా నష్టపోయింది. ఐచర్ మోటార్స్ కౌంటర్లో అమ్మకాలు పెరిగాయి. దీంతో మార్కెట్లు లాభాల్లో ఉన్నప్పటికీ ఐచర్ మోటార్స్ నష్టపోయాయి. కరోనా వ్యాప్తిని నిరోధించేందుకు లాక్‌డౌన్ అమలు కారణంగా మొదటి క్వార్టర్‌లో కంపెనీల పనితీరు మందగించినట్లు చెబుతున్నారు.

English summary

లాభాల్లో స్టాక్ మార్కెట్లు, పార్మా రంగ షేర్లు జూమ్ | Sensex, Nifty trade higher: pharma stocks gain

Benchmark indices are trading higher led by the pharma stocks. Eicher Motors, Hero MotoCorp, HDFC Life, Power Grid Corp and HCL Tech are among major losers on the Nfity.
Story first published: Friday, August 14, 2020, 11:59 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X