For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నష్టాల్లో స్టాక్ మార్కెట్లు: LVB, రిలయన్స్, ఐటీ స్టాక్స్ పతనం

|

ముంబై: స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ప్రారంభమై, ఊగిసలాటలో కొనసాగుతున్నాయి. బుధవారం(నవంబర్ 18) ఉదయం గం.9:15 సెన్సెక్స్ 111.01 పాయింట్లు(0.25%) నష్టపోయి 43,841.70, వద్ద, నిఫ్టీ 30.70 పాయింట్లు(0.24%) 12,843.50 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. 594 షేర్లు లాభాల్లో,420 షేర్లు నష్టాల్లో ప్రారంభమయ్యాయి.

నిఫ్టీ ఎఫ్ఎంసీజీ, నిఫ్టీ ఫార్మా, నిఫ్టీ ఐటీ స్టాక్స్ ఒక శాతం మేర నష్టపోయాయి. ఆటో, పీఎస్‌యూ బ్యాంకు సూచీ ఒక శాతం చొప్పున ఎగిశాయి. ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయిన లక్ష్మీ విలాస్ బ్యాంకు స్టాక్స్ భారీగా నష్టపోయాయి. ఇక, డాలర్ మారకంతో రూపాయి 74.49 వద్ద ప్రారంభమైంది. క్రితం సెషన్‌లో 74.46 వద్ద క్లోజ్ అయింది.

లక్ష్మీ విలాస్ బ్యాంకు స్టాక్ డౌన్

లక్ష్మీ విలాస్ బ్యాంకు స్టాక్ డౌన్

ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుపోయిన లక్ష్మీ విలాస్ బ్యాంకు(LVB) స్టాక్ మధ్యాహ్నం గం.1.15 సమయానికి 20 శాతం మేర నష్టపోయి రూ.12.45 వద్ద ట్రేడ్ అయింది. నెల రోజుల పాటు ఈ బ్యాంకుపై తాత్కాలిక మారటోరియం విధించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత డీబీఎస్ బ్యాంకులో విలీనం అయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ బ్యాంకు స్టాక్స్ నష్టాల్లో ఉన్నాయి.

టాప్ గెయినర్స్ జాబితాలో టాటా మోటార్స్ 7.47 శాతం, లార్సన్ 5.16 శాతం, బజాజ్ ఫిన్ సర్వ్ 3.50 శాతం, బజాజ్ ఫైనాన్స్ 3.35 శాతం లాభాల్లో ఉన్నాయి.

టాప్ లూజర్స్ జాబితాలో BPCL 4.04 శాతం, టైటాన్ కంపెనీ 2.37 శాతం, హీరో మోటో కార్ప్ 2.32 శాతం, భారతీ ఎయిర్‌టెల్ 2.21 శాతం, టీసీఎస్ 2.09 శాతం నష్టాల్లో ఉన్నాయి.

మోస్ట్ యాక్టివ్ స్టాక్స్‌లో బజాజ్ ఫైనాన్స్, రిలయన్స్, టాటా మోటార్స్, ఎస్బీఐ, మహీంద్రా అండ్ మహీంద్రా ఉన్నాయి.

పడిపోయిన రిలయన్స్

పడిపోయిన రిలయన్స్

రంగాలవారీగా నిఫ్టీ ఆటో 2.37 శాతం, నిఫ్టీ బ్యాంకు 1.11 శాతం, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ 0.64 శాతం, నిఫ్టీ మీడియా 0.41 శాతం, నిఫ్టీ మెటల్ 0.05 శాతం, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంకు 2.15 శాతం, నిఫ్టీ రియాల్టీ 1.05 శాతం, నిఫ్టీ ప్రయివేటు బ్యాంకు 1.12 శాతం లాభపడ్డాయి.

నిఫ్టీ 0.54 శాతం, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ 1.14 శాతం, నిఫ్టీ ఐటీ 1.47 శాతం, నిఫ్టీ ఫార్మా 1.18 శాతం నష్టాల్లో ఉన్నాయి.

ఆసియా కుబేరుడు రిలయన్స్ ఇండస్ట్రీస్ స్టాక్ నేడు మరింత పతనమైంది. 1.22 శాతం క్షీణించి రూ.1969 పలికింది. ఓ సమయంలో రూ.2005ను తాకిన స్టాక్ ఆ తర్వాత రూ.1970 దిగువకు వచ్చింది

సెన్సెక్స్ కూడా ఓ సమయంలో 44వేల మార్కును దాటింది. కానీ ఆ తర్వాత మళ్లీ పడిపోయింది.

ఐటీ స్టాక్స్ అన్నీ డౌన్

ఐటీ స్టాక్స్ అన్నీ డౌన్

ఐటీ స్టాక్స్‌లో టీసీఎస్ 1.91 శాతం, హెచ్‌సీఎల్ టెక్ 1.48 శాతం, ఇన్ఫోసిస్ 1.79 శాతం, టెక్ మహీంద్ర 1.38 శాతం, విప్రో 1.81 శాతం, మైండ్ ట్రీ 1.49 శాతం, కోఫోర్జ్ 0.23 శాతం క్షీణించాయి. ఐటీ స్టాక్స్ అన్నీ నష్టాల్లోనే ట్రేడ్ అయ్యాయి.

English summary

నష్టాల్లో స్టాక్ మార్కెట్లు: LVB, రిలయన్స్, ఐటీ స్టాక్స్ పతనం | Sensex, Nifty off to cautious start: LVB plunges 20 percent

Benchmark indices kicked off Wednesday's session on a cautious note as investors tried to gauge the impact of rising Covid cases and possible short-term lockdowns amid the otherwise optimistic outlook over vaccine development. Fatigue on technical charts and valuation concerns kept the upside capped after the relentless three-day gains on Dalal Street.
Story first published: Wednesday, November 18, 2020, 13:46 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X